జనవరి 1 నుంచి ఈ ఫోన్లల్లో వాట్సప్ పనిచేయదు...ఆ లిస్ట్‌లో మీ ఫోన్ ఉందా?

జనవరి 1 నుంచి కొన్ని స్మార్ట్ ఫోన్స్‌లో వాట్సప్ పనిచేయదు. మరి ఈ ఫోన్ల జాబితాలో మీదు కూడా ఉందేమో ఓసారి చెక్ చేసుకోెండి.

news18-telugu
Updated: December 31, 2018, 11:16 PM IST
జనవరి 1 నుంచి ఈ ఫోన్లల్లో వాట్సప్ పనిచేయదు...ఆ లిస్ట్‌లో మీ ఫోన్ ఉందా?
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
మీ దగ్గర పాత మోడల్ స్మార్ట్‌ఫోన్ ఉందా? ఇక అందులో వాట్సప్ పనిచేయదు. నోకియా సింబియన్, బ్లాక్‌బెర్రీ 10, ఆండ్రాయిడ్ పాత వర్షన్లు ఉన్న ఫోన్లల్లో తమ సేవలను జనవరి 1 నుంచి నిలిపివేయాలని వాట్సప్ నిర్ణయించింది. ఏఏ ఫోన్లల్లో వాట్సప్ పనిచేయదో గతంలోనే లిస్ట్ ఇచ్చింది కంపెనీ. ఇకపై ఆ ఫోన్లల్లో వాట్సప్ ఉపయోగించుకోవడం సాధ్యం కాదు. ఆ ప్లాట్‌ఫామ్స్‌లో వాట్సప్ ఉపయోగించగల సామర్థ్యాలు లేవని, వాటిని అప్‌గ్రేడ్ చేస్తే తప్ప తమ యాప్ వాడుకోలేరని వాట్సప్ తేల్చి చెప్పింది. వాట్సప్ ఉపయోగించాలంటే ఆండ్రాయిడ్ ఓఎస్ 4.0+, ఐఫోన్ ఐఓఎస్ 7+, విండోస్ ఫోన్ 8.1+ ఉండాలి.

ఇకపై వాట్సప్ పనిచేయని ఫోన్లు ఇవే...

నోకియా ఎస్40
నోకియా ఎస్60
బ్లాక్‌బెర్రీ ఓఎస్
బ్లాక్‌బెర్రీ 10
ఆండ్రాయిడ్ 2.2 ఫ్రోయోఐఓఎస్ 6
విండోస్ ఫోన్7

ఈ ఆపరేటింగ్ సిస్టమ్స్‌లో ఇక వాట్సప్ అకౌంట్స్ క్రియేట్ చేయడం సాధ్యం కాదు. ఒకవేళ వాట్సప్ ఇన్‌స్టాల్ చేసి ఉంటే డెడ్‌లైన్ వరకు వాడుకోవచ్చు. కానీ వాట్సప్ ఏ క్షణాన అయినా ఆగిపోవచ్చు.

ఇవి కూడా చదవండి:

ఫేక్ మొబైల్ యాప్స్‌ని అడ్డుకోవడానికి 5 టిప్స్

తగ్గిన క్రెడిట్ స్కోర్ పెంచుకోవడానికి 10 మార్గాలు

మ్యూచువల్ ఫండ్ తీసుకుంటున్నారా? ఈ 5 అంశాలు పరిశీలించండి

#Reminder: 2019లో మీరు గుర్తుంచుకోవాల్సిన డెడ్‌లైన్స్ ఇవే...
Published by: Santhosh Kumar S
First published: December 31, 2018, 11:15 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading