ఆ ఫోన్లల్లో వాట్సప్ పనిచేయదు!

పాత ఫోన్లల్లో వాట్సప్‌ను నిలిపివేస్తోంది ఆ కంపెనీ. ఇప్పటికే నోకియా సింబియన్ ఎస్60, బ్లాక్‌బెర్రీ ఓఎస్, విండోస్ ఫోన్ 8.0 కన్నా పాత ఫోన్లల్లో వాట్సప్ ఆగిపోయింది. ఇప్పుడు ఆ జాబితాలో యాపిల్ ఫోన్లు కూడా చేరిపోయాయి.

news18-telugu
Updated: September 20, 2018, 5:44 PM IST
ఆ ఫోన్లల్లో వాట్సప్ పనిచేయదు!
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
మీ దగ్గర పాత యాపిల్ ఫోన్‌ ఉందా? అయితే ఇకపై ఆ ఫోన్లల్లో వాట్సప్ పనిచేయడం కష్టం. ఐఓఎస్ వర్షన్ 7 కన్నా పాత ఫోన్లల్లో తమ సర్వీస్ నిలిపివేయాలని వాట్సప్ నిర్ణయించింది. ఐఫోన్ 4 డివైజ్‌లల్లో ఇప్పటికే వాట్సప్ డౌన్‌లోడ్ చేసుకున్నట్టయితే 2020 వరకు ఆ యాప్‌ను ఉపయోగించుకోవచ్చు. అయితే ఒకవేళ యాప్ డిలిట్ చేస్తే మాత్రం రీ-ఇన్‌స్టాల్ చేసుకోవడం కుదరదు. పాత ఐఫోన్లకు యాప్‍‌ నుంచి కొత్త ఫీచర్స్, అప్‌డేట్స్ రావు. అంతేకాదు... ఇప్పటికే ఉన్న ఫీచర్లు కూడా ఆగిపోవచ్చు.

1 ఫిబ్రవరి, 2020 నుంచి ఐఓఎస్ 7 కన్నా పాత వర్షన్లు, ఆండ్రాయిడ్ 2.3.7 కన్నా పాత వర్షన్ ఫోన్లల్లో వాట్సప్ యాప్ పనిచేయదని గతంలోనే కంపెనీ ప్రకటించింది. ఇప్పటికే నోకియా సింబియన్ ఎస్60, బ్లాక్‌బెర్రీ ఓఎస్, విండోస్ ఫోన్ 8.0 కన్నా పాత ఫోన్లల్లో వాట్సప్ ఆగిపోయింది. ఇప్పుడు ఆ జాబితాలో యాపిల్ ఫోన్లు కూడా చేరిపోయాయి.

ఇవి కూడా చదవండి:

మీరు వాట్సప్ 'డిఫాల్ట్' అడ్మినా?: తేడా వస్తే జైలుకే!

వాట్సప్ లేటెస్ట్ ఫీచర్స్ చూశారా?

మీరు ఎక్కాల్సిన రైలు ఎక్కడ ఉంది?: వాట్సప్ చెప్పేస్తుంది!

వాట్సప్ కొత్త ఫీచర్‌తో మీకు షాకే!మీ వాట్సప్ హ్యాక్ అయిందా?

మీ వాట్సప్ డేటా ఇలా బ్యాకప్ చేసుకోండి!

జియో ఫోన్‌లో వాట్సప్ వచ్చేసింది!
Published by: Santhosh Kumar S
First published: September 20, 2018, 5:43 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading