Wi-Fi 6: ఈ వైఫైతో 3 సెకన్లలో 3 సినిమాల డౌన్‌లోడ్... ఇలా సాధ్యం

WI-FI 6 Technology | Wi-Fi 6 సపోర్ట్ చేసే మొదటి ఫోన్ ఇటీవల రిలీజైన Samsung Galaxy S10. వైఫై ద్వారా సెకన్‌కు 1.2 జీబీ అప్‌లోడ్, డౌన్‌లోడ్ సాధ్యం. అంటే... 1.2 జీబీ సైజ్ ఉన్న ఒక సినిమా డౌన్‌లోడ్ చేయాలంటే ఒక సెకన్ చాలు.

news18-telugu
Updated: March 15, 2019, 3:13 PM IST
Wi-Fi 6: ఈ వైఫైతో 3 సెకన్లలో 3 సినిమాల డౌన్‌లోడ్... ఇలా సాధ్యం
Wi-Fi 6: ఈ వైఫైతో 3 సెకన్లలో 3 సినిమాల డౌన్‌లోడ్... ఇలా సాధ్యం (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: March 15, 2019, 3:13 PM IST
మీరు మీ కంప్యూటర్‌లో ఒక సినిమా డౌన్‌లోడ్ చేయాలంటే ఎంత సమయం పడుతుంది? ఇది ఇంటర్నెట్ స్పీడ్‌పైన ఆధారపడి ఉంటుంది. ఇటీవల వైఫై టెక్నాలజీలో అప్‌డేటెడ్ వర్షన్ అయిన Wi-Fi 6 లాంఛైంది. ఈ టెక్నాలజీ ప్రత్యేకత తెలిస్తే మీరు షాకవ్వాల్సిందే. ఈ టెక్నాలజీతో మీరు ఓ సినిమాను ఒక సెండ్‌లో డౌన్‌లోడ్ చేయొచ్చు. 2019లో రిలీజ్ చేసిన వైఫైకి Wi-Fi 6 అని పేరు పెట్టింది వైఫై అలయెన్స్. మీరు మీ స్మార్ట్‌ఫోన్ లేదా వైఫై రౌటర్‌లో 802.11ac లేదా 802.11n అని రాసి ఉండటం చూశారా? అదేంటో చాలామందికి తెలియదు. వైఫై సామర్థ్యాన్ని తెలిపే కోడ్ అది. అంటే మీ స్మార్ట్‌ఫోన్ ఏ జెనరేషన్ వైఫైని సపోర్ట్ చేస్తుందో తెలిపే కోడ్ అది. వైఫై కనిపెట్టిన దగ్గర్నుంచి ఇప్పటి వరకు 5 వర్షన్లు రిలీజ్ అయ్యాయి. Wi-Fi 5 వర్షన్ కోడ్ 802.11ac.ఇటీవల Wi-Fi 6 అధికారికంగా రిలీజైంది. Wi-Fi 6 వర్షన్ కోడ్ 802.11ax. మీ స్మార్ట్‌ఫోన్‌లో లేటెస్ట్ వర్షన్‌లో అప్‌డేట్స్ చాలా ఉన్నట్టు వైఫై కొత్త వర్షన్‌లో కూడా అలాంటి అప్‌డేట్స్ ఉంటాయి. వైఫై-6లో కూడా అలాంటి అప్‌డేట్స్ చాలా ఉన్నాయి. ఇప్పటి వరకు రిలీజైన వైఫై వర్షన్లు ఇవే.

Wi-Fi 1: 802.11b (1999)
Wi-Fi 2: 802.11a (1999)

Wi-Fi 3: 802.11g (2003)
Wi-Fi 4: 802.11n (2009)


Wi-Fi 5: 802.11ac (2014)
Wi-Fi 6 802.11ax (2019)
Loading...

Wi-Fi 6 ప్రత్యేకతలు ఇవే...


వైఫై 6 వర్షన్‌ 2019లో లాంఛైంది. స్మార్ట్‌ఫోన్ ఉపయోగిస్తున్నవారికి ఇది నిజంగా శుభవార్తే. ఇప్పటివరకు రిలీజ్ చేసిన 5 వర్షన్లతో పోలిస్తే Wi-Fi 6 వర్షన్ చాలా అప్‌డేటెడ్. మీ ఫోన్ Wi-Fi 6 సపోర్ట్ చేస్తే డౌన్‌లోడ్ స్పీడ్, అప్‌లోడ్ స్పీడ్ ఎక్కువగా ఉంటుంది. Wi-Fi 6 సపోర్ట్ చేసే మొదటి ఫోన్ ఇటీవల రిలీజైన Samsung Galaxy S10. వైఫై ద్వారా సెకన్‌కు 1.2 జీబీ అప్‌లోడ్, డౌన్‌లోడ్ సాధ్యం. అంటే... 1.2 జీబీ సైజ్ ఉన్న ఒక సినిమా డౌన్‌లోడ్ చేయాలంటే ఒక సెకన్ చాలు.

Wi-Fi, Wi-Fi 6, Wi-Fi 802.11ac, 802.11ax, Wi-Fi Alliance, wifi speed, internet speed, data speed, వైఫై, వైఫై 6, ఇంటర్నెట్ స్పీడ్, వైఫై స్పీడ్, వైఫై టెక్నాలజీ
image: samsung


వైఫై 6 టెక్నాలజీ ఇంకా ఇతర ఫోన్లకు అందుబాటులోకి రాలేదు. కేవలం Samsung Galaxy S10 సిరీస్‌లో మాత్రమే ఉంది. కొత్త ఫోన్లల్లో ఈ టెక్నాలజీ వచ్చే అవకాశముంది. అంతే కాదు... టీవీలు, ల్యాప్‌టాప్స్, డోర్‌బెల్స్, వాషింగ్ మెషీన్లు, రౌటర్లు, ఇతర డివైజ్‌లు కూడా Wi-Fi 6 టెక్నాలజీతో రానున్నాయి. ఇందుకు ఇంకాస్త సమయం పట్టొచ్చు.

Photos: ఈ లేడీ బైకర్ ఆన్‌‌లైన్ సెన్సేషన్... అమ్మాయిలకు ఇన్‌స్పిరేషన్

ఇవి కూడా చదవండి:

 
First published: March 15, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...