WhatsApp Alert : ఇండియాలో వాట్సాప్ సేవలు నిలిచిపోతాయా? షాకింగ్ ప్రకటన చేసిన కంపెనీ

WhatsApp Alert : ఎన్‌స్క్రిప్షన్‌పై ఇండియన్ రూల్స్ అమలుచేసే అవకాశాలు లేవని వాట్సాప్ మేనేజ్‌మెంట్ చెబుతోంది. అమలు చెయ్యాల్సిందేనని కేంద్రం అంటోంది. ఏంటా రూల్స్?

Krishna Kumar N | news18-telugu
Updated: March 7, 2019, 3:07 AM IST
WhatsApp Alert : ఇండియాలో వాట్సాప్ సేవలు నిలిచిపోతాయా? షాకింగ్ ప్రకటన చేసిన కంపెనీ
వాట్సాప్ (File)
Krishna Kumar N | news18-telugu
Updated: March 7, 2019, 3:07 AM IST
ఇండియాలో పనిచేసే సోషల్ మీడియా సంస్థలకు కేంద్ర ప్రభుత్వం తెస్తున్న కొన్ని నియమాలు మింగుడుపడేలా లేవు. ఫేస్‌బుక్ కంపెనీకి చెందిన వాట్సాప్ ప్రస్తుత వెర్షన్ భారతదేశ కొత్త నియమాలకు తగినట్లు లేదు. ప్రధానంగా వాట్సాప్... ఎండ్-టు-ఎండ్ ఎన్‌స్క్రిప్షన్‌ను అందిస్తోంది. అంటే... మెసేజ్ పంపినవారూ, పొందినవారు మాత్రమే ఆ సందేశాన్ని చదవగలరు. కానీ కేంద్ర ప్రభుత్వం తెచ్చిన రూల్స్ ప్రకారం... ఆ మెసేజ్‌లను నిఘావర్గాలు, ప్రభుత్వాధికారులూ చదివే వీలుండాలి. తద్వారా ఉగ్రవాద దాడులు, ఇతరత్రా నేరాలను అడ్డుకోవడానికి వీలవుతుందని కేంద్రం భావిస్తోంది. లోక్‌సభ ఎన్నికలు వస్తున్న తరుణంలో... కేంద్రం ఈ రూల్స్ తెస్తోంది. దీనిపై వాట్సాప్ కమ్యూనికేషన్స్ చీఫ్ కార్ల్ వోగ్జ్ విచారం వ్యక్తం చేశారు. ఇండియా రాల్స్ ప్రకారం వాట్సాప్‌ విధానాలను మార్చడం కుదరదన్నట్లుగా అయన అభిప్రాయపడ్డారు.

whatsapp, whatsapp new rules, india new rules, narendra modi, rumour, social media, Social Messaging, whatsapp shut down, వాట్సాప్, సోషల్ మీడియా, పుకారు
వాట్సాప్ (File)


వాట్సాప్‌కి ప్రపంచవ్యాప్తంగా 150 కోట్ల మంది కస్టమర్లు ఉండగా... ఇండియాలో 20 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు. అందువల్ల ఇండియాయే వాట్సాప్‌కి అతిపెద్ద మార్కెట్. ఇండియాలో వాట్సాప్ మెసేజ్‌లను థర్డ్ పార్టీ చదివేందుకు అనుమతి ఇవ్వాలంటే... వాట్సాప్‌ను రీ-డిజైన్ చెయ్యాలంటున్నారు దాని నిర్వాహకులు. ఐతే, అది సాధ్యమయ్యేపనికాదంటున్నారు.

కేంద్రం ఉద్దేశం ఒకటే. చట్టవ్యతిరేకమైన మెసేజ్‌లను 24 గంటల్లో డిలీట్ చెయ్యాలన్నదే. మూకదాడులు, మత హింస వంటివి జరగకుండా ఉండాలంటే... వాట్సాప్ లాంటి సోషల్ మీడియా సంస్థలపై నియంత్రణ ఉండాలని కేంద్రం భావిస్తోంది. గతేడాది వాట్సాప్‌లో అపరమితంగా గ్రూప్ మెసేజ్‌లు వెళ్లడం వల్ల మూకదాడులు జరిగాయి. ఆ తర్వాత వాట్సాప్... ఒకేసారి ఐదుగురి కంటే ఎక్కువమందికి గ్రూప్ మెసేజ్ పంపడానికి వీల్లేకుండా మార్పులు చేసింది.
whatsapp, whatsapp new rules, india new rules, narendra modi, rumour, social media, Social Messaging, whatsapp shut down, వాట్సాప్, సోషల్ మీడియా, పుకారు
వాట్సాప్ (File)


వాట్సాపే కాదు... అమెజాన్, యాపిల్, ఫేస్‌బుక్, గూగుల్ కూడా కేంద్రం తెస్తున్న కొత్త రూల్స్‌ని వ్యతిరేకిస్తున్నాయి. అవి వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగిస్తున్నాయని చెబుతున్నాయి. ఇదంతా కుదరదంటున్న వాట్సాప్... తామే ఓ కొత్త టూల్ ప్రవేశపెడతామనీ, అసభ్యకరమైన మెసేజ్‌లను డిలీట్ చేసి... అనుమానిత అకౌంట్లను రద్దుచేస్తామని చెబుతోంది. ఇందుకు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించట్లేదు.

ఈ విషయంలో కేంద్రం చాలా సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. అవసరమైతే, వాట్సాప్‌ని ఇండియాలో రద్దు చేసేందుకు కూడా వెనకాడబోదని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. మరి వాట్సాప్ మేనేజ్‌మెంట్ ఏం చేస్తుందన్నది సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.

 

ఇవి కూడా చదవండి :

ఆండ్రాయిడ్ గేమ్స్ ని కంప్యూటర్ లో ఆడాలా? ఇదిగో ఫ్రీ ఆప్షన్

యూట్యూబ్ ద్వారా డబ్బు సంపాదించడం ఎలా... ఇలా చెయ్యండి

మొబైల్ ఆండ్రాయిడ్ యాప్ తయారీ... సింపుల్‌గా ఎలా... ఇలా చెయ్యండి

డాక్టర్ బార్బెర్... 1912లో సంచలనం సృష్టించిన ఐడెంటిటీ థెఫ్ట్ కేసు
First published: March 7, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...