ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం భారతదేశంలో ప్రతీ ఏడాది 28 లక్షల మంది పాముకాటుకు గురవుతుంటారు. వారిలో 46,900 మంది చనిపోతుంటారు. ఇందుకు కారణం... పాము కరిచిన వెంటనే వారికి సరైన వైద్య సహాయం అందకపోవడం, పాము కరవగానే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన లేకపోవడమే. పాముకాటు తర్వాత ఏం చేయాలో చెప్పే అవగాహన కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. ఆన్‌లైన్‌లో కావాల్సినంత సమాచారం ఉంటుంది. కానీ వాటి గురించి తెలుసుకోకపోవడం వల్ల ఇలా మరణాల పాలవుతుంటారు. ఈ సమస్యలకు పరిష్కారం సూచిస్తూ స్వచ్ఛంద సంస్థ అయిన వైల్డ్‌లైఫ్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా 'ఇండియన్ స్నేక్స్' పేరుతో ఓ యాప్ రూపొందించింది. ప్రస్తుతం గూగుల్ ప్లే స్టోర్‌లో ఈ యాప్ అందుబాటులో ఉంది. 10 ఎంబీ కన్నా తక్కువ సైజ్‌లో ఉన్న ఈ యాప్‌ను ఇప్పటికే 10,000 మందికి పైగా డౌన్‌లోడ్ చేసుకున్నారు.
పాములు, పాము కాట్లు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమస్త సమాచారం ఈ యాప్‌లో ఉంటుంది. భారతదేశంలో తిరిగే 250 పైగా పాముల సమాచారం ఇందులో ఉంటుంది. అంతేకాదు... పాము కాటుకు గురైతే సరైన చికిత్స అందించే ఆస్పత్రుల జాబితా ఉంటుంది. మీ లొకేషన్‌కు దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి వెంటనే వెళ్లడానికి అవకాశముంటుంది. ఇక పాము కాటు తర్వాత అత్యవసర చికిత్స అందించే నిపుణుల జాబితా కూడా ఈ యాప్‌లో ఉంటుంది. వారి సాయాన్ని తీసుకోవచ్చు. మీరు పామును గుర్తిస్తే ఫోటో తీసి అప్‌లోడ్ చేస్తే నిపుణులు అందుబాటులోకి వచ్చి తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచిస్తారు. అంతేకాకుండా... పాములు ఎన్ని రకాలు, అవి కాటెయ్యడం వల్ల ఉండే ప్రమాదం, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పే సమాచారం, వీడియోలు అందుబాటులో ఉంటాయి. మీకు ఎక్కడైనా పాము కనిపిస్తే కూడా సమాచారం ఇవ్వొచ్చు. ఈ యాప్ డౌన్‌లోడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
Vivo S1: వివో ఎస్1 ధర తగ్గింది... ఫోన్ ఎలా ఉందో చూడండి
ఇవి కూడా చదవండి:
Flipkart: విద్యార్థులకు గుడ్ న్యూస్... 'ఫ్లిప్‌కార్ట్ ప్లస్' ఉచితం
SBI Card: మీ ఎస్‌బీఐ ఏటీఎం కార్డు మార్చలేదా? డిసెంబర్ 31 డెడ్‌లైన్
Realme X2 Pro: గుడ్ న్యూస్... తక్కువ ధరకే రానున్న రియల్‌మీ ఎక్స్2 ప్రో
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Mobile App, Snake, Snake bite, Snakes