WHY YOU SHOULD CREATE A SECONDARY GOOGLE OR GMAIL ACCOUNT GH VB
Gmail Accounts: మీకు రెండు జీమెయిల్ అకౌంట్లు ఉన్నాయా.. ఇలా వాడటం మంచిదేనా.. వివరాలు తెలుసుకోండి..
ప్రతీకాత్మక చిత్రం
ఆండ్రాయిడ్ యూజర్లకు జీమెయిల్ (Gmail) లేదా గూగుల్ (Google) అకౌంట్ ఉండటం తప్పనిసరి. యూట్యూబ్, గూగుల్ ప్లే, గూగుల్ డ్రైవ్ వంటి గూగుల్ యాప్స్ (Google Apps) గూగుల్ అకౌంట్ లేనిదే పనిచేయవు. కాబట్టి ఆండ్రాయిడ్ యూజర్లందరూ గూగుల్ అకౌంట్ కలిగి ఉంటారు.
ఆండ్రాయిడ్ యూజర్లకు జీమెయిల్ (Gmail) లేదా గూగుల్ (Google) అకౌంట్ ఉండటం తప్పనిసరి. యూట్యూబ్, గూగుల్ ప్లే, గూగుల్ డ్రైవ్ వంటి గూగుల్ యాప్స్ (Google Apps) గూగుల్ అకౌంట్ లేనిదే పనిచేయవు. కాబట్టి ఆండ్రాయిడ్ యూజర్లందరూ గూగుల్ అకౌంట్ కలిగి ఉంటారు. అయితే కొందరు ఒక్క గూగుల్ అకౌంట్‌తోనే సేవలన్నీ వినియోగిస్తుంటారు. ఇలా సింగిల్ గూగుల్ అకౌంట్ (Google Account) కలిగి ఉండటం మంచిది కాదంటున్నారు టెక్నాలజీ నిపుణులు. మీ ఏకైక గూగుల్ అకౌంట్ పాస్వర్డ్ (Password) మర్చిపోయినా లేదా అది హ్యాకింగ్‌కు గురైనా ఒక్కసారిగా ఎంతో విలువైన ఇన్ఫర్మేషన్ కోల్పోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. అందుకే అదనపు భద్రత కోసం సెకండరీ అకౌంట్ (secondary account) చాలా ముఖ్యం. మరి ఈ రెండో గూగుల్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి.. దీనివల్ల కలిగే మరిన్ని ప్రయోజనాలేంటో ఇప్పుడు చూద్దాం.
సెకండరీ గూగుల్ అకౌంట్ ఎలా ఉపయోగపడుతుంది?
యూజర్లు ఒక ఆల్టర్నేటివ్ గూగుల్ అకౌంట్‌ను కలిగి ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది ప్రస్తుత అకౌంట్ హ్యాక్‌కు గురైనా లేదా పాస్వర్డ్/యూజర్ నేమ్ మరచిపోయినా దాన్ని రికవర్ చేయడంలో సహాయపడుతుంది. నిజానికి గూగుల్ అకౌంట్ రికవరీకి అనేక మార్గాలు ఉన్నప్పటికీ మీ అకౌంట్‌ను రక్షించడానికి అదనపు భద్రతలు జోడించడం కూడా ముఖ్యం. సాధారణంగా గూగుల్ మీ అకౌంట్‌కు మీరు తిరిగి యాక్సెస్ పొందడానికి రికవరీ సెక్షన్లో ఫోన్ నంబర్, ఆల్టర్నేటివ్ ఈమెయిల్ అడ్రస్ అనే రెండు ఆప్షన్లను అందిస్తుంది. రికవరీ నిమిత్తం మీరు మీ ఫోన్ నంబర్ని ఇప్పటికే జోడించి ఉండవచ్చు. అయితే నంబర్ జోడించినా జోడించకపోయినా మీరు కొత్త గూగుల్ అకౌంట్‌ను ఓపెన్ చేసి, దానిని ప్రైమరీ అకౌంట్‌కు జత చేయాలి. అదెలాగో ఇప్పుడు చూద్దాం.
స్టెప్ 1: మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లో సెట్టింగ్ సెక్షన్ > గూగుల్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
స్టెప్ 2: "మేనేజ్ యువర్ గూగుల్ అకౌంట్ (manage your Google account)" పై నొక్కండి. "సెక్యూరిటీ (security)" ట్యాబ్‌పై క్లిక్ చేయండి.
స్టెప్ 3: వేస్ వీ కెన్ వెరిఫై ఇట్స్ యు "(Ways we can verify it's you)" సెక్షన్ కింద ఉండే రికవరీ (recovery section) సెక్షన్లో మీ రెండో అకౌంట్ యాడ్ చేయండి.
ఈ విధంగా మీ ఖాతా హ్యాక్‌కు గురైనా లేదా మీ రిజిస్టర్డ్ ఫోన్ నంబర్‌కు నెట్వర్క్ లేనపోయినా వెంటనే మీ రెండో గూగుల్ ఖాతాను ఉపయోగించి రికవర్ చేయొచ్చు. అలాగే పాస్వర్డ్ లేనిదే మీ రెండో ఈమెయిల్ ఐడీని ఎవరూ మీ అకౌంట్ నుంచి తొలగించలేరు కాబట్టి ఇది రికవరీకి సమర్థవంతంగా పనిచేస్తుంది.
సెకండరీ గూగుల్ అకౌంట్ క్రియేట్ చేస్తే వచ్చే ప్రయోజనాలేంటి ఏంటి?
గూగుల్ అకౌంట్‌ను క్రియేట్ చేయడానికి ఒక నిమిషం కంటే తక్కువ సమయమే పడుతుంది. దీనివల్ల 15జీబీ ఉచిత క్లౌడ్ స్టోరేజ్ పొందొచ్చు. ఇందులో మీ ఫొటోలు, ఇతర ఫైల్‌లను స్టోర్ చేసుకోవచ్చు. ఈ డేటాను బ్యాకప్ చేసుకోవడానికి దీన్ని తరచూ వాడుతూ ఉండటం ముఖ్యం. ఇతర సర్వీసులు యాక్సెస్ చేయడానికి ప్రైమరీ ఈమెయిల్ కాకుండా దీన్ని ఉపయోగించడం ద్వారా స్పామ్ ఈమెయిల్స్ సంఖ్య తగ్గించవచ్చు.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.