Home /News /technology /

WHATSAPP WILL SOON ALLOW YOU TO REGISTER COMPLAINTS WITHIN THE APP GH VB

WhatsApp New Feature: వాట్సాప్ నుంచి కొత్త ఫీచర్.. ఇక అది చేయడం ఎంతో సులువు..

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లు పరిచయం చేస్తూ తన యూజర్లు వేరే యాప్స్ వైపు వెళ్లకుండా కట్టిపడేస్తోంది ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (WhatsApp). నిరుడు లెక్కలేనన్ని ఫీచర్స్ తీసుకొచ్చిన వాట్సాప్ కొత్త ఏడాదిలో కూడా అదిరిపోయే ఫీచర్లు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సిద్ధమైంది.

ఇంకా చదవండి ...
ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లు(New Features) పరిచయం చేస్తూ తన యూజర్లు వేరే యాప్స్ వైపు వెళ్లకుండా కట్టిపడేస్తోంది ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (WhatsApp). నిరుడు లెక్కలేనన్ని ఫీచర్స్ తీసుకొచ్చిన వాట్సాప్ కొత్త ఏడాదిలో(New Year) కూడా అదిరిపోయే ఫీచర్లు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా తాజాగా ఒక కొత్త ఫీచర్ (New feature)పై పని చేస్తోంది. యాప్ నుంచే నేరుగా వాట్సాప్ సపోర్ట్ (WhatsApp Support)ను సంప్రదించడానికి యూజర్లను అనుమతించే ఒక ఫీచర్‌పై ప్రస్తుతం వాట్సాప్ పని చేస్తోంది. ఇప్పటికే ఈ ఫీచర్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ బీటా టెస్టర్‌లకు అందుబాటులోకి వచ్చింది. త్వరలోనే ఇది అందరికీ అందుబాటులోకి రావచ్చని తెలుస్తోంది.

Xiaomi 11i vs Vivo V23: డైమెన్సిటీ 920 ప్రాసెసర్ ఉన్న ఈ స్మార్ట్‌ఫోన్లలో ఏది బెస్ట్? తెలుసుకోండి

వాస్తవానికి వాట్సాప్ ఈ ఫీచర్‌ను గతేడాది మార్చి నెలలోనే ప్రవేశపెట్టింది. అయితే బీటా ఫీచర్ గా ఉన్నప్పుడే దాన్ని నిలిపివేశారు. మళ్లీ ఇప్పుడు యాప్‌లోనే డైరెక్ట్ గా వాట్సాప్ సపోర్ట్‌ను కాంటాక్ట్ అయ్యేలా అనుమతించే ఒక ఫీచర్ బీటా వెర్షన్లలో కనిపించిందని వాట్సాప్ ట్రాకర్ వాట్సాప్ బీటా ఇన్ఫో (WABetaInfo) వెల్లడించింది. ఆండ్రాయిడ్‌లో వాట్సాప్ బీటా వెర్షన్ 2.22.3.5, ఐఓఎస్‌లో బీటా వెర్షన్ 22.7.72లో కొత్త ఇన్-యాప్ చాట్ సపోర్ట్ ఫీచర్ వెలుగు చూసింది. ఈ ఫీచర్ ఎలా పని చేస్తుందో ఇప్పుడు చూద్దాం.

ఈ ఫీచర్ సెట్టింగ్స్> హెల్ప్> కాంటాక్ట్ అస్(Contact Us) ఆప్షన్స్ లోకి వెళ్లడం ద్వారా వాట్సాప్ కస్టమర్ సపోర్ట్‌తో చాట్ లోనే కనెక్ట్ అయ్యేలా యూజర్లను అనుమతిస్తుంది. మీరు వాట్సాప్ సెట్టింగ్స్‌లోని వెళ్లి హెల్ప్ ఆప్షన్‌పై క్లిక్ చేసి మీ ఫిర్యాదు లేదా రిపోర్ట్ పొందుపరిచిన తరువాత స్క్రీన్ కింది భాగంలో... "వి విల్ రెస్పాండ్ టు యు ఇన్ వాట్సాప్ చాట్ (we will respond to you in WhatsApp chat)" అని ఒక మెసేజ్ కనిపిస్తుంది. దానికి పక్కనే ఉన్న నెక్స్ట్ బటన్ పై క్లిక్ చేసిన అనంతరం వాట్సాప్ సపోర్ట్ టీమ్‌కు సంబంధించిన ఒక కొత్త చాట్‌ను వాట్సాప్ క్రియేట్ చేస్తుంది. చాట్ బాక్స్ లో కనిపించే ఈ కొత్త చాట్‌లో యూజర్లు తమ ఫిర్యాదులను పేర్కొనవచ్చు. అలాగే వాట్సాప్ నుంచి సపోర్ట్ అందుకోవచ్చు.

వాట్సాప్ సంస్థ వేరే పేజీల్లో కాకుండా యాప్‌లోనే ఒక వెరిఫైడ్ అకౌంట్ ద్వారా సమస్యలు పరిష్కరించేందుకు యూజర్లను సంప్రదిస్తుంది. యాప్‌లో ఉండే చాట్ సపోర్ట్ ఫీచర్ అనేది మీ స్మార్ట్‌ఫోన్ మోడల్ నంబర్, నెట్‌వర్క్ కనెక్షన్ వివరాలు, ఫోన్ సెట్టింగ్‌లతో సహా టెక్నికల్, విశ్లేషణ సమాచారాన్ని పంపుతుంది. ఈ సమాచారం ప్రాబ్లమ్స్ గుర్తించడంలో సహాయపడటానికి, వాట్సాప్‌తో సమస్యను పరిష్కరించడానికి యూజ్ అవుతుంది.

Oppo 7 Series: ఒప్పో నుంచి రెండు 7 సిరీస్​ ఫోన్లు.. ఆన్​లైన్​లో లీకైన ధర, ఫీచర్ల వివరాలివే..


ఈ ఫీచర్ మాత్రమే కాకుండా ఇప్పుడు వాట్సాప్ హార్ట్ ఎమోజీ కోసం కొత్త యానిమేషన్‌లను పరీక్షించడం ప్రారంభించింది. ప్రస్తుతం, రెడ్ హార్ట్ ఎమోజీ మాత్రమే బీట్ అవుతున్నట్లుగా యానిమేట్ అవుతుంది. కానీ ఇప్పుడు వాట్సాప్ ఇతర హార్ట్ ఎమోజీలకు కూడా యానిమేషన్‌లను జోడించడానికి ప్లాన్ చేస్తోంది. దీన్ని ఐఓఎస్‌లోని వాట్సాప్ బీటా వెర్షన్ 22.2.72లో గుర్తించినట్లు వాట్సాప్ బీటా ఇన్ఫో వెల్లడించింది. ఐఓఎస్‌లో నోటిఫికేషన్‌లను రిసీవ్ చేసుకునే విధానాన్ని కూడా వాట్సాప్ మారుస్తున్నట్లు సమాచారం. ఈ ఫీచర్ తో మెసేజ్ పంపిన కాంటాక్ట్‌కి సంబంధించిన వాట్సాప్ డిస్‌ప్లే ఫొటో త్వరలోనే నోటిఫికేషన్‌లో పెద్దగా కనిపించనుంది.
Published by:Veera Babu
First published:

Tags: Latest Technology, Technology, Whatsapp

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు