WHATSAPP WILL STOP WORKING ON THESE OLDER SMARTPHONES IN TWO MONTHS TIME ACCORDING TO THE REPORTS CHECK HERE GH SRD
WhatsApp: నవంబర్ 1 నుంచి ఈ స్మార్ట్ఫోన్లలో వాట్సాప్ పనిచేయదు.. లిస్ట్ లో ఉన్న మోడళ్లు ఇవే..
ఫ్రతీకాత్మక చిత్రం
WhatsApp: ఫోన్ సెట్టింగ్స్ మెనూ ద్వారా మీరు ఏ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ వెర్షన్ ఉపయోగిస్తున్నారో చెక్ చేయవచ్చు. వాట్సాప్ సపోర్ట్‌ను ఉపసంహరించుకునే ఓఎస్ వాడేవారు, ఈ మెసేజింగ్ యాప్‌ను వినియోగించడానికి కొత్త డివైజ్‌లకు అప్‌గ్రేడ్ అవ్వాల్సి ఉంటుంది.
ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను యూజర్లకు పరిచయం చేస్తోన్న వాట్సాప్(WhatsApp).. పాతతరం ఆపరేటింగ్ సిస్టమ్‌లతో పనిచేసే డివైజ్‌లకు యాక్సెస్‌ను నిలిపివేయనుంది. ఫేస్బుక్యాజమాన్యంలోని ఈ మెసేజింగ్ యాప్.. కొన్ని పాత స్మార్ట్ఫోన్లలో పనిచేయడం ఆగిపోనుంది. నవంబర్ 1 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. ఆండ్రాయిడ్, iOS పాత వెర్షన్లకు సపోర్ట్ ఇవ్వడం ఆపివేస్తున్నట్లు వాట్సాప్(WhatsApp Latest Telugu News) తాజాగా ప్రకటించింది. ఆండ్రాయిడ్ OS 4.1.. ఆ తరువాత వచ్చిన ఓఎస్‌లతో పనిచేసే డివైజ్‌లలోనే ఈ మెసేజింగ్ యాప్ పనిచేయనుంది. దీంతోపాటు iOS 10, ఆ తరువాత వెర్షన్ ఐఓఎస్‌లతో నడిచే ఐఫోన్లనే వాట్సాప్ పనిచేయనుంది.
ఈ నిర్ణయంతో 2011 కంటే ముందు వచ్చిన పాత స్మార్ట్ఫోన్లలో వాట్సాప్ పనిచేయకపోవచ్చు. ఫోన్ సెట్టింగ్స్ మెనూ ద్వారా మీరు ఏ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ వెర్షన్ ఉపయోగిస్తున్నారో చెక్ చేయవచ్చు. వాట్సాప్ సపోర్ట్‌ను ఉపసంహరించుకునే ఓఎస్ వాడేవారు, ఈ మెసేజింగ్ యాప్‌ను వినియోగించడానికి కొత్త డివైజ్‌లకు అప్‌గ్రేడ్ అవ్వాల్సి ఉంటుంది.
* ఏయే ఫోన్లలో వాట్సాప్ పనిచేయదు?
యాపిల్
యాపిల్ సంస్థ నుంచి విడుదలైన ఐఫోన్ 6S, ఐఫోన్ 6S Plus, ఐఫోన్ SE డివైజ్‌లలో నవంబర్ 1 నుంచి వాట్సాప్ పనిచేయదు.
వాట్సాప్ పనిచేయని ఎల్జీ స్మార్ట్ఫోన్లు
ఎల్జీ లూసిడ్ 2, ఆప్టిమస్ L5 డ్యుయల్, ఆప్టిమస్ L4 II డ్యుయల్, ఆప్టిమస్ F3Q, ఆప్టిమస్ F7, ఆప్టిమస్ F5, ఆప్టిమస్ L3 II డ్యుయల్, ఆప్టిమస్ F5, ఆప్టిమస్ L5, ఆప్టిమస్ L5 II, ఆప్టిమస్ L3 II, ఆప్టిమస్ L7, ఆప్టిమస్ L7 II డ్యుయల్, ఆప్టిమస్ L7 II, ఆప్టిమస్ F6, ఎన్యాక్ట్, ఆప్టిమస్ F3, ఆప్టిమస్ L4 II, ఆప్టిమస్ L2 II, ఆప్టిమస్ నిట్రో HD, 4X HD
జెడ్‌టీఈ
జెడ్‌టీఈ (ZTE) సంస్థ నుంచి గతంలో వచ్చిన జెడ్‌టీఈ గ్రాండ్ S ఫ్లెక్స్, గ్రాండ్ X క్వాడ్ V987, జెడ్‌టీఈ V956, గ్రాండ్ మెమో డివైజ్‌లకు వాట్సాప్ సపోర్ట్‌ను ఉపసంహరించుకోనుంది.
హువావే
హువావే (Huawei) విడుదల చేసిన హువావే ఎసెండ్ G740, ఎసెండ్ D క్వాడ్ XL, ఎసెండ్ Mate, ఎసెండ్ P1 S, ఎసెండ్ D2, ఎసెండ్ D1 క్వాడ్ XL... డివైజ్‌లకు సైతం వాట్సాప్ యాక్సెస్‌ను నిలిపివేయనుంది.
Published by:Sridhar Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.