Home /News /technology /

WHATSAPP USERS CAN NOW JOIN ONGOING CALLS RIGHT STRAIGHT FROM THEIR GROUP CHATS MK GH

Whatsapp: వాట్సాప్‌ కొత్త ఫీచర్.. గ్రూప్‌ చాట్స్‌ నుంచి నేరుగా కాల్స్‌లో జాయిన్‌ అయ్యే అవకాశం

WhatsApp Feature
(ప్రతీకాత్మక చిత్రం)

WhatsApp Feature (ప్రతీకాత్మక చిత్రం)

కాల్స్‌కు సంబందించి మరిన్ని అధునాతన ఫీచర్లు చేర్చినట్టు వాట్సాప్‌ ప్రకటించింది. ఆన్‌ గోయింగ్‌ కాల్‌లో నేరుగా యాడ్‌ అయ్యేందుకు ఇప్పుడు కొత్తగా రూపొందించిన ఫీచర్‌ వెసులుబాటు కల్పిస్తుంది.

ఎప్పటికప్పుడు ఫీచర్లను ఆసక్తికరంగా మారుస్తూ యూజర్లను ఆకట్టుకుంటోంది వాట్సాప్‌. తాజాగా తమ యూజర్ల కోసం కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. కాల్స్‌కు సంబందించి మరిన్ని అధునాతన ఫీచర్లు చేర్చినట్టు వాట్సాప్‌ ప్రకటించింది. ఆన్‌ గోయింగ్‌ కాల్‌లో నేరుగా యాడ్‌ అయ్యేందుకు ఇప్పుడు కొత్తగా రూపొందించిన ఫీచర్‌ వెసులుబాటు కల్పిస్తుంది. గ్రూప్‌ చాట్‌ విండో ద్వారా ఆ కాల్‌లో యూజర్లు జాయిన్‌ కావచ్చు. గ్రూప్‌ చాట్‌ ఐకాన్‌లో ఇప్పుడు ఒక ప్రత్యేకమైన బటన్‌ను యూజర్లు చూడవచ్చు.

‘గ్రూప్‌ చాట్‌ ద్వారా కాల్‌లోకి కనెక్ట్‌ అయ్యే ఫీచర్‌ను నేటి నుంచి అందిస్తున్నాం. చాట్‌ ట్యాబ్‌ ద్వారా ఇప్పుడు నేరుగా గ్రూప్‌ కాల్స్‌లో జాయిన్‌ అవ్వచ్చు. గ్రూప్‌ కాల్స్‌కు ఆదరణ పెరుగుతున్న క్రమంలో జాయినబుల్‌ కాల్స్‌ ద్వారా వాట్సాప్‌ యూజర్స్‌కు కొత్త అనుభూతి అందుతుంది. ఎంతో సులభంగా కుటుంబ సభ్యులు, స్నేహితుల గ్రూప్స్‌ తో కనెక్ట్ కావచ్చ’ని వాట్సాప్‌ ప్రకటించింది.

గ్రూప్‌ కాల్‌లో ఎవరైనా మిస్‌ అయితే కాల్‌ డిస్‌కనెక్ట్ చేసి మళ్లీ కాల్‌ చేసే అవసరాన్ని ఈ కొత్త ఫీచర్‌ తొలగిస్తుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజర్స్‌ కాల్‌లో జాయిన్‌ కావచ్చు. కాల్‌లో మాట్లాడుతున్న వాళ్ల పేర్లు కాకుండా గ్రూప్‌ పేరును నోటిఫికేషన్‌ చూపుతుంది. అయితే గ్రూప్‌లో సభ్యులుగా ఉన్నవారు మాత్రమే కాల్‌లో జాయిన్‌ కాగలరు. యాప్‌ ఒపెన్‌ చేసిన వెంటనే చాట్‌ లిస్టును కాల్‌ చూపిస్తుంది కాబట్టి ఏ గ్రూపులో కాల్స్‌ నడుస్తున్నాయో చూసి యూజర్స్‌ అందులో జాయిన్‌ అవచ్చు. దీని కోసం ఒక ప్రత్యేకమైన రింగ్‌ టోన్‌ను వాట్సాప్‌ కేటాయించింది. ఇది చాలా హాయిగా మెసేజ్‌ పంపించడం, అందుకోవడం తరహాలో ఉంటుంది.

కాల్‌ స్టార్ట్‌ అయిన తర్వాత కూడా గ్రూప్‌ కాల్‌లో జాయిన్‌ అయ్యే వెసులుబాటును గతంలోనే వాట్సాప్‌ అందించింది. ఇప్పుడు కాల్‌ ఇన్ఫో స్క్రీన్‌ను వాట్సాప్‌ ప్రవేశపెట్టింది. దీని ద్వారా కాల్‌లో ఇప్పటికే ఎవరెవరు ఉన్నారు? ఎవరెవరిని ఆహ్వానించారు, ఇంకా ఎవరు జాయిన్‌ కాలేదు వంటివన్నీ ఇందులో తెలుస్తుంది. ఒకవేళ మీరు ఇగ్నోర్‌ను ట్యాప్‌ చేస్తే వాట్సాప్‌లోని కాల్స్‌ ట్యాబ్‌ ద్వారా తర్వాత కాల్‌లో జాయిన్ అవ్వొచ్చు.
Published by:Krishna Adithya
First published:

Tags: Whatsapp

తదుపరి వార్తలు