WhatsApp: వాట్సాప్​ నుంచి కొత్త ఫీచర్లు విడుదల.. పూర్తి వివరాలను తెలుసుకోండి..

ప్రతీకాత్మక చిత్రం

WhatsApp: ఫేస్​బుక్​ యాజమాన్యంలోని ప్రముఖ ఇన్​స్టన్డ్​ మెసేజింగ్​ యాప్​​ వాట్సాప్​ కొత్త ఫీచర్లను జోడిస్తూ యూజర్లను ఆక్టట్టుకుంటోంది. వాట్సాప్ ఇటీవల​ తీసుకొచ్చిన నూతన ప్రైవసీ పాలసీ ద్వారా యూజర్లు చేజారిపోకుండా ఉండేందుకు వరుసగా కొత్త ఫీచర్లను విడుదల చేస్తుంది. దీనిలో భాగంగా కొత్తగా ‘బిల్లీ ఎలిష్’ యానిమేటెడ్​ స్టిక్కర్​ ప్యాక్​ను ఆవిష్కరించింది.

  • Share this:
ఫేస్​బుక్​ యాజమాన్యంలోని ప్రముఖ ఇన్​స్టన్డ్​ మెసేజింగ్​ యాప్​​ వాట్సాప్​ కొత్త ఫీచర్లను జోడిస్తూ యూజర్లను ఆక్టట్టుకుంటోంది. వాట్సాప్ ఇటీవల​ తీసుకొచ్చిన నూతన ప్రైవసీ పాలసీ ద్వారా యూజర్లు చేజారిపోకుండా ఉండేందుకు వరుసగా కొత్త ఫీచర్లను విడుదల చేస్తుంది. ఇందులో భాగంగా ఇటీవల ఫ్లాష్​ కాల్​, ఎన్​క్రిప్టెడ్​ ఛాట్​ బ్యాకప్​, ఛాట్​ మైగ్రేషన్​, డిజప్పియరింగ్​ మెసేజెస్​, గ్రూప్​ వీడియో కాలింగ్​ వంటి ఫీచర్లను జోడించింది. వీటిని ఆండ్రాయిడ్​తో పాటు ఐఓఎస్​ యూజర్లకు సైతం అందుబాటులోకి తెచ్చింది. ఇదే స్పీడ్​తో వాట్సాప్​ తాజాగా కొత్త ఫీచర్​ను లాంచ్​ చేసింది. ‘బిల్లీ ఎలిష్’ యానిమేటెడ్​ స్టిక్కర్​ ప్యాక్​ను ఆవిష్కరించింది. ఈ ఫీచర్​ కింద 'హ్యాపీయర్ దెన్ ఎవర్' అనే హాలీవుడ్ చిత్రంలోని సన్నివేశాలతో కూడిన స్టిక్కర్లను చిన్న వీడియో స్నిప్పెట్‌ల రూపంలో అందిస్తుంది. ఇవి యానిమేటెడ్ స్టిక్కర్ ప్యాక్ రూపంలో ఉంటాయి.

ఎక్కడ అందుబాటులో ఉంటాయి ?
ఈ స్టిక్కర్ ప్యాక్‌లో 15 సెకన్ల నిడివి గల Gif​లను చేర్చింది వాట్సాప్. అయితే సంస్థ కొత్తగా ప్రవేశపెట్టిన ‘హ్యాపీయర్ దెన్ యానిమేటెడ్’ స్టిక్కర్ ప్యాక్​ను సాధారణ స్టిక్కర్ ప్యాక్‌ల వలే డౌన్‌లోడ్ చేయలేం. కేవలం ప్రత్యేక లింక్​ ద్వారానే ఈ స్టిక్కర్​ ప్యాక్​ను డౌన్​లోడ్​ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు కేవలం 1.2MB స్పేస్ ఉంటే సరిపోతుంది. ఈ బిల్లీ ఎలిష్ హ్యాపీయర్‌ యానిమేటెడ్ స్టిక్కర్ ప్యాక్​ను ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో పరిశీలిద్దాం.
స్టెప్​ 1: www.wa.me/stickerpack/HappierThanEver అనే లింక్​పై క్లిక్​ చేయండి.
స్టెప్​ 2: ఓపెన్ యాప్ ఆప్షన్‌​లోకి వెళ్లండి.
స్టెప్​ 3: డౌన్‌లోడ్ బటన్‌పై క్లిక్​ చేయండి.

ఆ తరువాత మీ ఫోన్​లోకి ‘హ్యాపీయర్​ దెన్​ యానిమేటెడ్’​ స్టిక్కర్ ప్యాక్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. వీటి డౌన్​లోడ్​ పూర్తయిన తర్వాత, మీ అన్ని ఇతర స్టిక్కర్ ప్యాక్‌లతో పాటు ఈ కొత్త స్టిక్కర్​ ప్యాక్​లు వాట్సాప్​లో కనిపిస్తాయి. వీటిని ఎవరికైనా సులభంగా సెండ్ చేసుకోవచ్చు. కాగా, వాట్సాప్​ ఇటీవల మదర్స్​ డే, ఫాదర్స్​ డే, ఫ్రెండ్​షిప్​ డేలకు ప్రత్యేకమైన స్టిక్కర్లను తీసుకొచ్చింది. వీటిని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆండ్రాయిడ్​, ఐఓఎస్ యూజర్లందరికీ అందుబాటులోకి తీసుకొచ్చింది.
Published by:Veera Babu
First published: