వాట్సప్‌లో ఫింగర్‌ప్రింట్, ఫేస్ అన్‌లాక్ వచ్చేసింది

వాట్సప్ సెట్టింగ్‌లోకి వెళ్లి స్క్రీన్ లాక్ ఆప్షన్ క్లిక్ చేయాలి. అక్కడ మీకు ఆథెంటికేషన్ ఫీచర్ సెట్ చేసుకోవచ్చు. అయితే లాక్డ్ స్క్రీన్‌ నుంచి రిప్లై ఇవ్వడానికి, వాట్సప్ కాల్స్ అటెండ్ చేయడానికి ఆథెంటికేషన్ అవసరం లేదు.

news18-telugu
Updated: February 5, 2019, 7:17 AM IST
వాట్సప్‌లో ఫింగర్‌ప్రింట్, ఫేస్ అన్‌లాక్ వచ్చేసింది
వాట్సప్‌లో మారనున్న సెట్టింగ్స్ మెనూ...
  • Share this:
వాట్సప్ యూజర్లకు శుభవార్త. ఎంతోకాలంగా మీరు ఎదురుచూస్తున్న ఫింగర్‌ప్రింట్ ఆథెంటికేషన్ ఫీచర్‌ని విడుదల చేసింది వాట్సప్. ముందుగా ఐఓఎస్‌లోని బీటా యూజర్లకు సరికొత్త ఆథెంటికేషన్ ఫీచర్ రిలీజ్ చేసింది. ఐఓఎస్‌లో 2.19.20.19 అప్‌డేట్ పొందినవారు తమ ఐఫోన్‌లో వాట్సప్‌కు ఇక ఫింగర్‌ప్రింట్ లాక్ ఉపయోగించుకోవచ్చు. ఐఫోన్ ఎక్స్ కన్నా ఎక్కువ ఫోన్లు ఉన్నవారికి ఫేస్ ఐడీ కూడా అందుబాటులోకి వచ్చిందని WAbetainfo కథనం.
Read this: #Jobs: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ 2019 నోటిఫికేషన్ విడుదల... వివరాలివే

ఫింగర్‌ప్రింట్ ఆథెంటికేషన్, ఫేస్ అన్‌లాక్ ఫీచర్ ఎలా ఉపయోగించాలి?


మీరు వాడుతున్న ఐఫోన్‌లో 2.19.20.19 అప్‌డేట్ వస్తే ఫింగర్‌ప్రింట్ ఆథెంటికేషన్, ఫేస్ అన్‌లాక్ ఫీచర్ ఉపయోగించుకోవచ్చు. ఇందుకోసం వాట్సప్ సెట్టింగ్‌లోకి వెళ్లి స్క్రీన్ లాక్ ఆప్షన్ క్లిక్ చేయాలి. అక్కడ మీకు ఆథెంటికేషన్ ఫీచర్ సెట్ చేసుకోవచ్చు. అయితే లాక్డ్ స్క్రీన్‌ నుంచి రిప్లై ఇవ్వడానికి, వాట్సప్ కాల్స్ అటెండ్ చేయడానికి ఆథెంటికేషన్ అవసరం లేదు. వాట్సప్ మెసేజెస్‌ లాగానే మీ వేలిముద్రలు, ఫేషియల్ డేటా కూడా మీ ఫోన్‌లో ఎన్‌క్రిప్ట్‌ అవుతుంది. మీ బయోమెట్రిక్ డేటా వాట్సప్‌ అప్‌లోడ్ చేసుకోలేదు.

Read this: Alert: ఫోటో ఎడిటింగ్ యాప్స్‌లో వైరస్... ఈ యాప్స్ మీ దగ్గరున్నాయా?

ప్రస్తుతం ఐఓఎస్‌లోని బీటా యూజర్లకు అందుబాటులోకి వచ్చిన ఫింగర్‌ప్రింట్ ఆథెంటికేషన్, ఫేస్ అన్‌లాక్ ఫీచర్ మరికొన్ని రోజుల్లో ఆండ్రాయిడ్ యూజర్లకూ లభించనుంది. ఆ ఫీచర్ వచ్చిందంటే ఇకపై మీరు వాట్సప్ యాప్ ఓపెన్ చేయడానికి ఫింగర్ ప్రింట్ ఆథెంటికేషన్ లేదా ఫేషియల్ రికగ్నిషన్ తప్పనిసరి.
ఇవి కూడా చదవండి:

Photos: అక్కడికి వెళ్తే ప్యాంటు విప్పాల్సిందే... ఎందుకో తెలుసా?

Realme Sale: ప్రారంభమైన రియల్‌మీ సేల్... స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్స్

IRCTC Booking: రైలులో ఖాళీ సీట్ల లెక్క ఇలా తెలుసుకోండి
First published: February 5, 2019, 7:10 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading