మెటా కంపెనీకి చెందిన ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్.. సరికొత్త ఫీచర్లతో ఎప్పటికప్పుడు వినియోగదారులను ఆకర్షిస్తోంది. తాజాగా వాట్సాప్ అకౌంట్‌ను సెకండరీ డివైజ్‌లలో వినియోగించే ఫీచర్‌పై పని చేస్తున్నట్లు సమాచారం. వాట్సాప్ ఇటీవలే వెబ్/డెస్క్‌టాప్ యూజర్లకు సరికొత్త అనుభూతిని అందించేందుకు అప్డేట్ చేసింది. కొన్ని బగ్స్‌ను కూడా సరిదిద్ధింది. వాట్సాప్ మల్టీ డివైజ్ అప్డేట్ అందించిన తర్వాత.. ఇప్పుడు మరి కొన్ని కొత్త ఫీచర్లను అందించేందుకు కృషి చేస్తోంది. వాట్సాప్ ఫీచర్ ట్రాకర్ WABetaInfo ప్రకారం.. ఫోన్లలో మల్టీ డివైజ్ ఫంక్షనాలిటీని వాట్సాప్ తీసుకురానుంది. దీని సాయంతో ఒకే అకౌంట్‌ను వేర్వేరు డివైజ్‌లలో వినియోగించే అవకాశం ఉంటుంది.
వాట్సాప్ అప్డేటెడ్ వెర్షన్లో కొత్త సెక్షన్ ‘రిజిస్టెర్ డివైజ్ యాజ్ కంపానియన్’ ఉంటుంది. దీని ద్వారా మరో కొత్త డివైజ్‌లో యూజర్ తన వాట్సాప్‌ను వినియోగించే అవకాశం ఉంటుంది. QR కోడ్‌ని స్కాన్ చేయడానికి మాత్రం ప్రైమరీ ఫోన్‌ను వినియోగించాల్సి ఉంటుంది. WABetaInfo ప్రకారం.. ఈ అప్డేట్ ద్వారా చివరికి Android టాబ్లెట్‌ను సెకండరీ డివైజ్‌గా మార్చి వినియోగించుకోవచ్చు. Google Play బీటా ప్రోగ్రామ్ ద్వారా.. WhatsApp ఒక కొత్త అప్‌గ్రేడ్‌ను విడుదల చేస్తూ, యాప్ వెర్షన్‌ను 2.22.10.13కి పెంచుతోంది. ఫ్యూచర్ అప్‌గ్రేడ్ కోసం వాట్సాప్ అకౌంట్‌కు కొత్త మొబైల్ డివైజ్‌లను అటాచ్ చేసే సామర్థ్యంపై పని చేస్తోందని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.
* అప్డేట్స్ ఇవే..
కొత్తగా వచ్చే అప్టేడ్ ద్వారా కొత్త ఫోన్లో వాట్సాప్ ఓపన్ చేసిన తర్వాత ప్రైమరీ డివైజ్‌లోని మెసేజ్‌లు, డేటా ఆటోమేటిక్‌గా సింక్రనైజ్ అవుతుంది. ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్ట్ సదుపాయం కూడా ఉంటుంది. మల్టీ-డివైస్ లింక్ ఫంక్షనాలిటీ ద్వారా మరొక ఫోన్ లేదా టాబ్లెట్‌లో WhatsApp అకౌంట్‌ను యాక్సెస్ చేయడానికి SIM కార్డ్ అవసరం లేదు. 2021 నవంబర్‌లో రూపొందించిన 'లింక్డ్ డివైజెస్ ఫీచర్' ఇప్పటికే మెటా మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్‌లో అనేక డివైజ్‌లలో లాగిన్ చేయడానికి వినియోగదారులకు అనుమతిస్తోంది.
* మరికొన్ని ఫీచర్లు..
WhatsApp అనేక కొత్త ఫీచర్లను విడుదల చేసింది. వాయిస్ కాలింగ్ ఫీచర్ ఆ జాబితాలోని ప్రైమరీ ఫీచర్. WhatsApp వాయిస్ కాల్లో ఇప్పుడు గరిష్టంగా 32 మంది వ్యక్తులను యాడ్ చేయవచ్చు. ఈ సంఖ్య ఇంతకుముందు ఎనిమిదిగా ఉండేది. కరోనా సమయంలో వాట్సాప్ గ్రూప్ వాయిస్, వీడియో కాలింగ్ లిమిట్‌ను ఎనిమిదికి పెంచింది. ఫోన్ కాల్స్ మాత్రమే 32 మంది వ్యక్తులకు మద్దతునిస్తాయి.
అదనంగా కంపెనీలకు అదనపు ప్రయోజనాలను అందించడానికి బిజినెస్ అకౌంట్ సబ్స్రిప్షన్ నమూనాపై వాట్సాప్ పని చేస్తోంది.
Published by:Madhu Kota
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.