Space Pens: స్పేస్‌లో సైతం పనిచేసే ‘త్రీ ఇడియట్స్’ పెన్ను.. అసలు దీన్ని ఎవరు తయారు చేశారో తెలుసా?

స్పేస్ పెన్‌లను మొదటిగా తయారు చేసింది ఎవరో తెలుసా? (ప్రతీకాత్మక చిత్రం)

అంతరిక్షంలో గురుత్వాకర్షణ శక్తి ఉండదు కాబట్టి మామూలు పెన్నులు పని చేయవు. దీంతో అమెరికా ఇల్లినాయిస్‌లోని ఫిషర్ పెన్ కంపెనీ వ్యవస్థాపకుడు పాల్ సి. ఫిషర్.. తొలి ఫిషర్ స్పేస్ పెన్‌ను తయారుచేశారు.

  • Share this:
మీరు '3 ఇడియట్స్' సినిమా (3 Idiots Movie) చూసే ఉంటారు. ఈ చిత్రంలోని ఓ సన్నివేశంలో స్పేస్ పెన్ను (Pen) గురించి ఒక ప్రస్తావన వస్తుంది. ఇది ఒక స్పెషల్ వ్యోమగాముల (Astronauts) పెన్ అని.. ఇది ఏ కోణంలోనైనా, ఏ ఉష్ణోగ్రతలోనైనా.. చివరికి జీరో గురుత్వాకర్షణలోనైనా పనిచేస్తుందని ఓ ప్రొఫెసర్ చెప్తారు. అయితే ఇది సినిమాకే పరిమితం కాదు. నిజజీవితంలోనూ ఇలాంటి పెన్నును తయారు చేశారు. కానీ వీటిని అంతరిక్ష పరిశోధన సంస్థలు రూపొందించలేదు. ఒక పెన్నుల తయారీ సంస్థ వ్యవస్థాపకుడు సొంతంగా స్పేస్ పెన్నుపై పరిశోధనలు చేశాడు. ఇందుకు సొంతంగా పది లక్షల డాలర్ల వరకు ఖర్చు చేయడం విశేషం.

అమెరికా ఇల్లినాయిస్‌లోని ఫిషర్ పెన్ కంపెనీ వ్యవస్థాపకుడు పాల్ సి. ఫిషర్.. తొలి ఫిషర్ స్పేస్ పెన్‌ను తయారుచేశారు. ఇందుకు సొంతంగా 1 మిలియన్ డాలర్లు ఖర్చు చేశారు. మీరు ఈ పెన్నును '3 ఇడియట్స్' సినిమాలో చూడొచ్చు. ఈ పెన్నులు అందుబాటులోకి రాకముందు సోవియట్ వారు ఎలాంటి ఖర్చు లేకుండా స్పేస్‌లో పెన్సిల్‌లను వాడేవారు. నాసా మాత్రం స్పేస్ పెన్నును అభివృద్ధి చేయడానికి అనవసరంగా మిలియన్ డాలర్లను ఖర్చు చేసిందని అంటారు. కానీ అది అసత్యం.

అసలు అంతరిక్షంలో సాధారణ బాల్ పాయింట్ పెన్ ఎందుకు పనిచేయదు? పెన్ పనిచేయాలంటే.. దాని బాడీ, ఇంక్ ఉంటే చాలు కదా? అని అనుకుంటాం. కానీ బాల్ పాయింట్/జెల్ పెన్ పని చేయాలంటే ఈ రెండింటితో పాటు గురుత్వాకర్షణశక్తి కూడా తప్పకుండా ఉండాలి. గురుత్వాకర్షణ శక్తి ఉంటేనే పెన్ను రీఫిల్ లోని సిరా కాగితంపై పడుతుంది. సున్నా గురుత్వాకర్షణ శక్తిలో ఉన్నప్పుడు మీరు ఇంక్ రీఫిల్ ట్యాంక్‌పై ఒత్తిడి తెస్తే సిరా లీకేజ్ అయ్యే అవకాశం ఉంది.

అయితే ఈ సమస్యను అధిగమించేందుకు స్పేస్ పెన్నులోని బాల్ పాయింట్‌ను టంగ్‌స్టన్ కార్బైడ్‌తో తయారుచేశారు. ఎలాంటి గాలి చొరబడకుండా ఈ బాల్ పాయింట్‌ను తయారు చేయడం వల్ల ఇది సిరాలో ఎలాంటి ఒత్తిడిని సృష్టించదు. ఫలితంగా ఇంక్ లీక్ అయ్యే అవకాశం ఉండదు. ఇక ఈ స్పేస్ పెన్నులోని ఇంక్ ఛాంబర్ లో ఉండే సిరాని ప్రెషరైజ్డ్ ఇంక్ అంటారు. మనం రాసేటప్పుడు మాత్రమే ఈ సిరా బయటకు ప్రవహిస్తుంది. పెన్ ను వాడని సమయంలో బాగా జిగటగా.. మందపాటి రబ్బర్ సిమెంట్‌లా ఉండే ఈ ఇంక్.. కంప్రెస్డ్ నైట్రోజన్ ను ఉపయోగించి బలవంతంగా బయటకు వస్తుంది. లీకేజీని నివారించడానికి సిరాని గాలి చొరబడని విధంగా మూసివేస్తారు.

అప్పట్లో ఫిషర్ తాను రూపొందించిన పెన్నును నాసాకు అందించినప్పుడు, నాసా మానవ సహిత అంతరిక్ష కేంద్రం(ఇప్పుడు న్యూ జాన్సన్ స్పేస్ సెంటర్) హ్యూస్టన్‌లో శాస్త్రవేత్తలు పెన్ను మీద విస్తృతమైన పరీక్షలు నిర్వహించారు. వారు అనేక కోణాలు, ఉష్ణోగ్రతలు, వాతావరణ పరిస్థితులలో ఫిషర్ స్పేస్ పెన్ను ఉపయోగించి రాయడానికి ప్రయత్నించారు.

Vasoo Paranjape: గవాస్కర్, సచిన్, ద్రవిడ్, కుంబ్లే, రోహిత్ శర్మ.. ఎంతో మంది క్రికెటర్లను తీర్చిదిద్దిన కోచ్ హఠాన్మరణం


 అయితే ఆ పెన్ను అవసరమైన అన్ని పరీక్షలలో పాస్ కావడంతో, నాసా ఆమోదించింది. అలాగే ఒక్కో పెన్నును 6 డాలర్ల చొప్పున 400 స్పేస్ పెన్నులను కొనుగోలు చేసింది. కొద్ది రోజుల తరువాత రష్యన్ స్పేస్ ఏజెన్సీ సైతం ఫిషర్ పెన్నులను కొనుగోలు చేసింది. ఇవి రాకముందు స్పేస్ సంస్థలు వివిధ రకాల పెన్సిల్‌లను ఉపయోగించేవి. నాసా ఒక మెకానికల్ పెన్సిల్‌ని ఉపయోగించేది. ఆక్సిజన్ అధికంగా ఉండే అంతరిక్ష నౌకలలో చెక్క పెన్సిల్‌లు అగ్ని ప్రమాదానికి దారితీసే ప్రమాదం ఉంది కాబట్టి నాసా వాటి జోలికి వెళ్ళలేదు. ఇక రష్యన్ వారు సురక్షితమైన మైనపు పెన్సిల్‌లను ఉపయోగించారు.


IPL 2021: వీళ్లు బ్యాటుతో రాణిస్తే.. ఆ జట్టు విజయానికి తిరుగుండదు.. ఎవరా బ్యాట్స్‌మెన్?


 

Published by:John Naveen Kora
First published: