• HOME
  • »
  • NEWS
  • »
  • TECHNOLOGY
  • »
  • WHATSAPP USERS CAN OPEN THEIR CHATS ON FACEBOOK MESSENGER SOON KNOW HOW IT WORKS SS GH

WhatsApp: ఫేస్‌బుక్‌ మెసెంజర్‌లో వాట్సప్‌ వాడుకోవచ్చు... ఎలాగంటే

WhatsApp: ఫేస్‌బుక్‌ మెసెంజర్‌లో వాట్సప్‌ వాడుకోవచ్చు... ఎలాగంటే

WhatsApp: ఫేస్‌బుక్‌ మెసెంజర్‌లో వాట్సప్‌ వాడుకోవచ్చు... ఎలాగంటే (ప్రతీకాత్మక చిత్రం)

WhatsApp on Facebook Messenger | వాట్సప్ యూజర్లకు శుభవార్త. త్వరలో వాట్సప్‌ను ఫేస్‌బుక్ మెసెంజర్ యాప్‌లో ఓపెన్ చేయొచ్చు. ఈ ఫీచర్ గురించి తెలుసుకోండి.

  • Share this:
ఫేస్‌బుక్‌ మెసెంజర్‌ను, మీ మొబైల్‌లోని మెసేజెస్‌ యాప్‌ను కలిపేయొచ్చని తెలుసు కదా. ఇప్పుడు అదే తరహాలో వాట్సాప్‌, ఫేస్‌బుక్‌ మెసెంజర్‌ని ఫేస్‌బుక్‌ కలిపేయబోతోందా? అవుననే అంటున్నారు టెక్‌ నిపుణులు. త్వరలో మెసెంజర్‌లో వాట్సాప్‌ ఛాట్స్‌ కనిపించబోతున్నాయట. ఇప్పటికే కొంతమంది బీటా యూజర్లకు ప్రయోగాత్మకంగా ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారని తెలుస్తోంది. అయితే ఫేస్‌బుక్‌ మెసెంజర్‌, వాట్సాప్‌ను కలిపేయడం యూజర్‌ ఆప్షనల్ అని చెబుతున్నారు. అంటే యూజర్‌ ఓకే అనుకుని, యాక్సెప్ట్‌ చేస్తేనే ఇలా రెండూ ఒకదాంట్లో వస్తాయట.

బీటా యూజర్లు వాడి చెబుతున్నదాని ప్రకారం అయితే... ఫేస్‌బుక్‌ మెసెంజర్‌ను ఓపెన్‌ చేసినప్పుడు... ‘ఇందులో మీరు వాట్సాప్‌ మెసేజ్‌లు కూడా చూడాలనుకుంటున్నారా’ అని అడుగుతుందట. దానికి యూజర్‌ ఓకే చెబితే... ఇంటిగ్రేషన్‌ మొదలవుతుంది. ఆ తర్వాత వాట్సాప్‌ ఛాట్స్‌ను మెసెంజర్‌లో యాక్సెస్‌ చేయొచ్చు. అయితే అలా అని వాట్సాప్‌ మెసేజ్‌లు అన్నింటినీ ఫేస్‌బుక్‌ మెసెంజర్‌లో మూవ్‌ చేస్తోంది అనుకోనక్కర్లేదని టెక్‌ నిపుణులు చెబుతున్నారు. ఎండ్‌ టు ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌ సౌకర్యం వాట్సాప్‌లో ఉండటం వల్ల అందులోని మెసేజ్‌లు ఫేస్‌బుక్‌ మెసెంజర్‌లో కనిపిస్తాయి కానీ, వాటిని మెసెంజర్‌లోకి డైరెక్ట్‌గా మూవ్‌ చేయరట. కాబట్టి ప్రైవసీకి వచ్చిన ఇబ్బందేం లేదు అని కూడా అంటున్నారు.

Credit Card Data Leak: అక్కడ షాపింగ్ చేసినవారికి షాక్... 10 లక్షల మంది క్రెడిట్ కార్డ్ డేటా లీక్

Oppo A54: ఇండియాలో రిలీజైన ఒప్పో ఏ54... ధర ఎంతంటే

వాట్సాప్‌, మెసెంజర్‌ను కలిపేస్తున్నట్లు ఇప్పటివరకు అధికారికంగా ఫేస్‌బుక్‌ నుండి ఎలాంటి సమాచారం లేదు. అయితే టెక్‌ టిప్‌స్టర్‌లు మాత్రం సీక్రెట్‌ కోడ్స్‌లో ఇది ఉందని చెబుతున్నారు. ఇప్పటికే ఇన్‌స్టాగ్రామ్‌ మెసెంజర్‌, ఫేస్‌బుక్‌ మెసెంజర్‌ను కలిపి ఒకటిగా చేసింది ఫేస్‌బుక్‌. ఇప్పుడు వాట్సాప్‌ కూడా అందులోకి వెళ్లిపోతోంది అని అంటున్నారు. ఒకవేళ ఇదే జరిగితే... భవిష్యత్తులో మెసెంజర్‌, వాట్సాప్‌లో ఏదో ఒకటే ఉంటుంది. ఒకవేళ ఇది జరగకపోతే వెబ్‌ వాట్సాప్‌ వాడేవారికి సౌకర్యంగా ఉండటానికి, ఫేస్‌బుక్‌ మెసెంజర్‌ను వేదికగా చేసుకుంటున్నారా? అనే స్పష్టత వాట్సాప్‌ నుండి రావాల్సి ఉంది.

WhatsApp: వాట్సప్ వాడేవాళ్లు అస్సలు ఈ తప్పులు చేయొద్దు

Samsung Galaxy A32: ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ.3,000 తగ్గింది... రూ.1,500 డిస్కౌంట్ కూడా

వాట్సాప్‌ ప్రైవసీ మీద ఆరోపణలు వస్తున్న సమయంలో, అందులోనూ కొత్త ప్రైవసీ పాలసీని తీసుకురావడానికి వాట్సాప్‌ ఇచ్చిన గడువు (మే 15) దగ్గర పడుతున్న సమయంలో ఇలాంటి కొత్త ఫీచర్‌ ఒకటి బయటకు రావడం విశేషం. వాట్సాప్‌ పోటీ యాప్‌లకు డౌన్‌లోడ్‌లు, వినియోగం పెరుగుతోందంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో వాట్సాప్‌ ఇలా వినియోగదారులను తమ వద్దే ఉంచుకోవడానికి ఈ కొత్త ఫీచర్లు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తోంది.
Published by:Santhosh Kumar S
First published:

అగ్ర కథనాలు