వాట్సాప్‌లో వీడియో ఫైల్స్ క్లిక్ చేస్తే... టోటల్ స్మాష్...

ప్రతి జిల్లా పోలీసులు వాట్సాప్ నెంబర్లను వినియోగిస్తున్నారు. ఆ నెంబర్‌ను మీ ఫోన్‌లో తప్పకుండా సేవ్ చేసుకోండి. ఎమర్జెన్సీ సమయాల్లో మీ లొకేషన్ ఆ వాట్సప్ నెంబర్‌కు షేర్ చేస్తే వెంటనే సాయం అందిస్తారు.

WhatsApp Cyber Attack : MP4 వీడియో ఫైల్స్‌ని హ్యాకర్లు ప్రత్యేకంగా తయారుచేసి... వాట్సాప్‌లో పంపిస్తున్నారు. ఆ ఫైల్స్‌లో రిమోట్ కోడ్ ఎగ్జిక్యూషన్ (RCE), డెనియల్ ఆఫ్ సర్వీస్ (DoS) ఉంటున్నాయి. ఇవి యూజర్లను చిక్కుల్లో పడేస్తున్నాయి.

 • Share this:
  WhatsApp Cyber Attack : ఫేస్‌బుక్ నడుపుతున్న వాట్సాప్‌లో సెక్యూరిటీ సమస్యలు ఎక్కువవుతున్నాయి. ఇటీవలే ఈ యాప్ తెచ్చిన ఫింగర్ ప్రింట్ గుర్తింపు ఆప్షన్... మొబైళ్ల బ్యాటరీల ఛార్జింగ్‌ను అమాంతం పడేస్తూ విమర్శలు ఎదుర్కొంది. తాజాగా... లక్షల మంది ఆండ్రాయిండ్, యాపిల్ IOS, విండోస్ ప్లాట్‌ఫామ్ యూజర్లకు కొత్త సెక్యూరిటీ సమస్య తలెత్తుతోంది. కొత్తగా కొన్ని రకాల mp4 వీడియో ఫైల్స్ వాట్సాప్‌లో షేర్ అవుతున్నాయి. హ్యాకర్లు వీటిని పంపుతున్నారు. ఈ వీడియో లింక్‌ను ఎవరైనా క్లిక్ చేస్తే... వెంటనే... ఆ లింకుతో వచ్చిన వైరస్ పని ప్రారంభిస్తుంది. ఇంట్లో చొరబడిన దొంగలు విలువైన వస్తువులు ఎత్తుకుపోయినట్లు... ఆ వైరస్... ఫోన్‌లో చొరబడి... కాంటాక్ట్ నంబర్లు, ఐడీలు, పాస్‌వర్డ్‌లు, బ్యాంక్ అకౌంట్ల వివరాలు ఇలా సమాచారం మొత్తం సేకరించి... హ్యాకర్లకు చేరవేస్తున్నాయి. ఈ ఫైల్స్‌ను పంపిస్తున్న హ్యాకర్లు... వైరస్ ఫోన్‌లో చేరగానే... ఫోన్‌ను తమ కంట్రోల్‌లోకి తెచ్చుకొంటున్నారని వాట్సాప్ తెలిపింది.

  ఆండ్రాయిడ్ వెర్షన్ 2.29.274 కంటే ముందు వెర్షన్లకు ఈ సమస్య వస్తున్నట్లు ఫేస్‌బుక్ తెలిపింది. అదే... iOS అయితే... 2.19.100 కంటే ముందు వెర్షన్లకు వస్తున్నట్లు వివరించింది. విండోస్ ఫోన్లలో 2.18.368 వెర్షన్, దాని కంటే ముందు వెర్షన్లలో ఈ సమస్య తలెత్తుతోంది. ఇది తీవ్రమైన సెక్యూరిటీ సమస్య అనీ gbhackers.com తెలిపింది.

  వీడియో ఫైల్స్ ద్వారా మాల్వేర్‌ను పంపిస్తున్న హ్యాకర్లు... దాని ద్వారా ఫోన్‌పై నిఘా పెడుతున్నారు. ఇలా చెయ్యడం వల్ల ఆ ఫోన్ వాడే వ్యక్తి ఏయే పనులు చేస్తున్నాడో, ఎక్కడెక్కడకు వెళ్తున్నాడో, నెట్ ద్వారా ఏం చేస్తున్నాడో అన్ని వివరాలూ హ్యాకర్‌కు తెలుస్తాయి.

  ఇజ్రాయెల్‌కి చెందిన సైబర్ ఇంటెలిజెన్స్ కంపెనీ NSO గ్రూప్... పెగాసెస్ అనే స్పైవేర్ టూల్‌తో ఈ సైబర్ దాడి చేస్తున్నట్లు వాట్సాప్ గుర్తించింది. ప్రపంచవ్యాప్తంగా 1400 మందిపై ఈ స్పైవేర్ దాడి బారిన పడ్డారు. స్పైవేర్ బాధితుల్లో మానవ హక్కుల కార్యకర్తలు, జర్నలిస్టులు కూడా ఉన్నారు.

  స్పైవేర్ హ్యాకింగ్‌పై వివరణ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం... వాట్సాప్‌ను కోరింది. కేంద్ర ప్రభుత్వం పంపిన ఘాటైన స్టేట్‌మెంట్‌తో పూర్తిగా ఏకీభవిస్తున్నామన్న వాట్సాప్... తాము భారతీయుల రక్షణ, ప్రైవసీ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపింది. అలాగే స్పైవేర్ దాడి కారకులపైనా స్ట్రాంగ్ యాక్షన్ తీసుకుంటామని మాట ఇచ్చింది.


  Pics : బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న అనన్యా పాండే
  ఇవి కూడా చదవండి :

  రణు మండల్‌ చేసిన పనికి తిట్టిపోస్తున్న నెటిజన్లు... దెయ్యం అంటూ...

  5 స్టార్ హోటల్‌లో రూం బుక్... తీరా అక్కడకు వచ్చాక షాక్

  డయాబెటిస్ కంట్రోల్ అయ్యేందుకు ఇంటి చిట్కాలు...


  Video : స్నేహా ఉల్లాల్ బెస్ట్ ఫ్రెండ్ ఎవరో తెలుసా?

  Pics : రోజూ వాడే వస్తువులే కేకులు... న్యూజెర్సీ బేకర్ ప్రతిభ

  Published by:Krishna Kumar N
  First published: