news18-telugu
Updated: January 29, 2020, 11:33 AM IST
WhatsApp: ఈ చిన్న ట్రిక్ తెలిస్తే మీ వాట్సప్ సేఫ్
(ప్రతీకాత్మక చిత్రం)
వాట్సప్... ఎప్పుడూ వార్తల్లో ఉండే మొబైల్ అప్లికేషన్. కొత్తకొత్త ఫీచర్స్‌తోనే కాదు... కొత్తకొత్త వివాదాలు కూడా వాట్సప్ చుట్టూ తిరుగుతూనే ఉంటాయి. అమెజాన్ అధిపతి జెఫ్ బెజోస్ వాట్సప్‌ను సౌదీ అరేబియా హ్యాక్ చేసిందన్న వార్తలు కలకలం రేపాయి. అదే నిజమైతే జెఫ్ బెజోస్ మాత్రమే కాదు... మీ అందరి వాట్సప్ రిస్కులో ఉన్నట్టే. అయితే వాట్సప్‌లో ప్రైవసీ, సెక్యూరిటీ సమస్యలు ఎప్పుడూ బయటపడుతూనే ఉంటాయి. వాటి నుంచి మనం తప్పించుకోవడానికి మార్గాలున్నాయి. ఇందుకోసం మీ వాట్సప్‌లో కొన్ని సెట్టింగ్స్ మార్చుకుంటే చాలు. మీ వాట్సప్ హ్యాక్ కాకుండా అడ్డుకోవచ్చు. వాట్సప్ యాప్‌లోనే ఉండే ఈ సెట్టింగ్స్ గురించి చాలామందికి అవగాహన లేక వాడుకోరు. మీరు ఈ సెట్టింగ్స్ మార్చి మీ వాట్సప్‌ని సేఫ్‌గా ఉంచండి. మరి ఆ సెట్టింగ్స్ ఎలా మార్చాలో తెలుసుకోండి.
ముందుగా మీ ఫోన్లో వాట్సప్ యాప్ అప్డేట్ చేయండి. ఎందుకంటే ఏవైనా సెక్యూరిటీ సమస్యలు ఉంటే వాట్సప్ ఎప్పటికప్పుడు అప్డేట్స్ పంపిస్తూ ఉంటుంది. ఆ తర్వాత రైట్ సైడ్ టాప్‌లో త్రీ డాట్స్ క్లిక్ చేసి Settings ఓపెన్ చేయండి. ఆ తర్వాత Account పైన క్లిక్ చేయండి. అందులో Two-Step Verification పైన క్లిక్ చేయండి. ఆ తర్వాత Enable పైన క్లిక్ చేయండి. మీరు 6 అంకెల పిన్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ పిన్ ఎప్పటికీ గుర్తుంచుకోవాలి. ఒకసారి 6 అంకెల పిన్ ఎంటర్ చేసిన తర్వాత కన్ఫర్మేషన్ కోసం మరోసారి అదే పిన్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాతి స్టెప్‌లో ఇమెయిల్ ఐడీ కూడా ఎంటర్ చేయొచ్చు. ఈ స్టెప్స్ పూర్తి చేస్తే టూ స్టెప్ వెరిఫికేషన్ ఎనేబుల్ అవుతుంది.
మీరు Two-Step Verification ఎనేబుల్ చేసిన తర్వాత ఇక ఎప్పుడైనా మీ నెంబర్‌తో మరో ఫోన్లో వాట్సప్ ఇన్స్టాల్ చేయాలంటే మీరు సెట్ చేసిన 6 అంకెల పిన్ తప్పనిసరిగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీ ఫోన్ నెంబర్ తెలిసినా, మీ సిమ్ కార్డ్ వేరొకరికి దొరికినా వాట్సప్ అకౌంట్ క్రియేట్ చేయడం సాధ్యం కాదు. హ్యాకర్లు ఎవరైనా మీ వాట్సప్ యాక్సెస్ చేయాలంటే సాధ్యం కాదు. టూ స్టెప్ వెరిఫికేషన్ ద్వారా మీ వాట్సప్‌ని మరింత సేఫ్‌గా మార్చేందుకు అవకాశం లభిస్తుంది.
ఇవి కూడా చదవండి:
Airtel: ఎయిర్టెల్ రూ.179 ప్లాన్‌తో రూ.2 లక్షల ఇన్స్యూరెన్స్
WhatsApp Status: మీ వాట్సప్ స్టేటస్‌ని ఫేస్‌బుక్‌లోకి షేర్ చేయండి ఇలా
Personal Data: మీరు చనిపోయాక మీ ఫేస్బుక్, గూగుల్ డేటా ఏమవుతుందో తెలుసా?
Published by:
Santhosh Kumar S
First published:
January 29, 2020, 11:33 AM IST