హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

WhatsApp: వాట్సాప్ కొత్త అప్‌డేట్.. త్వరలో ఎడిట్ ఫీచర్ లాంచ్.. ప్రత్యేకతలు ఇవే..

WhatsApp: వాట్సాప్ కొత్త అప్‌డేట్.. త్వరలో ఎడిట్ ఫీచర్ లాంచ్.. ప్రత్యేకతలు ఇవే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

పంపించిన మెసేజ్‌లను ఎడిట్ చేసుకునేందుకు వీలుగా ఒక ఫీచర్ తీసుకురావాలని వాట్సాప్‌ను యూజర్లు చాలా కాలంగా కోరుతున్నారు. అయితే వారి కోరిక మేరకు వాట్సాప్ ఎడిట్ ఫీచర్‌ని తీసుకొచ్చే పనిలో పడింది.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

WhatsApp: ప్రపంచవ్యాప్తంగా బాగా పాపులర్ అయిన మెసేజింగ్ యాప్ వాట్సాప్ (WhatsApp) నిత్యం కొత్త ఫీచర్లను పరిచయం చేస్తూనే ఉంది. అదిరిపోయే ఫీచర్లతో యూజర్లను ఎప్పటికప్పుడు ఆకట్టుకుంటూనే ఉంది. అయితే ఒక్క విషయంలో మాత్రం యూజర్లు ఎప్పటినుంచో వాట్సాప్‌పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అదే, ఈ ప్లాట్‌ఫామ్‌లో ఎడిట్ ఫీచర్ (Edit Feature) లేకపోవడం. పంపించిన మెసేజ్‌లను ఎడిట్ చేసుకునేందుకు వీలుగా ఒక ఫీచర్ తీసుకురావాలని వాట్సాప్‌ను యూజర్లు చాలా కాలంగా కోరుతున్నారు. అయితే వారి కోరిక మేరకు వాట్సాప్ ఎడిట్ ఫీచర్‌ని తీసుకొచ్చే పనిలో పడింది. తాజాగా ఐఓఎస్ లేటెస్ట్ వాట్సాప్ బీటా వెర్షన్‌ 23.6.0.74లో ఎడిట్ ఫీచర్ కనిపించింది. దీనికి సంబంధించిన వివరాలను వాట్సాప్ ట్రాకర్ WABetaInfo తాజా నివేదిక వెల్లడించింది.

నిజానికి గతేడాది నవంబర్ నెలలో iOS 22.23.0.73 అప్‌డేట్‌లోనే ఎడిట్ ఫీచర్ కనిపించింది. అప్పటినుంచి దీనిని వాట్సాప్ అభివృద్ధి చేయడం మొదలెట్టింది. కాగా ఈ ఫీచర్ ఇంకా డెవలప్‌మెంట్‌ స్టేజ్‌లోనే ఉందని వాట్సాప్ బీటా ఇన్ఫో వెల్లడించింది. టెస్ట్‌ఫ్లైట్ యాప్‌లో అందుబాటులో ఉన్న iOS 23.6.0.74 వాట్సాప్ బీటాలో ఎడిట్ ఫీచర్‌కి సంబంధించి ఒక కీలకమైన విషయాన్ని కూడా కనిపెట్టింది. అదేంటంటే, వాట్సాప్ ఇప్పుడు ఒక కొత్త డెడికేటెడ్ అలర్ట్‌పై పనిచేస్తోంది. ఈ అలర్ట్‌కి సంబంధించి ఒక స్క్రీన్‌షాట్‌ని కూడా WABetaInfo పంచుకుంది. అందులో లేటెస్ట్ వెర్షన్ వాడుతున్న అందరికీ ఎడిటెడ్ మెసేజ్‌ సెండ్ అవుతుందని రాసి ఉంది.

ప్రతి ఒక్కరూ యాప్ లేటెస్ట్ వెర్షన్‌ను ఉపయోగిస్తుంటే, కన్వర్జేషన్‌లో ప్రతి ఒక్కరికీ ఎడిటెడ్ మెసేజ్‌లు కనిపిస్తాయనేది ఆ అలర్ట్ సారాంశం. ఇక వాట్సాప్ బీటా ఇన్ఫో ప్రకారం, సంభాషణలో ఉన్న ఎవరైనా వాట్సాప్ తాజా వెర్షన్‌ని వాడకుంటే, సవరించిన మెసేజ్ వారికి సెండ్ అవుతుంది కానీ ఎడిట్ చేసినట్లు ఎలాంటి సూచన కనిపించదు. అలాగే వారు తమ మెసేజ్‌లను ఎడిట్ చేయలేరు. మెసేజ్ ఎడిటింగ్ ఫీచర్‌కి సపోర్ట్ చేయని వాట్సాప్ వెర్షన్ల గడువు ముగిసేనాటికి, వాట్సాప్ అందరికీ మెసేజ్‌లను ఎడిట్ చేసే ఫీచర్‌ను విడుదల చేసే అవకాశం ఉంది. అప్పుడు ప్రతి ఒక్కరూ ఎడిట్ ఫీచర్ ఉన్న వెర్షన్‌కి అప్‌గ్రేడ్ చేసుకోగలుగుతారు.

ChatGPT: చాట్‌జీపీటీకి ఇంటర్నెట్ యాక్సెస్.. మన పనులన్నీ చేసేంత శక్తి దీని సొంతం

* 15 నిమిషాల్లో ఎడిట్ చేసుకోవచ్చు

వాట్సాప్ ప్రస్తుతం అభివృద్ధి చేస్తున్న ఎడిటింగ్ ఫీచర్‌ iMessage మాదిరిగానే పని చేస్తుంది. ఈ ఫీచర్‌తో యూజర్లు తాము పంపిన మెసేజ్‌లో తప్పులను సరి చేసుకునేందుకు మరో మెసేజ్‌ను పంపాల్సిన అవసరం ఉండదు. అందులకు బదులుగా వారు ఎడిట్ ఫీచర్ ఉపయోగించి తప్పులను సరిదిద్దుకోవచ్చు. ఈ ఫీచర్ మెసేజ్‌ పంపిన 15 నిమిషాలలోపు ఎడిట్ చేసుకోవడానికి యూజర్లకు వీలు కల్పిస్తుంది. ఎడిటడ్ మెసేజ్‌కి సంబంధించి మెసేజ్ బబుల్‌లో "ఎడిటెడ్ మెసేజ్" అని లేబుల్ కూడా కనిపిస్తుంది. ఈ ఫీచర్ ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉంది. ఇది అందుబాటులోకి రావడానికి మరి కొంతకాలం పట్టవచ్చు. మరోవైపు ఈ ఫీచర్ గురించి అధికారికంగా వాట్సాప్ ఇంకా ప్రకటించలేదు.

First published:

Tags: Technology, Whatsapp, Whatsapp tricks

ఉత్తమ కథలు