WhatsApp New Feature: వాట్సాప్ సూపర్ ఫీచర్.. ఫోన్ లేకపోయినా మేసేజ్ చేసే ఛాన్స్.. ఎలాగంటే

ప్రతీకాత్మక చిత్రం

మన ఫోన్ ఆన్‌లో ఉంటేనే.. వాట్సాప్ ద్వారా మేసేజ్ పంపించేందుకు, రిసీవ్ చేసుకునేందుకు ఛాన్స్ ఉంటుంది. అయితే.. ఫోన్ ఆన్‌లో లేకపోయినా వాట్సాప్ ద్వారా మేసేజ్ చేసే కొత్త ఫీచర్ ను వాట్సాప్ తీసుకురానుంది. వివరాలు ఇలా ఉన్నాయి.

  • Share this:
ఈ రోజుల్లో వాట్సాప్‌ను వినియోగించని వారుండరంటే అతిశయోక్తి కాదేమో. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరికి ఈ మెసేజింగ్ యాప్ సుపరిచితమే. ఇంటర్నెట్ ఉంటే యాప్ నుంచి సులభంగా మెసేజ్‌లు పంపుకోవచ్చు. సాధారణంగా మన ఫోన్ ఆన్‌లో ఉంటేనే.. వాట్సాప్ ద్వారా మేసేజ్ సెండ్ చేసేందుకు, రిసీవ్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. అయితే ఫోన్ ఆన్‌లో లేకపోయినా వాట్సాప్ ద్వారా మేసేజ్ చేసే ఫీచర్‌ను సంస్థ డెవలప్ చేసింది. ప్రస్తుతం బీటా టెస్టింగ్‌లో ఉన్న ఈ ఫీచర్‌ను త్వరలోనే అప్‌డేట్ ద్వారా యూజర్లకు విడుదల చేయనుంది. ఇప్పటి వరకు ఫోన్ వాట్సాప్‌ను కంప్యూటర్, ఇతర వెబ్ యాప్స్‌కు లింక్ చేసుకొని మేసేజింగ్ చేసే అవకాశముంది. కానీ ఈ సరికొత్త ఫీచర్‌తో మీ ఫోన్ బ్యాటరీ అయిపోయినా మెసేజ్‌లు స్వీకరించవచ్చు, పంపుకోవచ్చని వాట్సాప్ తెలిపింది. మొత్తం నాలుగు డివైజ్‌లకు కనెక్ట్ చేసుకొని ఈ ఫీచర్‌ను వాడుకోవచ్చని స్పష్టం చేసింది. ప్రస్తుతం టెస్టింగ్ కోసం బీటా వెర్షన్‌లో కొంత మంది యూజర్లకు ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. అనంతరం పనితీరును మెరుగుపరిచి, మరిన్ని ఫీచర్లను జోడించి త్వరలోనే ప్రతి ఒక్కరికీ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది.
WhatsApp Ban: వాట్సాప్ వినియోగదారులకు షాక్.. వారి ఖాతాలు బ్యాన్ చేస్తూ నిర్ణయం.. ఎందుకంటే..
Best Budget Smartphones: రూ. 10 వేలలోపే ఈ ప్రముఖ కంపెనీల స్మార్ట్ ఫోన్లు.. ఓ లుక్కేయండి

ఇతర మేసేజింగ్ యాప్స్ ఇప్పటికే ఇలాంటి ఫీచర్‌ను అందిస్తున్నాయి. సైన్ అప్ కోసం మాత్రమే ఫోన్ ఉపయోగించి, మెసేజ్‌లను ఇతర కనెక్టెడ్ డివైజ్‌ల నుంచి ఆపరేట్ చేసుకునే వీలు ఉంది. ఇలాంటి ఫీచర్‌ను చాలా కాలం నుంచి వాట్సాప్ వినియోదారులు ఆశిస్తున్నారు. రెండు బిలియన్ల మంది దీనిపై రిపోర్ట్ చేశారు. ప్రస్తుత వాట్సాప్ వెర్షన్ స్మార్ట్ ఫోన్ యాప్‌ను ప్రైమరీ డివైజ్‌గా ఉపయోగిస్తుంది. ఫోన్ వినియోగదారులందరి డేటాకు నిజమైన సోర్స్‌గా పనిచేస్తుంది.

మెసేజ్‌లను ఎండ్ టూ ఎండ్ ఎన్‌క్రిప్ట్ చేయగల ఏకైక డివైజ్ ఇదేనని కంపెనీ తెలిపింది. వాట్సాప్ వెబ్ తరచూ డిస్‌కనెక్ట్ అవుతుంది. ఈ వ్యవస్థ చాలా మంది రెగ్యులర్ వినియోగదారులకు లోపాలను సూచిస్తుంది. మరో డివైజ్‌లో వాట్సాప్‌ను లోడ్ చేస్తే వాట్సాప్ వెబ్ విండో డిస్‌కనెక్ట్ అవుతుంది. "ఈ సరికొత్త వాట్సాప్ మల్టీ డివైజ్ ఆర్కిటెక్చర్ ఈ అడ్డంకులను తొలగిస్తుంది. ఇకపై స్మార్ట్ ఫోన్ ట్రూత్ సోర్స్‌గా ఉండాల్సిన అవసరం లేదు. యూజర్ డేటాను సజావుగా, సురక్షితంగా సింక్రనైజ్ చేసి గోప్యంగా ఉంచుతుంది" అని కంపెనీ స్పష్టం చేసింది.
Published by:Nikhil Kumar S
First published: