హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

WhatsApp: వారెవ్వా వాట్సాప్.. రోజుకో కొత్త ఫీచర్లు.. ఇక ఎవరికి తెలియకుండా లెఫ్ట్ అయ్యే ఫీచర్.. ఎలాగో లుక్కేయండి !

WhatsApp: వారెవ్వా వాట్సాప్.. రోజుకో కొత్త ఫీచర్లు.. ఇక ఎవరికి తెలియకుండా లెఫ్ట్ అయ్యే ఫీచర్.. ఎలాగో లుక్కేయండి !

 వారెవ్వా వాట్సాప్.. రోజుకో కొత్త ఫీచర్లు..  ఇక ఎవరికి తెలియకుండా లెఫ్ట్ అయ్యే ఫీచర్.. ఎలాగో  లుక్కేయండి !

వారెవ్వా వాట్సాప్.. రోజుకో కొత్త ఫీచర్లు.. ఇక ఎవరికి తెలియకుండా లెఫ్ట్ అయ్యే ఫీచర్.. ఎలాగో లుక్కేయండి !

వాట్సాప్ (WhatsApp)గ్రూప్ చాట్స్‌కి పాస్ట్ పార్టిసిపెంట్స్ (Past Participants) అనే మరో కొత్త ఫీచర్ తీసుకొస్తోంది. ఈ విషయాన్ని వాట్సాప్ బీటా ఇన్ఫో తాజాగా వెల్లడించింది. ఈ ఫీచర్‌ సాయంతో 60 రోజుల వ్యవధిలో గ్రూప్ నుంచి ఎవరెవరు లెఫ్ట్ అయ్యారో గ్రూప్ అడ్మిన్‌తో పాటు మిగతా పార్టిసిపెంట్స్ కూడా తెలుసుకోవచ్చు.

ఇంకా చదవండి ...

ప్రముఖ మెసేజింగ్ ఫ్లాట్‌ఫామ్ వాట్సాప్ (WhatsApp) సరికొత్త ఫీచర్లను యూజర్లకు ఎల్లప్పుడూ పరిచయం చేస్తూనే ఉంది. అలానే అదిరిపోయే ఫీచర్ల(Features)ను డెవలప్, టెస్టింగ్ చేస్తోంది. అంతేకాకుండా, యాప్‌లో ఇప్పటికే అందుబాటులో ఉన్న వీడియో కాల్స్, గ్రూప్ చాట్స్‌ వంటి ఫెసిలిటీలకు కొత్త ఫీచర్లను తీసుకొస్తూ వాటిని మరింత మెరుగ్గా తీర్చిదిద్దుతోంది. గ్రూప్ చాట్స్‌ (Group Chats)లో రెండు కొత్త అప్‌డేట్స్ తీసుకువస్తున్నట్లు ఇటీవలే వాట్సాప్ బీటా ఇన్ఫో తెలిపింది. గ్రూప్ మెంబర్స్ సంఖ్యను 512కి పెంచడం, గ్రూప్‌లో నుంచి సైలెంట్‌గా లెఫ్ట్ కావడం వంటి రెండు ఫీచర్స్ ప్రస్తుతం ప్రయోగ దశలో ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే వాట్సాప్ గ్రూప్ చాట్స్‌కి పాస్ట్ పార్టిసిపెంట్స్ (Past Participants) అనే మరో కొత్త ఫీచర్ తీసుకొస్తోంది. ఈ విషయాన్ని వాట్సాప్ బీటా ఇన్ఫో తాజాగా వెల్లడించింది. ఈ ఫీచర్‌ సాయంతో 60 రోజుల వ్యవధిలో గ్రూప్ నుంచి ఎవరెవరు లెఫ్ట్ అయ్యారో గ్రూప్ అడ్మిన్‌తో పాటు మిగతా పార్టిసిపెంట్స్ కూడా తెలుసుకోవచ్చు.

ఈ ఫీచర్ iOS, ఆండ్రాయిడ్(Android) అప్‌కమింగ్ బీటా వెర్షన్లలో కనిపించిందని వాట్సాప్ ట్రాకర్ WABetaInfo తెలిపింది. ప్రస్తుతానికి వాట్సాప్ ఇంటర్నల్‌గా మాత్రమే ఈ ఫీచర్‌ను టెస్ట్ చేస్తోంది. దీనర్థం ఈ ఫీచర్ ప్రయోగ దశలోనే ఉంది. త్వరలోనే కొంతమంది బీటా వెర్షన్ యూజర్లకు అందుబాటులోకి రావచ్చు. అయితే వాట్సాప్ చడీచప్పుడు లేకుండా గ్రూప్ నుంచి లెఫ్ట్ అయ్యే ఫీచర్ కూడా తీసుకొస్తామని చెబుతోంది. కానీ 60 రోజుల్లో ఎవరు లెఫ్ట్ అయ్యారో ఈజీగా తెలుసుకునే పాస్ట్ పార్టిసిపెంట్స్ ఫీచర్ వల్ల సైలెంట్‌గా లెఫ్ట్ అయిన వారెవరో కూడా ఇతర పార్టిసిపెంట్స్‌కి తెలిసిపోతుంది. మరి ప్రైవసీ కాపాడినట్లు ఎలా అవుతుంది? అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఎవరికీ నోటిఫికేషన్ వెళ్లకుండా సైలెంట్‌గా లెఫ్ట్ అయినా వారు ఎవరనేది అప్పటికప్పుడు తెలుసుకోకపోయినా 60 రోజుల్లో ఏదో ఒక సందర్భంలో తెలిసిపోతుంది.

ఇదీ చదవండి:  Twitter Spaces: ట్విట్టర్ యూజర్స్ కు అదిరిపోయే న్యూస్.. అందుబాటులో కొత్త ఫీచర్.. వాళ్లకు మాత్రమే!


అయితే ఒక గ్రూప్‌ చరిత్ర మొత్తం కొత్తగా జాయిన్ అయ్యేవారు కూడా తెలుసుకునేలా ఈ ఫీచర్ తీసుకొస్తున్నట్లు వాట్సాప్ బీటా ఇన్ఫో చెబుతోంది. ఒక గ్రూప్‌లో జాయిన్ అయ్యి, సంభాషణలు జరిపి వెళ్లిపోయిన వారి నంబర్స్ 60 రోజులలోపు కొత్త జాయిన్ అయిన వారికి కూడా కనిపించే అవకాశం ఉంటుంది. ఇది వారి ప్రైవసీకి భంగం కలిగించేలాగా ఉంది. కానీ ఒక గ్రూపు ఎలాంటిది అనేది తెలుసుకునే అవకాశం న్యూ మెంబర్స్‌కి కల్పించడమే లక్ష్యం అని వాట్సాప్ చెబుతోంది.

ఈ ఫీచర్ ఎలా వర్క్ అవుతుందో ఒక స్క్రీన్‌షాట్ ద్వారా వాట్సాప్ బీటా ఇన్ఫో తెలియజేసింది. ఈ స్క్రీన్‌షాట్ ప్రకారం, గ్రూప్ యూజర్లందరూ 60 రోజుల కాలంలో గ్రూప్ నుంచి వెళ్లిపోయిన వారు ఎవరో పాస్ట్ పార్టిసిపెంట్స్ అనే లిస్టు కింద చూడవచ్చు. ఒక పార్టిసిపెంట్ ఫలానా తేదీన, ఫలానా సమయానికి లెఫ్ట్ అయినట్టు స్పష్టంగా పాస్ట్ పార్టిసిపెంట్స్ లిస్టు చూపిస్తుంది. మరి సైలెంట్‌గా వెళ్లగలిగే ఫీచర్‌ నిరుపయోగంగా మారకుండా పాస్ట్ పార్టిసిపెంట్స్ ఫీచర్‌ని వాట్సాప్ మెరుగ్గా రూపొందించి రిలీజ్ చేస్తుందో లేదో చూడాలి.

First published:

Tags: Android, Tech news, Whatsapp, Whatsapp tricks

ఉత్తమ కథలు