Home /News /technology /

WhatsApp: వాట్సప్ యూజర్లకు అలర్ట్... మీ అకౌంట్ డిలిట్ కావద్దంటే వెంటనే ఈ పనిచేయండి

WhatsApp: వాట్సప్ యూజర్లకు అలర్ట్... మీ అకౌంట్ డిలిట్ కావద్దంటే వెంటనే ఈ పనిచేయండి

WhatsApp: వాట్సప్ యూజర్లకు అలర్ట్... మీ అకౌంట్ డిలిట్ కావద్దంటే వెంటనే ఈ పనిచేయండి
(ప్రతీకాత్మక చిత్రం)

WhatsApp: వాట్సప్ యూజర్లకు అలర్ట్... మీ అకౌంట్ డిలిట్ కావద్దంటే వెంటనే ఈ పనిచేయండి (ప్రతీకాత్మక చిత్రం)

WhatsApp New Privacy Rules | వాట్సప్ కొత్త ప్రైవసీ రూల్స్ విడుదల చేసింది. యూజర్లు ఈ రూల్స్‌ని యాక్సెప్ట్ చేయకపోతే యాప్ ఉపయోగించే అవకాశం ఉండదు.

    వాట్సప్ యూజర్లకు అలర్ట్. ఈ ఒక్క పనిచేయకపోతే మీ వాట్సప్ అకౌంట్ డిలిట్ అయ్యే అవకాశముంది. అంతేకాదు... మీరు వాట్సప్ ఉపయోగించడం సాధ్యం కాదు. మీరు ఉదయాన్నే వాట్సప్ యాప్ ఓపెన్ చేయగానే Terms and Privacy Policy పేరుతో ఏదైనా సమాచారం కనిపించిందా? ఇలాంటివి ఎప్పుడూ కనిపిస్తాయిలే అని లైట్ తీసుకున్నారా? అయితే అలర్ట్. మీరు ఆ టర్మ్స్ అండ్ ప్రైవసీ పాలసీ యాక్సెప్ట్ చేయకపోతే మీ వాట్సప్ పనిచేయదు. వాట్సప్ టర్మ్స్ ఆఫ్ సర్వీస్ అండ్ ప్రైవసీ పాలసీని అప్‌డేట్ చేసింది. కాబట్టి యూజర్లు కొత్త ప్రైవసీ రూల్స్‌ని అంగీకరించాల్సి ఉంటుంది. లేకపోతే మీ వాట్సప్ అకౌంట్ డిలిట్ చేసే అవకాశం ఉంది. అంటే మీరు వాట్సప్ యాప్ ఎప్పట్లా ఉపయోగించాలనుకుంచే కొత్త ప్రైవసీ రూల్స్‌ని అంగీకరించాల్సిందే.

    సాధారణంగా ఏ యాప్ డౌన్‌లోడ్ చేసినా టర్మ్స్ అండ్ కండీషన్స్ ఉంటాయి. వాటిని అంగీకరిస్తేనే యాప్ ఉపయోగించుకోవచ్చు. లేకపోతే యాప్ ఓపెన్ చేయడానికి కూడా రాదు. యాప్ డెవలపర్స్ తరచూ టర్మ్స్ అండ్ కండీషన్స్ అప్‌డేట్ చేస్తుంటాయి. ఇప్పుడు వాట్సప్ కూడా నియమనిబంధనల్ని అప్‌డేట్ చేసింది. 2021 జనవరి 4న అప్‌డేట్ చేసిన టర్మ్స్ ఆఫ్ సర్వీస్ అండ్ ప్రైవసీ పాలసీకి సంబంధించిన సమాచారం యూజర్లకు అందుతోంది. వాట్సప్ అప్‌డేట్ చేసిన టర్మ్స్ ఆఫ్ సర్వీస్ అండ్ ప్రైవసీ పాలసీ 2021 ఫిబ్రవరి 8న అమలులోకి రానుంది. ఈ కొత్త ప్రైవసీ రూల్స్ అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఫిబ్రవరి 8 లోగా కొత్త ప్రైవసీ రూల్స్ అంగీకరించాల్సిందే.

    Jio 28 days plans: జియో ప్లాన్ బెనిఫిట్స్ మారాయి... 28 రోజుల వేలిడిటితో రీఛార్జ్ ప్లాన్స్ ఇవే

    Xiaomi Mi 10i: రేపే ఎంఐ 10ఐ ఫస్ట్ సేల్... జియో నుంచి రూ.10,000 బెనిఫిట్స్

    WhatsApp updates terms and privacy policy, WhatsApp terms and privacy policy, WhatsApp new terms, WhatsApp terms and conditions, WhatsApp terms of service, WhatsApp new rules, WhatsApp new features, వాట్సప్ కొత్త నియమనిబంధనలు, వాట్సప్ ప్రైవసీ పాలసీ, వాట్సప్ కొత్త రూల్స్, వాట్సప్ కొత్త ప్రైవసీ రూల్స్
    వాట్సప్ కొత్త ప్రైవసీ రూల్స్


    "మా సర్వీసులపై యూజర్ల యాక్టివిటీ, డయాగ్నస్టిక్, పర్ఫామెన్స్ ఇన్ఫర్మేషన్‌ను మేం కలెక్ట్ చేస్తాం. ఇందులో మీ యాక్టివిటీ (మీరు మా సర్వీసెస్‌ను ఎలా ఉపయోగిస్తున్నారు, సర్వీస్ సెట్టింగ్స్, మా సేవల ద్వారా ఎలా ఇంటరాక్ట్ అవుతున్నారు, మీ యాక్టివిటీ, ఇంటరాక్షన్ సమయం, ఫ్రీక్వెన్సీ, కాలం), లాగ్ ఫైల్స్, డయాగ్నస్టిక్, క్రాష్, వెబ్‌సైట్, పర్ఫామెన్స్ లాగ్స్, రిపోర్ట్స్ లాంటి సమాచారం అందులో ఉంటుది" అని వాట్సప్ కొత్త ప్రైవసీ పాలసీలో వివరించింది. అంతేకాదు "మా నియమనిబంధనల్ని ఉల్లంఘించినా, హాని చేసేందుకు ప్రయత్నించినా మా సేవల్ని వినియోగించడానికి ఏ సమయంలోనైనా, ఏ కారణంలోనైనా మీకు యాక్సెస్ నిరాకరించొచ్చు. రద్దు చేయొచ్చు. లేదా మార్పులు చేయొచ్చు. మీరు అకౌంట్ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత యాక్టీవ్‌గా లేకపోతే డిసేబుల్ లేదా డిలిట్ చేస్తాం" అని వాట్సప్ వెల్లడించింది.

    IRCTC: మీరు ప్రయాణించాల్సిన రైలు ఎక్కడుంది? గతంలో కన్నా సింపుల్‌గా తెలుసుకోండి ఇలా

    Jio Plans: జియో బెనిఫిట్స్ మారాయి... రోజూ 2జీబీ డేటా ఇచ్చే ప్లాన్స్ ఇవే

    అంటే వాట్సప్ యాప్ ఉపయోగించేవారి సమాచారాన్ని వాట్సప్ సేకరిస్తుంది. అందులో హార్డ్‌వేర్, ఆపరేటింగ్ సిస్టమ్, బ్యాటరీ లెవెల్, సిగ్నల్ స్ట్రెంత్, యాప్ వర్షన్, బ్రౌజర్ ఇన్ఫర్మేషన్, మొబైల్ నెట్వర్క్, కనెక్షన్ ఇన్ఫర్మేషన్, భాష, టైమ్ జోన్, ఐపీ అడ్రస్ లాంటి వివరాలు ఉంటాయి. ఈ కొత్త ప్రైవసీ రూల్స్ అంగీకరించకుండా తప్పించుకునే పరిస్థితి లేదు. వాట్సప్ ఉపయోగించాలంటే తప్పనిసరిగా కొత్త ప్రైవసీ రూల్స్ ఫిబ్రవరి 8 లోగా అంగీకరించాల్సిందే. లేకపోతే అప్పట్నుంచి యాప్ ఓపెన్ కాదు. అకౌంట్ డిలిట్ అయ్యే అవకాశముంది.
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: Technology, Whatsapp

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు