హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

WhatsApp: వాట్సాప్‌లో అవతార్ ఫీచర్.. స్టిక్కర్స్‌గా సెండ్ చేయడంతో పాటు ప్రొఫైల్ పిక్‌గా సెట్ చేసుకునే ఆప్షన్

WhatsApp: వాట్సాప్‌లో అవతార్ ఫీచర్.. స్టిక్కర్స్‌గా సెండ్ చేయడంతో పాటు ప్రొఫైల్ పిక్‌గా సెట్ చేసుకునే ఆప్షన్

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

WhatsApp Users: వాట్సాప్ త్వరలోనే 'అవతార్ (Avatar)' అనే మరొక అద్భుతమైన ఫీచర్‌ను తీసుకురానుంది. ఈ ఫీచర్‌తో యూజర్లు తాము నిజజీవితంలో ఎలాంటి స్కిన్ టోన్, హెయిర్ స్టయిల్, ఔట్‌ఫిట్స్, యాక్సెసరీలు కలిగి ఉంటారో ఆ లక్షణాలతో ఒక అవతార్ క్రియేట్ చేసుకోవచ్చు.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Delhi, India

దిగ్గజ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (WhatsApp) తన యూజర్ల ఎక్స్‌పీరియన్స్ మెరుగు పరిచేందుకు నిత్యం కొత్త ఫీచర్లను తీసుకొస్తూనే ఉంది. ఈ మెసేజింగ్ యాప్ ఇప్పటికే అనేక ఆకర్షణీయమైన ఫీచర్లను ప్రకటించింది. ఈ కంపెనీ త్వరలోనే 'అవతార్ (Avatar)' అనే మరొక అద్భుతమైన ఫీచర్‌ను తీసుకురానుంది. ఈ ఫీచర్‌తో యూజర్లు తాము నిజజీవితంలో ఎలాంటి స్కిన్ టోన్, హెయిర్ స్టయిల్, ఔట్‌ఫిట్స్, యాక్సెసరీలు కలిగి ఉంటారో ఆ లక్షణాలతో ఒక అవతార్ క్రియేట్ చేసుకోవచ్చు. యూజర్లు తమని ప్రతిబింబించేలా ఒక త్రీడీ అవతార్ క్రియేట్ చేసుకొని దానిని స్టిక్కర్‌ (Sticker)గా సెండ్ చేసుకోవచ్చు. అలానే ప్రొఫైల్ పిక్‌గా సెట్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ స్టిక్కర్ లవర్స్‌కి బాగా నచ్చుతుంది. దీని గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

అప్పుడప్పుడు వాట్సాప్ యూజర్లు తమను పోలిన స్టిక్కర్స్‌ను ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌కి పంపించాలని అనుకుంటారు. కానీ ప్రస్తుతానికి ఆ సదుపాయం వాట్సాప్‌లో రాలేదు. అయితే త్వరలోనే ఆ ఫెసిలిటీ అందుబాటులోకి వస్తుందని వాట్సాప్ బీటా ఇన్ఫో (WABetaInfo) తెలిపింది. ప్రస్తుతానికి ఈ ఫీచర్ ఇంకా డెవలప్‌మెంట్ స్టేజ్‌లోనే ఉంది. కాబట్టి ఇది ఎప్పుడు రిలీజ్ అవుతుందనే దానిపై క్లారిటీ లేదు.

ఈ ఫీచర్‌తో మీరు మీ రూపాన్ని బట్టి ఒక అవతార్‌ క్రియేట్ చేసుకుని దానిని వాట్సాప్‌లో స్టిక్కర్‌గా ఉపయోగించవచ్చు. వాట్సాప్ మీ అవతార్‌తో ఏకంగా ఒక స్టిక్కర్ ప్యాక్‌నే క్రియేట్ చేసి ఇస్తుంది. ఇందులో మీ అవతార్‌ ఏడ్చినట్లు, నవ్వినట్లు, బుంగమూతి పెట్టుకున్నట్లు, ఇంకా రకరకాల ఎక్స్‌ప్రెషన్స్‌తో స్టిక్కర్స్ ఉంటాయని సమాచారం. వాట్సాప్ సెట్టింగ్స్‌లోనే అవతార్‌ను మీకు నచ్చినట్లు క్రియేట్ చేసుకోవచ్చు. అవతార్‌ను కాన్ఫిగర్/ క్రియేట్ చేశాక వాట్సాప్ మీరు ఎంచుకున్న కాన్ఫిగరేషన్ ఆధారంగా పర్సనాలైజ్డ్ స్టిక్కర్ ప్యాక్‌ను ఆటోమేటిక్‌గా క్రియేట్ చేస్తుంది.

* ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఆల్రెడీ రిలీజ్

ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ యూజర్లకు ఈ అవతార్ ఫీచర్ ఎలా పనిచేస్తుందో ఇప్పటికే తెలిసే ఉంటుంది. ఎందుకంటే మెగా కంపెనీ ఈ ఫీచర్‌ను ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్లకు చాలా రోజుల క్రితమే రిలీజ్ చేసింది. ఫేస్‌బుక్ యూజర్లు మొబైల్ యాప్‌లో తమ ప్రొఫైల్ ఐకాన్‌పై క్లిక్ చేసి షార్ట్‌కట్స్‌లో 'అవతార్స్' అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడం ద్వారా తమలాంటి ఒక అవతార్ క్రియేట్ చేసుకోవచ్చు. దాన్ని ప్రొఫైల్ పిక్‌గా సెట్ చేసుకోవడంతో పాటు కామెంట్స్‌లో స్టిక్కర్‌గా పోస్ట్ చేయొచ్చు. అయితే వాట్సాప్‌లో మాత్రం మెసేజ్‌ల్లోనూ అవతార్‌ను స్టిక్కర్‌గా సెండ్ చేసుకోవడం వీలవుతుందని వాట్సాప్ బీటా ఇన్ఫో తెలిపింది. మరింత భవిష్యత్తులో ఈ అవతార్‌ను ప్రొఫైల్ పిక్‌గా, వీడియో కాల్‌ల సమయంలో ఒక మాస్క్‌గా కూడా ఉపయోగించేలా వాట్సాప్ ఒక ఫీచర్ తీసుకురానుంది. ఈ వీడియో కాల్స్ అవతార్ ఫీచర్ పనితీరు గురించి WABetaInfo కొంతకాలం క్రితమే వివరించింది.

Published by:Paresh Inamdar
First published:

Tags: Smart phones, Whatsapp

ఉత్తమ కథలు