Home /News /technology /

WHATSAPPS NEW SCAM IS OFFERING USERS FREE VISA JOB BENEFITS IN THE UK HERES HOW NOT TO FALL FOR IT GH SK

WhatsApp Scam: వాట్సప్‌లో కొత్త మోసాలు.. ఈ మెసేజ్‌లు వస్తున్నాయా? ఐతే జాగ్రత్త

వాట్సాప్ కొత్త ఫీచర్

వాట్సాప్ కొత్త ఫీచర్

Whatsapp: వాట్సాప్‌లో కొత్త ఫిషింగ్(Fishing) ప్రచారం జరుగుతోంది. యునైటెడ్ కింగ్‌డమ్‌లో పని చేయాలనుకునే వారిని అవకాశాలు ఉన్నాయని మెసేజ్‌లు పంపుతున్నారు స్కామర్లు. యూకేకి వెళ్లాలనుకుంటున్న వారికి ఉచిత వీసా, ఇతర ప్రయోజనాలు అందుతాయని ప్రచారం చేస్తున్నారు.

ఇంకా చదవండి ...
WhatsApp Scam:  వాట్సాప్‌ మెసేజింగ్‌ యాప్‌ (Whatsapp) ద్వారా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది యూజర్లు వినియోగిస్తున్న ఇన్‌స్టంట్‌ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌. కానీ సైబర్‌ నేరాలకు, అసత్య వార్తల ప్రచారాలకు కూడా వాట్సాప్‌ వేదికగా మారుతోంది. ప్రస్తుతం కొత్త ఫిషింగ్(Fishing) ప్రచారం జరుగుతోంది. యునైటెడ్ కింగ్‌డమ్‌(United Kingdom)లో పని చేయాలనుకునే వారిని అవకాశాలు ఉన్నాయని మెసేజ్‌లు పంపుతున్నారు స్కామర్లు. యూకేకి వెళ్లాలనుకుంటున్న వారికి ఉచిత వీసా, ఇతర ప్రయోజనాలు అందుతాయని ప్రచారం చేస్తున్నారు. ఈ సమాచారం యూకే ప్రభుత్వం నుంచి వచ్చిందని కూడా చెబుతున్నారు. 2022లో యూకేకి 132,000 మంది అదనపు కార్మికులు అవసరమని, అందువల్ల ప్రభుత్వం రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌ను నడుపుతోందని, 186,000 ఉద్యోగ ఖాళీలు అందుబాటులో ఉన్నాయని వాట్సాప్‌ యూజర్‌లకు మెసేజ్‌లు వస్తున్నాయి.

Google Assistant: గూగుల్ అసిస్టెంట్ వాడుతున్నారా? ఈ అదిరిపోయే ఫీచర్లను అస్సలు మిస్ చేయకండి

వాట్సాప్‌ వినియోగదారులకు మొబైల్‌ యాప్‌లో ఇలాంటి మెసేజ్‌లు వస్తున్నాయని Malwarebytes నివేదిక చెబుతోంది. ఈ రిపోర్ట్ ప్రకారం.. బ్రిటన్‌కు వెళ్లాలనుకునే వారికి ఉచిత వీసా, ఇతర ప్రయోజనాలను అందిస్తున్నారని, పని కోసం యూకేకి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నవారు సద్వినియోగం చేసుకోవాలని స్కామర్లు చెబుతున్నారు. వినియోగదారులు ఆ మెసేజ్‌లో ఉన్న లింక్‌పై క్లిక్‌ చేస్తే.. యూకే వీసా, ఇమ్మిగ్రేషన్ వెబ్‌సైట్‌గా రూపొందించిన మోసపూరిత డొమైన్ ఓపెన్‌ అవుతుంది. యునైటెడ్ కింగ్‌డమ్‌లో వేలాది ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయని, దరఖాస్తు చేసుకోవాలని విదేశీయులను కోరుతున్నట్లు ఈ వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు.

Apple iPhone: వర్షంలో మాత్రమే కాదు.. నీటి అడుగునా వాడగలిగే ఐఫోన్.. ఎలా పనిచేస్తుందంటే..

ఈ ప్రోగ్రామ్‌ ద్వారా.. ప్రయాణ ఖర్చులు, హౌసింగ్, వసతి, వైద్య సదుపాయాలు లభిస్తాయని, దరఖాస్తుదారు తప్పనిసరిగా 16 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు వారై ఉండాలని పేర్కొంటున్నారు. బేసిక్‌ ఇంగ్లీష్ అవసరమని చెబుతున్నారు. వెంటనే ఉద్యోగం లభిస్తుందని, వీసీ దరఖాస్తు ప్రక్రియకు సాయం చేస్తామని, అన్ని వర్గాలకు చెందిన వారు అర్హులని తెలుపుతున్నారు. పని చేయాలనుకునే, చదువుకోవాలనుకునే వ్యక్తులు, విద్యార్థులందరికీ అవకాశం ఉందని, దరఖాస్తు చేసుకోవాలని మోసగాళ్లు ప్రచారం చేస్తున్నారు.



* వాట్సాప్‌లో ఈ స్కామ్ నుంచి ఎలా రక్షించుకోవాలి
వాట్సాప్ స్కామ్‌లు కొత్తేమీ కాదు. గతంలోనూ కేసులు నమోదయ్యాయి. భారీగా డబ్బులు పోగొట్టుకున్న వారు ఉన్నారు. వాట్సాప్‌లోని మెసేజ్‌లు ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్ట్ కావడంతో మోసగాళ్ళను కనిపెట్టడం కష్టం. అటువంటి స్కామ్‌లను నివారించడానికి సులభమైన, ఉత్తమమైన మార్గం ఏమిటంటే.. విదేశాల్లో ఉద్యోగం పొందడం, భారీ మొత్తంలో డబ్బు పొందడం, ఇతర ప్రయోజనాలు ఉచితంగా అందిస్తామనే సమాచారంతో వచ్చే మెసేజ్‌లను పట్టించుకోకపోవడం. ఈ స్కామ్‌లు వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని, వారి పేర్లు, ఇమెయిల్ అడ్రస్‌లు, ఫోన్ నంబర్‌లు, మారిటల్ స్టేటస్, జాబ్ స్టేటస్ సహా ఇతర వివరాలు సేకరించడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. అందకే ఇలాంటి మెసేజ్‌లు వస్తే పట్టించుకోకండి.. పంపిన వారిని వెంటనే బ్లాక్ చేయండి.
Published by:Shiva Kumar Addula
First published:

Tags: Scams, Technology, Whatsapp, Whatsapp tricks

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు