హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

WhatsApp video calls ఇంటర్​ఫేజ్​లో మార్పులు.. ఈ విషయాలు తెలుసుకోండి

WhatsApp video calls ఇంటర్​ఫేజ్​లో మార్పులు.. ఈ విషయాలు తెలుసుకోండి

 (ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

వాట్సాప్ యూజర్లు గ్రూప్​ కాల్​లో ఎవరెవరు పాల్గొన్నారనే విషయాన్ని కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. దీని కోసం వాట్సాప్..​ కాల్​ ఇన్ఫో స్క్రీన్​ను అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా వాట్సాప్​ గ్రూప్​లో ఎవరిని ఇన్వైట్ చేశారు? ఎవరు జాయిన్​ అయ్యారు? ఎవరు అవ్వలేదు? వంటి సమాచారం తెలుసుకోవచ్చు.

ఇంకా చదవండి ...

ఫేస్​బుక్​ యాజమాన్యంలోని ప్రముఖ మెసేజింగ్​ యాప్​ వాట్సాప్ అందిస్తున్న అనేక ఫీచర్లలో గ్రూప్​ కాలింగ్​ ఫీచర్​ కూడా ఒకటి. అయితే వాట్సాప్​ తాజాగా గ్రూప్​ కాల్స్​ యూజర్​ ఇంటర్​ఫేస్​ను మార్చింది. అంతేకాదు, జాయిన్​ గ్రూప్​ కాల్స్​ పేరుతో కొత్త ఫీచర్​ను తీసుకొచ్చింది. ఈ ఫీచర్​ సాయంతో యూజర్స్​ గ్రూప్​ కాల్​ మధ్యలో ఎప్పుడైనా జాయిన్​ కావచ్చు. కాగా, ఈ గ్రూప్​ వీడియో కాలింగ్​ ఫీచర్​ను​ గూగుల్ డుయో, జూమ్, గూగుల్ మీట్‌ వంటి వీడియో కాలింగ్​ ప్లాట్​ఫామ్​లు ఇప్పటికే అందిస్తున్నాయి. ఈ కొత్త వీడియో కాలింగ్​ ఫీచర్​లో కొత్తగా చేసిన మార్పులు, యూజర్ల సందేహాలు, వాటికి సమాధానాలు తెలుసుకుందాం.

గ్రూప్ కాల్​లో ఎవరెవరు పాల్గొన్నారో తెలుసుకోవచ్చా?

వాట్సాప్ యూజర్లు గ్రూప్​ కాల్​లో ఎవరెవరు పాల్గొన్నారనే విషయాన్ని కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. దీని కోసం వాట్సాప్..​ కాల్​ ఇన్ఫో స్క్రీన్​ను అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా వాట్సాప్​ గ్రూప్​లో ఎవరిని ఇన్వైట్ చేశారు? ఎవరు జాయిన్​ అయ్యారు? ఎవరు అవ్వలేదు? వంటి సమాచారం తెలుసుకోవచ్చు.

వీడియో కాలింగ్​ను రికార్డ్ చేయవచ్చా? లేదా స్క్రీన్‌షాట్‌లు తీసుకోవచ్చా?

వీడియో కాల్ రికార్డింగ్ సదుపాయం అందుబాటులో లేదు. వాట్సాప్‌లోని వీడియో కాల్స్ ఎండ్- టు- ఎండ్ ఎన్​క్రిప్షన్​తో సేఫ్టీగా ఉంటాయి. కాబట్టి పార్టిసిపెంట్స్ వీడియో కాల్స్​ను రికార్డ్ చేయలేరు. అయితే వీడియో కాల్‌లో పాల్గొనేవారి స్క్రీన్‌షాట్‌లను మాత్రం తీసుకోవచ్చు.

కాల్‌ డ్రాప్​ చేసి మళ్లీ జాయిన్​ కావచ్చా?

యూజర్లు వీడియో కాలింగ్​ మధ్యలో కాల్‌ డ్రాప్-ఆఫ్ చేసి, తిరిగి జాయిన్​ కావొచ్చు.

గ్రూప్​ వీడియో కాల్​ కొనసాగుతున్న సమయంలో యూజర్లు వీడియోను మధ్యలో ఆపేయవచ్చా?

వీడియో కాల్​ జరుగుతున్న సమయంలో యూజర్లు మధ్యలో వీడియోను ఆపేయవచ్చు. యూజర్లు వారి వీడియోపై క్లిక్​ చేయడం ద్వారా అర్ధాంతరంగా వీడియో స్ట్రీమింగ్​ను నిలిపివేయవచ్చు.

* గ్రూప్​ వీడియో కాల్​ నుంచి ఎవరైనా మెంబర్​ను తొలగించవచ్చా?

గ్రూప్​ వీడియో కాల్ సమయంలో యూజర్లు నిర్దిష్ట గ్రూప్​ మెంబర్​ను తొలగించలేరు. అతడు తనంతట తాను మాత్రమే గ్రూప్​ నుంచి వైదొలిగితే తప్ప.. గ్రూప్​ కాల్ నుంచి డిస్​ కనెక్ట్​ కాలేరు.

* గతంలో బ్లాక్ చేసిన కాంటాక్ట్​ మెంబర్​ కూడా వీడియో కాల్‌లో యాడ్​ అవ్వొచ్చా?

మీరు బ్లాక్ చేసినప్పటికీ అతడు/ఆమె మీ గ్రూప్ వీడియో కాల్‌లో చేరవచ్చు. మీ గ్రూప్​లోని ఎవరైనా మెంబర్​ అతన్ని యాడ్​ చేస్తే ఇది సాధ్యమవుతుంది.


* ఈ ఫీచర్లకు మద్దతిచ్చే గూగుల్​ ఆండ్రాయిడ్​ ఓఎస్​ వెర్షన్​ ఏంటి?

వీడియో కాల్ ఫీచర్ 4.1 లేదా అంతకంటే ఎక్కువ ఉన్న ఆండ్రాయిడ్​ ఫోన్లలో మాత్రమే పనిచేస్తుంది.


* వాట్సాప్ వీడియో లేదా వాయిస్ కాల్​లో చేరే వ్యక్తుల సంఖ్యపై పరిమితి ఉంటుందా?

వాట్సాప్​ గ్రూప్​ కాల్‌లో ఉండగల వ్యక్తుల సంఖ్యలో ఎటువంటి మార్పు లేదు. అయితే ఒకేసారి ఎనిమిది మంది సభ్యులు మాత్రమే వీడియో కాల్‌లో చేరే అవకాశం ఉంటుంది.

First published:

Tags: Whatsapp

ఉత్తమ కథలు