WhatsApp: వాట్సప్‌ను దుర్వినియోగం చేస్తే చట్టపరమైన చర్యలు

Whatsapp New Rule: వాట్సప్ యాప్‌ను దుర్వినియోగం చేసినా, బల్క్ మెసేజ్‌లు పంపినా సంబంధిత వ్యక్తులు, సంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆ సంస్థ హెచ్చరించింది.

news18-telugu
Updated: June 14, 2019, 8:14 PM IST
WhatsApp: వాట్సప్‌ను దుర్వినియోగం చేస్తే చట్టపరమైన చర్యలు
(ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: June 14, 2019, 8:14 PM IST
వాట్సప్ యాప్‌ను కొందరు వ్యక్తులు, సంస్థలు దుర్వినియోగం చేయడాన్ని ఆ సంస్థ తీవ్రంగా పరిగణిస్తోంది. దీన్ని కట్టడి చేసే దిశగా కఠిన చర్యలకు ఉపక్రమించింది. వాట్సప్ యాప్‌ను దుర్వినియోగం చేసినా...వాట్సప్ ద్వారా బల్క్ మెసేజ్‌లు పంపినా సదరు వ్యక్తులు, సంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు ఆ సంస్థ హెచ్చరించింది. ఈ మేరకు వాట్సప్ లేటెస్ట్ నియమావళిలో మార్పులు చేసింది. డిసెంబరు ఏడు తర్వాత ఈ నిబంధన అమలులోకి వస్తుందని తెలిపింది.

అయితే నిబంధనలు ఉల్లంఘించేవారిపై ఏలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోనున్నది ఆ నియమావళిలో వెల్లడించలేదు. మొన్నటి సార్వత్రిక ఎన్నికల సమయంలో వాట్సప్‌ను పెద్ద ఎత్తున దుర్వినియోగం చేశారన్న ఆరోపణలు వచ్చాయి. ఉచిత క్లోన్ యాప్స్, సాఫ్ట్‌వేర్ టూల్ ద్వారా ఆటోమేటెడ్ బల్క్ మెసేజ్‌లను పంపడం వివాదాస్పదమయ్యింది. ఈ నేపథ్యంలో వాట్సప్ యాప్ దుర్వినియోగం, బల్క్ మెసేజ్‌ల నియంత్రణ దిశగా ఆ సంస్థ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఫేక్ న్యూస్ వ్యాపిస్తుండడాన్ని అడ్డుకోవడంలో వాట్సప్ వైఫల్యం చెందుతోందని భారత ప్రభుత్వం గతంలో ఆరోపించడం తెలిసిందే. దాదాపు 20 కోట్ల మంది యూజర్లతో భారత మార్కెట్ వాట్సప్‌కు కీలకంగా మారింది.

First published: June 14, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...