Home /News /technology /

WHY IS THE 700 MHZ BAND IMPORTANT FOR 5G WHICH JIO PURCHASED AND ONLY OPERATOR TO BUY 700 MHZ BAND SPECTRUM BA GH

జియో యూజర్లకు గుడ్ న్యూస్.. 700MHz కొన్న ఏకైక ఆపరేటర్‌గా జియో.. దీని లాభాలు చూస్తే వావ్..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

5G స్పెక్ట్రమ్(5G Spectrum) వేలంతో భారతదేశంలో 5G సేవలకు మార్గం సుగమమైంది. మొత్తం 22 టెలికాం సర్కిల్‌లలో ప్రీమియం 700 MHz బ్యాండ్‌లో 5G స్పెక్ట్రమ్‌ను కొనుగోలు చేసిన ఏకైక టెలికాం ఆపరేటర్‌గా జియో(Jio) నిలిచింది. 5G సేవలు అందించేందుకు ఇదో అత్యుత్తమ బ్యాండ్‌గా టెలికాం ఆపరేటర్లు భావిస్తారు.

ఇంకా చదవండి ...
5G స్పెక్ట్రమ్(5G Spectrum) వేలంతో భారతదేశంలో 5G సేవలకు మార్గం సుగమమైంది. మొత్తం 22 టెలికాం సర్కిల్‌లలో ప్రీమియం 700 MHz బ్యాండ్‌లో 5G స్పెక్ట్రమ్‌ను కొనుగోలు చేసిన ఏకైక టెలికాం ఆపరేటర్‌గా జియో(Jio) నిలిచింది. 5G సేవలు అందించేందుకు ఉత్తమంగా పరిగణించే ఈ బ్యాండ్‌ వైపు అందరు ఆపరేటర్‌లు చూస్తున్నారు. ఈ ప్రీమియం 700 MHz బ్యాండ్‌ను పొందడం ద్వారా 5G రేసులో జియో ఆధిక్యాన్ని పొందింది. 700 MHz బ్యాండ్ ప్రపంచవ్యాప్తంగా 5G సేవలకు ఆధిపత్య బ్యాండ్‌గా ఉపయోగిస్తున్నారు. యూఎస్‌, యూరోపియన్ యూనియన్ కూడా దీనిని 5G సేవ కోసం 'ప్రీమియం బ్యాండ్'గా ప్రకటించాయి. ఈ బ్యాండ్ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందడానికి అనేక కారణాలు ఉన్నాయి.

టెలికాం రంగాన్ని పర్యవేక్షిస్తున్న రోహన్ ధమిజా, 700 MHz పాపులారిటీకి అతిపెద్ద కారణం దాని మెరుగైన ఇండోర్, అవుట్‌డోర్ కవరేజీ అని అభిప్రాయపడ్డారు. తక్కువ ఫ్రీక్వెన్సీ బ్యాండ్ అయినందున, దాని సిగ్నల్ భవనాల లోపలికి కూడా చొచ్చుకుపోతుంది. ఇది ఇండోర్ కవరేజీకి చాలా బాగుంటుంది. అందువల్ల 700 MHz బ్యాండ్ జనసాంద్రత ఉన్న ప్రాంతాలకు, భారీ డేటా వినియోగం ఉన్న ప్రాంతాలకు అనువైనదిగా పరిగణిస్తారని నిపుణులు చెబుతున్నారు.

Flipkart Sale: ఇవి కదా ఆఫర్లు .. ఫ్లిప్ కార్ట్ బంపర్ సేల్.. వీటిపై 80 శాతం డిస్కౌంట్ !



700 MHz బ్యాండ్‌ పాపులారిటీకి మరో కారణం లాంగ్‌ అవుట్‌డోర్‌ కవరేజ్. 700 MHz బ్యాండ్ టవర్ 10 కిలోమీటర్ల వరకు కవరేజీని అందిస్తుంది. ఈ కవరేజీ కెపాసిటీ కారణంగా ఆపరేటర్ తక్కువ టవర్లను ఇన్‌స్టాల్ చేయాల్సి ఉంటుంది. ఫలితంగా నిర్వహణ ఖర్చులు తగ్గుతాయి. కాబట్టి ఖరీదైనది అయినప్పటికీ, ఈ బ్యాండ్ సరసమైన 5G సేవలకు ఉపయోగపడుతుంది.

LG Signature OLED R: కళ్లు చెదిరే ఫీచర్స్‌తో ఎల్‌జీ స్మార్ట్ టీవీ లాంచ్.. ధర ఎంతో తెలుసా..?



ఇప్పటికీ భారతదేశం వంటి దేశాల్లో ఎక్కువ మంది ప్రజలు గ్రామాల్లో నివసిస్తున్నారు. 5G కేవలం నగరాలకే పరిమితం కాకుండా.. 700 MHz బ్యాండ్ విస్తారమైన కవరేజ్ ద్వారా గ్రామీణ ప్రాంతాలకు కూడా సేవలను విస్తరించవచ్చు. గ్రామాలకు కూడా దీని వల్ల ప్రయోజనాలు చేకూరుతాయి. సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా 700 MHz బ్యాండ్ మారుమూల గ్రామీణ/రద్దీ ఉన్న ప్రాంతాల్లో కనెక్టివిటీని అందించడంలో సహాయపడుతుందని వివరించారు. 

700 MHz బ్యాండ్‌ పాపులారిటీకి మూడో కారణం అతి ముఖ్యమైన డేటా ట్రాఫిక్ హ్యాండ్లింగ్‌లో నైపుణ్యం. ఈ బ్యాండ్ స్వతంత్ర 5G నెట్‌వర్క్‌కు సపోర్ట్‌ చేస్తుంది. 700 MHz బ్యాండ్ 1800 MHz కంటే 5 రెట్లు ఎక్కువ, 900 MHz కంటే రెండు రెట్లు ఎక్కువ సమర్థవంతమైనదని నిపుణులు భావిస్తున్నారు. 26 GHz అధిక ఫ్రీక్వెన్సీ మిల్లీమీటర్ బ్యాండ్ వేగం బాగుంది. దీని కవరేజీ చాలా పరిమితంగా ఉంది. అలాగే 2100 MHz కంటే 700 MHz ద్వారా తక్కువ నిర్వహణ ఖర్చుతో బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందించే అవకాశం ఉంటుంది.
Published by:Ashok Kumar Bonepalli
First published:

Tags: 5G, 5g technology, Jio, Jio 5G, Reliance Industries

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు