Home /News /technology /

WI FI CALLING OF VOFI CALLING ALLOWS USERS TO PERFORM REGULAR CALLS IN AREAS WITH POOR CONNECTIVITY AND HOW TO ENABLE IT ON SMARTPHONES GH SRD

Wifi Calling: వై-ఫై కాలింగ్ అంటే ఏంటి? స్మార్ట్‌ఫోన్‌లలో దీన్ని ఎలా ఎనేబుల్ చేయాలంటే..

Wifi Calling

Wifi Calling

Wifi Calling: ఆ సమయాల్లో కాల్ కట్ అవడం లేదా అవతలి వ్యక్తి వాయిస్ సరిగ్గా వినిపించకపోవడం జరుగుతుంది. అయితే తక్కువ సిగ్నల్ కనెక్టివిటీ (Signal Connectivity) ఉన్న ప్రాంతాల్లోనూ కాల్ డ్రాప్స్ సమస్యలు లేకుండా రెగ్యులర్ ఫోన్ కాల్స్ చేసేందుకు అవకాశం ఉంది.

ఇంకా చదవండి ...
మొబైల్ నెట్‌వర్క్‌ కనెక్టివిటీ తక్కువగా ఉన్నప్పుడు కాల్ డ్రాప్స్ అవుతుంటాయి. సెల్‌ఫోన్ టవర్లకు సుదూర ప్రాంతాల్లో నివసిస్తున్న యూజర్లకు మాత్రమే కాదు కాల్ డ్రాప్ సమస్య (Call drop) అందరినీ వేధిస్తుంటుంది. ఆఫీస్ లోపల, అండర్ గ్రౌండ్ ఏరియాలలో ఉన్నప్పుడు మొబైల్ నెట్‌వర్క్‌ సిగ్నల్స్ (Network Signals) తగ్గిపోతుంటాయి. ఆ సమయాల్లో కాల్ కట్ అవడం లేదా అవతలి వ్యక్తి వాయిస్ సరిగ్గా వినిపించకపోవడం జరుగుతుంది. అయితే తక్కువ సిగ్నల్ కనెక్టివిటీ (Signal Connectivity) ఉన్న ప్రాంతాల్లోనూ కాల్ డ్రాప్స్ సమస్యలు లేకుండా రెగ్యులర్ ఫోన్ కాల్స్ చేసేందుకు అవకాశం ఉంది. ఇందుకు యూజర్లు వై-ఫై కాలింగ్ ఫీచర్ ఎనేబుల్ చేయాల్సి ఉంటుంది.

భారత్‌లో ఎయిర్‌టెల్, జియోతో పాటు చాలా టెలికాం సంస్థలు వై-ఫై కాలింగ్‌ సదుపాయాన్ని ఉచితంగా యూజర్లకు అందిస్తున్నాయి. వై-ఫై కాలింగ్ అనేది వై-ఫై నెట్‌వర్క్‌ సాయంతో పనిచేస్తుంది. అందువల్ల బలమైన వై-ఫై సిగ్నల్స్ ఉన్నచోటే ఈ సేవలను ఉపయోగించడం సాధ్యమవుతుంది.

వై-ఫై కాలింగ్‌ అనేది VoLTE (వాయిస్‌ ఓవర్‌ LTE) టెక్నాలజీకి బదులు VoIP (వాయిస్‌ ఓవర్‌ ఇంటర్నెట్‌ ప్రోటోకాల్‌) టెక్నాలజీని యూజ్ చేసి కాల్స్ కనెక్ట్ చేస్తుంది. ఇటీవల కాలంలో విడుదలవుతున్న అన్ని ఫోన్లలో వై-ఫై కాలింగ్‌ ఆప్షన్ ఉంటుంది. ఒకవేళ మీ ఫోన్‌లో ఈ ఆప్షన్‌ లేకపోతే వైఫై ద్వారా కాల్స్ చేయడం కుదరదు. మరి వై-ఫై కాలింగ్ ఆప్షన్‌ ఉన్నవారు దాన్నెలా యాక్టివేట్ చేసుకోవాలో తెలుసుకుందాం..

• ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్లు ఇలా చేయండి

స్టెప్ 1: ఆండ్రాయిడ్ ఫోన్‌లోని సెట్టింగ్స్‌ మెనూకు వెళ్లాలి. తరువాత "నెట్‌వర్క్స్ " ఆప్షన్ పై క్లిక్ చేయాలి. కొన్ని ఆండ్రాయిడ్ ఫోన్లలో నెట్‌వర్క్స్ కి బదులు "మొబైల్ నెట్‌వర్క్స్" లేదా "కనెక్షన్స్‌ (Connections)" అని ఉంటుంది.

స్టెప్ 2: నెట్‌వర్క్‌ సెక్షన్‌కు వెళ్లిన తర్వాత వై-ఫై ప్రిఫరెన్స్‌ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. తరువాత "అడ్వాన్స్‌డ్‌" ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి.

స్టెప్ 3: 'వై-ఫై కాలింగ్' ఆప్షన్ పై క్లిక్ చేయాలి. మీ ఫోన్‌లో రెండు సిమ్‌ కార్డులు ఉంటే.. వాటిలో మీకిష్టమైన సిమ్‌ కార్డుకి వైఫై కాలింగ్ ఫీచర్ యాక్టివేట్ చేసుకోవచ్చు. చాలా ఫోన్లలో నెట్‌వర్క్‌ సెక్షన్‌లోనే వైఫై కాలింగ్ ఫీచర్ ఉంటుందని యూజర్లు గమనించాలి. ఆపరేటింగ్ సిస్టమ్ యూఐ బట్టి ఈ ప్రాసెస్ మారొచ్చు. కొన్ని ఫోన్లలో నేరుగా నోటిఫికేషన్ బార్‌లోనే వైఫై కాలింగ్ ఆప్షన్ ఉంటుంది.

• ఐఫోన్ యూజర్లు ఇలా యాక్టివేట్ చేయండి

స్టెప్ 1: ఐఫోన్‌లోని సెట్టింగ్స్‌కు వెళ్లి ఫోన్‌ ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి.

స్టెప్ 2: 'మొబైల్‌ డేటా' పై క్లిక్ చేసి వై-ఫై కాలింగ్‌ సెలెక్ట్ చేసుకోవాలి. మీ టెలికాం ఆపరేటర్‌ సపోర్ట్‌ చేస్తేనే వైఫై కాలింగ్ ఫీచర్ కనిపిస్తుంది.

స్టెప్ 3: ‘‘వై-ఫై కాలింగ్‌ ఆన్‌ దిస్‌ ఐఫోన్‌’’ ఫీచర్ టర్న్ ఆన్ చేయాలి. ఈ ఫీచర్ ఆన్ చేశాక.. మీ ఫోన్‌లోని స్టేటస్‌ బార్‌లో టెలికాం ఆపరేటర్స్ నేమ్( ఉదాహరణకి ఎయిర్‌టెల్) కింద వై-ఫై అని కనిపిస్తుంది. ఇక ఆ తర్వాత మీరు తక్కువ సిగ్నల్ ఉన్న ప్రాంతాల్లోనూ నిరంతరాయంగా రెగ్యులర్ కాల్స్ మాట్లాడుకోవచ్చు.
Published by:Sridhar Reddy
First published:

Tags: Android, Ios, Smartphones, Wifi

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు