ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్( WhatsApp), మరో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటి వరకు మొబైల్లో వాట్సాప్ వినియోగించే వారికి మాత్రమే ఆడియో, వీడియో కాల్స్ చేసుకునే సదుపాయం ఉండగా, త్వరలో డెస్క్‌టాప్ యాప్‌లో కూడా కాలింగ్ ట్యాబ్‌ను(Calling Tab) యాడ్ చేయనుంది. తక్కువ బ్యాండ్ విడ్త్ అంటే స్లో నెట్ ఉన్న చోట్ల కూడా వాట్సాప్ యాప్ కాల్స్ బాగా పని చేస్తాయి. దీంతో ఇటీవల కాలంలో వీటి వాడకం బాగా పెరిగిపోయింది. అయితే మొబైల్ యాప్‌లోనే (Mobile App) ఈ ఫీచర్ ఉండటంతో, దీన్ని డెస్క్‌టాప్ యాప్‌లో కూడా పరిచయం చేయాలని యూజర్లు డిమాండ్లు చేస్తున్నారు. దీంతో ఇప్పుడు వాట్సాప్ డెస్క్‌టాప్ యాప్‌లోనూ కాలింగ్ ఫెసిలిటీని అందుబాటులోకి తెచ్చే పనిలో ఆ సంస్థ నిమగ్నమైందని వార్తలొస్తున్నాయి.
ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ వాట్సాప్ ట్రాకర్ WaBetaInfo సోషల్ మీడియాలో ఓ కొత్త పోస్ట్ చేసింది. బీటా వెర్షన్లో డెస్క్‌టాప్ యాప్ కోసం కాల్స్ ట్యాబ్‌ను వాట్సాప్ పరిచయం చేస్తోందని అందులో పేర్కొంది. ‘డెస్క్టాప్పై వాట్సాప్ వాడే వినియోగదారులు ఇక అక్కడి నుంచే కాల్స్ చేసుకునే సదుపాయాన్ని పొందనున్నారు. అక్కడే వారు కాల్ డేటాను పొందవచ్చు. పీసీ నుంచి నేరుగా వాట్సాప్ కాల్ చేసుకునే అవకాశం ఉంటుంది.
* వాట్సాప్ డెస్క్‌టాప్ కాలింగ్ ఎలా పని చేస్తుంది?
ఈ విషయంపై సోషల్ మీడియాలో వచ్చిన పోస్ట్‌లను బట్టి చూస్తే.. వాట్సాప్ డెస్క్‌టాప్ యాప్ ఇంటర్ఫేస్కు పైన, ఎడమవైపు ఉన్న స్టేటస్, న్యూ చాట్ ఆప్షన్ల మధ్య కాల్ ట్యాబ్ ఉండవచ్చు. కాల్స్‌పై క్లిక్ చేసి, వినియోగదారులు తమ వాట్సాప్ కాల్ హిస్టరీని బ్రౌజ్ చేసుకోవచ్చు. వాటిలో ఒకదాన్ని ఎంపిక చేసి కాల్ చేసుకోవచ్చు. ఈ ఆప్షన్ కచ్చితంగా ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనే విషయంపై సమాచారం లేదు. ఈ ఫీచర్ రిలీజ్ అయితే, చాలా మంది వినియోగదారులు గూగుల్ మీట్ (Google Meet), జూమ్( Zoom)లకు ప్రత్యామ్నాయంగా వాట్సాప్ డెస్క్టాప్ను వాడటం మొదలు పెడతారని ఎక్స్పర్ట్స్ విశ్లేషిస్తున్నారు/
Android TV: వచ్చే ఏడాది నుంచి ఆండ్రాయిడ్ టీవీలు వేగంగా, మెరుగైన సెక్యూరిటీతో పనిచేస్తాయి.. ఎందుకంటే..
* త్వరలో ఇన్విటేషన్ లింక్స్
సాధారణంగా జూమ్, గూగుల్ మీట్లలోకి రమ్మంటూ మనకు కొన్ని లింకులు షేర్ అవుతుంటాయి. ఈ మధ్యనే వాట్సాప్ కూడా కాల్ లింక్స్ అనే మరో కాలింగ్ ఆప్షన్ని బీటా టెస్టర్లకు రిలీజ్ చేసింది. దీని ద్వారా వాట్సాప్ వీడియో, వాయిస్ కాల్స్ కోసం లింక్ క్రియేట్ చేయవచ్చు. ఆ లింక్‌ను వేరొకరికి షేర్ చేసి కాల్కి ఇన్వైట్ చేయవచ్చు. అయితే దీనికి సంబంధించిన బీటా టెస్ట్‌ను వాట్సాప్ పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఈ ఆప్షన్ని డెస్క్‌టాప్ కాలింగ్, మొబైల్ కాలింగ్ ఫీచర్లకు యాడ్ చేయనుందనే వార్తలు వస్తున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Whatsapp