HOME »NEWS »TECHNOLOGY »whatsapp users cannot move their personal chats to signal follow these steps to transfer groups ss

Signal App: వాట్సప్ డిలిట్ చేసి 'సిగ్నల్' డౌన్‌లోడ్ చేశారా? ఈ విషయం తెలుసా?

Signal App: వాట్సప్ డిలిట్ చేసి 'సిగ్నల్' డౌన్‌లోడ్ చేశారా? ఈ విషయం తెలుసా?
Signal App: వాట్సప్ డిలిట్ చేసి 'సిగ్నల్' డౌన్‌లోడ్ చేశారా? ఈ విషయం తెలుసా? (ప్రతీకాత్మక చిత్రం)

Signal App | వాట్సప్ డిలిట్ చేసి ఇతర మెసెంజర్ యాప్స్ డౌన్‌లోడ్ చేస్తున్నారా? టెలిగ్రామ్, సిగ్నల్ లాంటి యాప్స్ వాడుతున్నారా? అయితే ఈ విషయం తెలుసుకోండి.

  • Share this:
వాట్సప్ ప్రైవసీ పాలసీ అప్‌డేట్ చేయడం పెద్ద దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వాట్సప్ వివరణ కూడా ఇచ్చుకోవాల్సి వచ్చింది. కానీ వాట్సప్‌కు ప్రత్యామ్నాయంగా ఇతర యాప్స్ ఉపయోగించాలని యూజర్లు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. మరి వాట్సప్‌కు ప్రత్యామ్నాయంగా ఉన్న 5 యాప్స్ గురించి తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి. వాట్సప్ ప్రత్యామ్నాయ యాప్స్‌లో టెలిగ్రామ్, సిగ్నల్ యాప్స్ బాగా పాపులర్ అవుతున్నాయి. జనవరి మొదటి వారంలో మంత్లీ యాక్టీవ్ యూజర్ల సంఖ్య 50 కోట్లు దాటిందని, 72 గంటల్లోనే 2.5 కోట్ల మంది యూజర్లు కొత్తగా చేరారని టెలిగ్రామ్ ప్రకటించింది. ఇక సిగ్నల్ యాప్‌ను 75 లక్షల మంది కొత్తగా డౌన్‌లోడ్ చేసుకున్నారు. అయితే యాప్స్ అయితే మారుస్తాం కానీ... అప్పటికే వాట్సప్‌లో ఉన్న డేటా పరిస్థితి ఏంటన్న సందేహాలు యూజర్లలో ఉన్నాయి.

Jio 28 days plans: 28 రోజుల వేలిడిటీ కావాలా? జియో అందిస్తున్న బెస్ట్ ప్లాన్స్ ఇవే...



Paytm Instant Personal Loan: పేటీఎం యూజర్లకు అదిరిపోయే ఆఫర్... 2 నిమిషాల్లో రూ.2,00,000 లోన్

వాట్సప్ యాప్‌ను యూజర్లు చాలాకాలంగా ఉపయోగిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా బాగా పాపులర్ అయిన ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సప్. కాబట్టి వాట్సప్ నుంచి మరో యాప్‌కు మారడం అంత సులువైన పనికాదు. ముఖ్యమైన డేటా వాట్సప్‌లో ఉంటుంది. ఛాట్స్, ఫోటోలు, వీడియోలు, ఇతర డాక్యుమెంట్స్ లాంటివి వాట్సప్‌లో స్టోర్ అయి ఉన్నాయి. మీరు వాట్సప్ నుంచి సిగ్నల్‌కి మారితే మీ వ్యక్తిగత ఛాట్స్ అన్నీ వదులుకోవాల్సిందే. అయితే గ్రూప్ ఛాట్స్ మాత్రం వాట్సప్ నుంచి సిగ్నల్‌కు ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు. ఈ ప్రాసెస్ ఎలా చేయాలో ట్విట్టర్‌లో వెల్లడించింది సిగ్నల్. మరి వాట్సప్‌లోని మీ గ్రూప్స్‌ని సిగ్నల్ యాప్‌లోకి ఎలా మార్చాలో తెలుసుకోండి.

New Smartphones in 2021: వివో వై12ఎస్ వచ్చేసింది... 2021లో రిలీజైన స్మార్ట్‌ఫోన్స్ ఇవే

Amazon Prime Video: ఎయిర్‌టెల్ యూజర్లు రూ.89 చెల్లిస్తే చాలు... అమెజాన్ ప్రైమ్ వీడియో సబ్‌స్క్రిప్షన్


ముందుగా సిగ్నల్ యాప్ ఓపెన్ చేయండి.
టాప్ రైట్ కార్నర్‌లో త్రీడాట్స్ క్లిక్ చేసి కొత్త గ్రూప్ క్రియేట్ చేయండి.
మీ గ్రూప్‌కు పేరు ఇవ్వండి. కాంటాక్ట్స్‌ని యాడ్ చేయండి.
ఆ తర్వాత గ్రూప్ ఛాట్ బాక్స్ ఓపెన్ చేయండి.
టాప్ రైట్ కార్నర్‌లో త్రీడాట్స్ క్లిక్ చేయండి.
అందులో సెట్టింగ్స్ ఓపెన్ చేయండి.
Group link పైన క్లిక్ చేయండి.
గ్రూప్ లింక్ ఆన్ చేయండి.
ఆ తర్వాత Share పైన క్లిక్ చేయండి.
వాట్సప్ గ్రూప్ ఛాట్‌లో ఆ లింక్ పేస్ట్ చేయండి.
గ్రూప్‌లో ఉన్నవారు ఎవరైనా ఆ లింక్ క్లిక్ చేస్తే సిగ్నల్‌లో క్రియేట్ చేసిన గ్రూప్‌లో యాడ్ అవుతారు.
వాట్సప్‌లో మాత్రమే కాదు ఇతర యాప్స్‌లో కూడా ఈ లింక్ షేర్ చేసి ఎవరినైనా గ్రూప్‌లోకి ఇన్వైట్ చేయొచ్చు.
Published by:Santhosh Kumar S
First published:January 13, 2021, 6:37 pm IST