WhatsApp: ఆ స్మార్ట్‌ఫోన్ల యూజర్లకు షాక్.. ఇకపై వాటిలో వాట్సాప్ పని చేయదు..!

ప్రతీకాత్మక చిత్రం

ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది యూజర్లు ‌వాట్సాప్‌ను(WhatsApp) వినియోగిస్తున్నారు. విద్యార్థుల నుంచి ఉద్యోగుల వరకు ప్రతి ఒక్కరూ ఈ మెసేజింగ్‌ యాప్‌పై ఆధారపడుతున్నారు.

  • Share this:
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది యూజర్లు ‌వాట్సాప్‌ను(WhatsApp) వినియోగిస్తున్నారు. విద్యార్థుల నుంచి ఉద్యోగుల వరకు ప్రతి ఒక్కరూ ఈ మెసేజింగ్‌ యాప్‌పై ఆధారపడుతున్నారు. కొందరికి వాట్సాప్ లేనిదే రోజు గడవదు. ఈ స్థాయిలో ప్రజల జీవితాల్లో భాగమైన వాట్సాప్.. త్వరలోనే ఓల్డ్ ఫోన్ యూజర్లకు షాక్ ఇవ్వడానికి రెడీ అయింది. కొన్ని ఐఫోన్, ఆండ్రాయిడ్ ఫోన్లలో(Android smartphones) వాట్సాప్ సేవలను నిలిపి వేసేందుకు ఆ సంస్థ సిద్ధమవుతోంది. నవంబర్ 1, 2021 నుంచి కొన్ని మొబైల్ ఫోన్లలో వాట్సాప్ సేవలు నిలిచిపోనున్నాయి.

ఆండ్రాయిడ్ 4.0.3, అంతకంటే తక్కువ వెర్షన్ పై నడుస్తున్న అన్ని ఆండ్రాయిడ్ ఫోన్లలో నవంబరు 1 నుంచి వాట్సాప్ సేవలు ఆగిపోనున్నాయి. అలాగే ios 9 లేదా అంతకంటే తక్కువ ఆపరేటింగ్ వెర్షన్ పై పనిచేస్తున్న అన్ని ఫోన్లలో వాట్సాప్ సేవలు అందుబాటులో ఉండవు. నవంబర్ 1 నుంచి వాట్సాప్ అప్లికేషన్ కు సపోర్ట్ చేయని ఫోన్ల లిస్టును వాట్సాప్ కంపెనీ షేర్ చేసింది. ఆ ఫోన్లు ఏవో ఇప్పుడు చూద్దాం.

వాట్సాప్ సంస్థ విడుదల చేసిన జాబితాలో శాంసంగ్, ఎల్ జీ, సోనీ తదితర కంపెనీలకు చెందిన స్మార్ట్‌ఫోన్‌లు కూడా ఉన్నాయి. ఐఫోన్లలో( iPhones) ఐఫోన్ ఎస్ఈ, ఐఫోన్ 6S ఉన్నాయి. శాంసంగ్ ఫోన్ల గురించి తెలుసుకుంటే.. శాంసంగ్ గెలాక్సీ ట్రెండ్ లైట్ , గెలాక్సీ ట్రెండ్ II, గెలాక్సీ SII, గెలాక్సీ S3 మిని , గెలాక్సీ ఎక్స్ కవర్ 2, గెలాక్సీ కోర్, గెలాక్సీ ఏస్ 2 ఫోన్లలో వాట్సాప్ సేవలు నిలిచిపోతాయి.

Aviva Saral Pension Plan: పదవీ విరమణ తర్వాత నెలవారీ పెన్షన్ అందించే పథకం.. అందుబాటులోకి వచ్చిన అవైవా సరల్ పెన్షన్ ప్లాన్

అలాగే LG లుసిడ్ 2, LG ఆప్టిమస్ F7, LG ఆప్టిమస్ F5, ఆప్టిమస్ L3 II డ్యూయల్, ఆప్టిమస్ F5, ఆప్టిమస్ L5, ఆప్టిమస్ L5 II, ఆప్టిమస్ L5 డ్యూయల్, ఆప్టిమస్ L3 II, ఆప్టిమస్ L7, ఆప్టిమస్ L7 II డ్యూయల్, ఆప్టిమస్ F6, ఆప్టిమస్ F6, LG ఎనాక్ట్(Enact), ఆప్టిమస్ L4 II డ్యూయల్, ఆప్టిమస్ F3, ఆప్టిమస్ L4 II, ఆప్టిమస్ L2 II, ఆప్టిమస్ నైట్రో HD & 4X HD, ఆప్టిమస్ F3Q ఫోన్లలో వాట్సాప్ పని చేయదు.

ఇక ZTE గ్రాండ్ S ఫ్లెక్స్, ZTE V956, గ్రాండ్ X క్వాడ్ V987, ZTE గ్రాండ్ మెమోతో సహా పలు ZTE ఫోన్లు కూడా వాట్సాప్ కి సపోర్ట్ చేయవు. Huawei కంపెనీకి చెందిన Ascend G740, Ascend Mate, Ascend D Quad XL, Ascend D1 Quad XL, Ascend P1 S, Ascend D2 ఫోన్లలో యాప్ సేవలు ఆగిపోతాయి.‌ సోనీ Xperia Miro, సోనీ Xperia నియో ఎల్, Xperia Arc S కూడా ఈ జాబితాలో ఉన్నాయి. ఆల్కాటెల్, HTC, లెనోవో కంపెనీలకు చెందిన మరికొన్ని ఫోన్లు కూడా వాట్సాప్ కి సపోర్ట్ చేయవు.

పైన పేర్కొన్న మొబైల్ ఫోన్లకు వాట్సాప్‌ సపోర్ట్ త్వరలోనే నిలిచిపోనుంది. అయితే నవంబర్ 1వ తేదీ రాగానే వాట్సాప్ సేవలు నిలిచిపోవు. నవంబర్ 1 తర్వాత ఈ స్మార్ట్‌ఫోన్‌లు సెక్యూరిటీ అప్‌డేట్‌లు, కొత్త ఫీచర్‌లను పొందలేవు. కొద్దిరోజుల తర్వాత అప్‌డేట్‌ చేసుకుంటేనే వాట్సాప్ వాడగలరనే మెసేజ్ వస్తుంది. కానీ ఈ ఫోన్లకు అప్‌డేట్‌లు రావు కాబట్టి ఆటోమేటిక్ గా వాట్సాప్ సేవలు నిలిచిపోతాయి.
Published by:Sumanth Kanukula
First published: