WHATSAPP USERS CAN USE THEIR APP TELUGU LANGUAGE KNOW HOW SS
WhatsApp in Telugu: తెలుగులో వాట్సప్... సెట్టింగ్స్ మార్చండి ఇలా
WhatsApp in Telugu: తెలుగులో వాట్సప్... సెట్టింగ్స్ మార్చండి ఇలా
(ప్రతీకాత్మక చిత్రం)
WhatsApp in Telugu | మీ స్మార్ట్‌ఫోన్‌లో వాట్సప్ యాప్‌ను తెలుగులో ఉపయోగించుకోవచ్చు. వాట్సప్ (WhatsApp) మాత్రమే కాదు... ఇతర యాప్స్ కూడా తెలుగులో వాడుకోవచ్చు. సెట్టింగ్స్ ఎలా మార్చాలో తెలుసుకోండి.
స్మార్ట్‌ఫోన్ ఉపయోగించేవారంతా వాట్సప్ (WhatsApp) ఉపయోగిస్తుంటారు. రోజులో కనీసం ఒక్కసారైనా వాట్సప్ చూడనివారుండరు. మరి మీరు కూడా రోజూ వాట్సప్ ఉపయోగిస్తున్నారా? వాట్సప్‌ను ఇంగ్లీష్‌లో కాకుండా తెలుగులో ఉపయోగించే అవకాశం కూడా ఉంది. తెలుగులో మాత్రమే కాదు... మీకు నచ్చిన భాషలో వాట్సప్‌ని ఉపయోగించొచ్చు. వాట్సప్ మాత్రమే కాదు... ఏ యాప్‌నైనా తెలుగులో ఉపయోగించడానికి ఈ సెట్టింగ్స్ ఉపయోగపడతాయి. తమకు నచ్చిన భాషను సెలెక్ట్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నాయి స్మార్ట్‌ఫోన్ కంపెనీలు. ఇండియాలో భారతీయ భాషలన్నింటినీ ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లు సపోర్ట్ చేస్తాయి. KaiOS ఫీచర్ ఫోన్లలో కూడా లాంగ్వేజ్ మార్చుకునే ఆప్షన్ ఉంది.
ఆండ్రాయిడ్ యూజర్స్ సెట్టింగ్స్ ఇలా మార్చండి
Step 1- ముందుగా మీ స్మార్ట్‌ఫోన్ ఓపెన్ చేయండి.
Step 2- సెర్చ్ బార్లో language & input టైప్ చేయండి.
Step 3- ఆ తర్వాత Language ఓపెన్ చేయండి.
Step 4- తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ లాంటి భాషలన్నీ ఉంటాయి.
Step 5- అందులో తెలుగు సెలెక్ట్ చేయండి.
Step 6- మీ స్మార్ట్‌ఫోన్‌లోని సెట్టింగ్స్ తెలుగులోకి మారిపోతాయి.
Step 1- KaiOS ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్న జియో, నోకియా యూజర్లు సెట్టింగ్స్ ఓపెన్ చేయాలి.
Step 2- personalisation పైన క్లిక్ చేయాలి.
Step 3- ఆ తర్వాత language సెలెక్ట్ చేయాలి.
Step 4- అందులో తెలుగు సెలెక్ట్ చేస్తే చాలు.
యూజర్లు ఇక్కడ ఓ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. స్మార్ట్‌ఫోన్‌లో లాంగ్వేజ్ సెట్టింగ్స్ మారిస్తే అన్ని యాప్స్‌కి భాష మారిపోతుంది. వాట్సప్ ఓపెన్ చేస్తే అందులో ఆప్షన్స్ కూడా తెలుగులో కనిపిస్తాయి. మీరు రీజనల్ కీబోర్డ్ ఉపయోగించాలనుకుంటే గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ యాప్ స్టోర్ నుంచి జీబోర్డ్ డౌన్లోడ్ చేయొచ్చు. చాలా వరకు స్మార్ట్ఫోన్లలో జీబోర్డ్ డిఫాల్ట్‌గానే ఉంటుంది. జీబోర్డ్ లేకపోతే డౌన్లోడ్ చేయాలి. జీబోర్డ్ ద్వారా మీకు నచ్చిన భాషలో టైప్ చేసే అవకాశం ఉంటుంది. జీబోర్డ్ డౌన్లోడ్ చేసిన తర్వాత సెట్టింగ్స్ ఎలా మార్చాలో తెలుసుకోండి.
Step 1- ఆండ్రాయిడ్ యూజర్స్ సెట్టింగ్స్ ఇలా మార్చండి.
Step 2- సెర్చ్ బార్లో language & input టైప్ చేయండి.
Step 3- Input Methods లో Manage Keyboards ఓపెన్ చేయండి.
Step 4- అందులో జీబోర్డ్ ఎనేబుల్ చేయండి.
Step 5- ఆ తర్వాత జీబోర్డ్ సెట్టింగ్స్ ఓపెన్ చేయండి.
Step 6- Languages ఓపెన్ చేయండి.
Step 7- ADD Keyboad పైన క్లిక్ చేసి తెలుగు సెలెక్ట్ చేయండి.
వాట్సప్‌తో పాటు ఇతర ఛాటింగ్ యాప్స్, మెయిల్స్‌లో తెలుగులో టైప్ చేయడానికి జీబోర్డ్ ఉపయోగపడుతుంది. జీబోర్డ్‌లో తెలుగుతో పాటు హిందీ, సంస్కృతం, కన్నడ, తమిళ్, బెంగాళీ, గుజరాతీ, మరాఠీ లాంటి భారతీయ భాషలన్నీ ఉంటాయి.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.