WhatsApp Status: వాట్సప్‌లో స్టేటస్ వాడుతున్నారా? త్వరలో ఈ సమస్య తప్పదు

WhatsApp Status | వాట్సప్ రిలీజ్ చేసిన ఫీచర్లలో ఎక్కువగా యూజర్లకు నచ్చింది స్టేటస్ ఫీచరే. అలాంటి స్టేటస్‌లో యాడ్స్ ప్రమోట్ చేస్తే యూజర్ల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో తెలియదు.

news18-telugu
Updated: January 7, 2020, 3:52 PM IST
WhatsApp Status: వాట్సప్‌లో స్టేటస్ వాడుతున్నారా? త్వరలో ఈ సమస్య తప్పదు
WhatsApp: వాట్సప్‌లో స్టేటస్ వాడుతున్నారా? త్వరలో ఈ సమస్య తప్పదు (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
వాట్సప్‌ ఫీచర్లలో యూజర్లను బాగా ఆకట్టుకున్న, బాగా నచ్చిన ఫీచర్ 'స్టేటస్'. వాట్సప్‌లో స్టేటస్ చూడనివారు, స్టేటస్ అప్‌డేట్ చేయనివారు దాదాపుగా ఉండరు. అంతలా ఈ ఫీచర్ అందర్నీ ఆకట్టుకుంది. వాట్సప్ స్టేటస్‌ ఉపయోగిస్తున్నవారికి త్వరలో షాక్ ఇవ్వనుంది కంపెనీ. వాట్సప్ స్టేటస్‌లో యాడ్స్ ప్రమోట్ చేయనుంది. ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో యాడ్స్ ఎలా పనిచేస్తాయో వాట్సప్ స్టేటస్‌లో యాడ్స్ కూడా అలాగే కనిపించబోతున్నాయి. త్వరలోనే వాట్సప్ స్టేటస్‌లో యాడ్స్ చూపించేందుకు సన్నాహాలు చేస్తోంది కంపెనీ. గతేడాది నెదర్లాండ్స్‌లో జరిగిన ఫేస్‌బుక్ మార్కెటింగ్ సమ్మిట్‌లోనే 'స్టేటస్ యాడ్స్' గురించి వెల్లడించింది వాట్సప్. స్టేటస్‌లో కనిపించే యాడ్స్‌లో అడ్వర్టైజర్ పేరు కూడా కనిపిస్తుందని చెప్పింది వాట్సప్.

వాట్సప్‌లో ఈ ఏడాది 'స్టేటస్ యాడ్స్' రావడం ఖాయం. అయితే ఎప్పట్లోగా ఈ ఫీచర్‌ని వాట్సప్ రిలీజ్ చేస్తుంది అన్నది తెలియదు. అయితే వాట్సప్ రిలీజ్ చేసిన ఫీచర్లలో ఎక్కువగా యూజర్లకు నచ్చింది స్టేటస్ ఫీచరే. అలాంటి స్టేటస్‌లో యాడ్స్ ప్రమోట్ చేస్తే యూజర్ల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో తెలియదు. ఇప్పటికే వాట్సప్ ప్రైవసీ విషయంలో అనేక ఆందోళనలు ఉన్నాయి. ఇప్పుడు యూజర్ల డేటా అడ్వర్టైజర్ల చేతుల్లోకి వెళ్తుందా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఇవి కూడా చదవండి:

Paytm: పేటీఎం వాడుతున్నవారికి షాక్... ఈ ఛార్జీల గురించి తెలుసా?

IRCTC Rules 2020: రైలు టికెట్ క్యాన్సిల్ చేస్తున్నారా? ఈ రూల్స్ తెలుసుకోండి

SBI Account: ఈ ఒక్క అకౌంట్ ఓపెన్ చేస్తే మీకు ఎన్నో లాభాలు... తెలుసుకోండి
Published by: Santhosh Kumar S
First published: January 7, 2020, 3:52 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading