WhatsApp: వాట్సప్‌లో మరో అద్భుతమైన ఫీచర్ వచ్చేస్తోంది

WhatsApp Delete Messages feature | యూజర్లకు ఇప్పటికే అనేక ఆసక్తికరమైన ఫీచర్స్ అందించిన వాట్సప్... త్వరలో 'డిలిట్ మెసేజెస్' ఫీచర్‌ని రిలీజ్ చేయబోతోంది. ఆ ఫీచర్ ఎలా పనిచేస్తుందో తెలుసుకోండి.

news18-telugu
Updated: March 16, 2020, 4:54 PM IST
WhatsApp: వాట్సప్‌లో మరో అద్భుతమైన ఫీచర్ వచ్చేస్తోంది
WhatsApp: వాట్సప్‌లో మరో అద్భుతమైన ఫీచర్ వచ్చేస్తోంది (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
వాట్సప్ అందించే సరికొత్త ఫీచర్స్ ఎప్పుడూ వార్తల్లో ఉంటాయి. త్వరలో మరో అద్భుతమైన ఫీచర్‌ని అందించబోతోంది వాట్సప్. 'డిలిట్ మెసేజెస్' పేరుతో ఓ ఫీచర్‌ని రూపొందిస్తోంది. వాస్తవానికి ఈ ఫీచర్ గురించి గత ఏడాది లీక్స్ వచ్చాయి. 'డిలిట్ మెసేజెస్' లేదా 'సెల్ఫ్ డిస్ట్రక్టింగ్' పేరుతో వాట్సప్ ఓ ఫీచర్‌ని రూపొందిస్తున్నట్టు అప్పట్లో వార్తలొచ్చాయి. ఆ ఫీచర్‌కు 'డిలిట్ మెసేజెస్' అనే పేరు ఫైనలైజ్ చేసింది వాట్సప్. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూజర్లందరికీ డార్క్ మోడ్ ఫీచర్‌ను రిలీజ్ చేసిన వాట్సప్... త్వరలో ఈ 'డిలిట్ మెసేజెస్' ఫీచర్‌ని కూడా అందించనుంది. ఇప్పటికే ఈ ఫీచర్‌ను ఆండ్రాయిడ్ బీటా యూజర్లకు రిలీజ్ చేసింది. బీటా యూజర్లు 'డిలిట్ మెసేజెస్' టెస్ట్ చేస్తున్నారు. లోపాలు ఏవైనా ఉంటే సరిదిద్దిన తర్వాత పూర్తి స్థాయిలో యూజర్లకు ఈ ఫీచర్ రిలీజ్ చేస్తుంది వాట్సప్. సెట్టింగ్స్ మెనూలో ఈ ఫీచర్ త్వరలో కనిపించనుంది.

WhatsApp latest features, WhatsApp new features, WhatsApp Self Destructing feature, WhatsApp Delete Messages feature, WhatsApp upcoming features, వాట్సప్ లేటెస్ట్ ఫీచర్స్, వాట్సప్ కొత్త ఫీచర్స్, వాట్సప్ సెల్ఫ్ డిస్ట్రక్టింగ్ ఫీచర్, వాట్సప్ డిలిట్ మెసేజెస్ ఫీచర్, వాట్సప్ డిసప్పీయరింగ్ మెసేజెస్ ఫీచర్
image: wabetainfo


వాట్సప్‌లోని అద్భుతమైన ఫీచర్స్‌లో 'డిలిట్ మెసేజెస్' కూడా ఒకటి. సాధారణంగా వాట్సప్‌లో మీరు పంపిన మెసేజ్‌ను ఎప్పుడైనా డిలిట్ చేయొచ్చు. అవతలివాళ్లు చూడనప్పుడు మెసేజ్ డిలిట్ చేస్తే మీరు అందులో ఏం పంపారో వారికి తెలియదు. అవతలివాళ్లు చదివిన తర్వాత కూడా డిలిట్ చేసే అవకాశముంది. ఇలా కాకుండా మీరు పంపిన మెసేజ్ ఎంత సేపట్లో డిలిట్ కావాలో మీరు ముందే నిర్ణయించడానికి అవకాశం కల్పిస్తుంది 'డిలిట్ మెసేజెస్' ఫీచర్. అంటే ఒక గంట, ఒక రోజు, ఒక వారం, ఒక నెల, ఒక ఏడాది... ఇలా మీరే సమయాన్ని నిర్ణయించొచ్చు. మీరు చెప్పిన సమయానికి వాట్సప్‌లో ఆ మెసేజ్ డిలిట్ అవుతుంది. మొదట్లో వాట్సప్‌లోని గ్రూప్స్‌లో మాత్రమే ఈ ఫీచర్ ఉంటుందని ప్రకటించినా, ఇండివిజ్యువల్ ఛాట్స్‌లో కూడా ఈ ఫీచర్ రిలీజ్ చేయనుంది వాట్సప్.

ఇవి కూడా చదవండి:



Smartphone: మీ స్మార్ట్‌ఫోన్‌పై ఉండే వైరస్‌ను క్లీన్ చేయండి ఇలా

Redmi Note 9 Pro: రేపే రెడ్‌‌మీ నోట్ 9 ప్రో సేల్... ఫీచర్స్ ఇవే

Flipkart Sale: మార్చి 19 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ షాపింగ్ డేస్ సేల్... ఆఫర్స్ ఇవే 
First published: March 16, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading