Home /News /technology /

WHATSAPP TO STOP WORKING ON THESE IPHONES SOON CHECK FULL LIST HERE GH VB

WhatsApp: ఆ ఐఫోన్‌లలో వాట్సాప్ పనిచేయదు.. వాట్సాప్ కోసం కొత్త ఫోన్ వాడాల్సిందే.. ఎందుకంటే..

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

2022 అక్టోబర్ 24 నుంచి iOS వెర్షన్‌లు iOS 10, iOS 11, iPhone 5, iPhone 5Cలు వినియోగిస్తున్న వినియోగదారులకు వాట్సాప్ సేవలు అందవని వాట్సాప్ ట్రాకర్, WABetaInfo నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. కాబట్టి వినియోగదారులు తమ iOSని అప్‌గ్రేడ్ చేయడానికి ఐదు నెలల సమయం ఉంది.

ఇంకా చదవండి ...
ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది వినియోగిస్తున్న ఇన్‌స్టాంట్‌ మెసేజింగ్‌ యాప్‌(Instant Messaging App) వాట్సాప్(WhatsApp). మెటా కంపెనీకి చెందిన వాట్సాప్ వినియోగదారులను ఆకట్టుకోవడంలో ఎప్పుడూ ముందు ఉంటోంది. మార్కెట్‌లో అందుబాటులో ఉన్న ఇతర మెసేజింగ్‌ యాప్‌లకు(App) బలమైన పోటీని ఇస్తోంది. ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్‌లను(New Feature) వినియోగదారులకు అందిస్తోంది. తాజాగా సెక్యూరిటీ పరంగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం. పాత ఐవోఎస్‌ వెర్షన్‌లకు(Version) త్వరలో వాట్సాప్ సేవలు దూరం కానున్నట్లు కొన్ని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. భద్రత పరంగా యాప్‌ను అప్‌డేట్‌ చేస్తోందని, అందుకే పాత వెర్షన్‌లకు ఇకపై యాప్‌ సపోర్ట్‌(Support) చేయదని నివేదికలు పేర్కొంటున్నాయి.

ఇటీవల ఐఫోన్‌లలో ప్రైవసీకి ఇస్తున్న పాధాన్యంపై యాపిల్‌ కంపెనీ ఓ యాడ్‌ను రూపొందించి, విడుదల చేసిన సంగతి తెలిసిందే. వినియోగదారుల సమాచారాన్ని థర్డ్‌పార్టీ యాప్‌లు సేకరించకుండా నియంత్రించేందుకు కొత్త ఫీచర్‌ను తీసుకొస్తున్నట్లు తెలిపింది. ఇదే బాటలో వినియోగదారుల భద్రతకు తీసుకొంటున్న చర్యలపై గూగుల్‌ కూడా ఓ షార్ట్‌ వీడియోను విడుదల చేయడం గమనార్హం. ఈ నేపథ్యంలో త్వరలోనే పాత iOS వెర్షన్‌లు అయిన iOS 10, iOS 11, iPhone 5, iPhone 5Cకు వాట్సాప్ సేవలు దూరం కానున్నాయి. ఈ వెర్షన్‌లకు రాబోయే నెల నుంచి వాట్సాప్ సపోర్ట్‌ చేసే అవకాశం లేదు.

Phones Under Rs.40K: రూ.40వేలలో బెస్ట్ ఫోన్ కోసం చూస్తున్నారా..? అయితే ఈ మోడళ్లను చెక్ చేయండి..


కొత్త మార్పులను తీసుకురావడానికి, లేదా వినియోగదారుల సెక్యూరిటీ, ప్రైవసీని మెరుగుపరచడానికి యాప్‌లు తమ సేఫ్టీ ఫీచర్‌లను ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేసుకొంటాయి. ఇదే తరహాలో భద్రతా సమస్యల కారణంగా వాట్సాప్ పాత ఐఫోన్‌లలో పనిచేస్తున్న iOS పాత వెర్షన్‌లకు సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. పాత iOS వెర్షన్‌లను ఉపయోగిస్తున్న iPhone వినియోగదారులకు అనేక వాట్సాప్ ఇన్ యాప్ ఫీచర్‌లు అందుబాటులో ఉండవు. పని చేయడం ఆగిపోయే ఫీచర్‌లలో ఎమోజీలు, పేమెంట్స్‌ వంటివి ఉండవచ్చు. అయితే దీనిపై ఇప్పటి వరకు వాట్సాప్ కంపెనీ నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఎప్పటికప్పుడు అప్‌డేట్‌గా ఉంచడానికి ఆండ్రాయిడ్ విషయంలోనే వాట్సాప్ ఇదే నిర్ణయం తీసుకొనే అవకాశం ఉందని తెలిసింది.

2022 అక్టోబర్ 24 నుంచి iOS వెర్షన్‌లు iOS 10, iOS 11, iPhone 5, iPhone 5Cలు వినియోగిస్తున్న వినియోగదారులకు వాట్సాప్ సేవలు అందవని వాట్సాప్ ట్రాకర్, WABetaInfo నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. కాబట్టి వినియోగదారులు తమ iOSని అప్‌గ్రేడ్ చేయడానికి ఐదు నెలల సమయం ఉంది. వాట్సాప్ ఫీచర్‌లను పూర్తిగా ఆస్వాదించడానికి iOS 12, దాని తర్వాత వెర్షన్‌లను వినియోగించాల్సి ఉంటుంది.

iPhone 5, iPhone 5C iOS 12కి అనుకూలంగా లేవు కాబట్టి ఈ వినియోగదారులు చివరికి వాట్సాప్‌ను వినియోగించే అవకాశం లేదు. ఇలాంటి చర్యలతో భద్రత, ప్రైవసీలకు భరోసా కల్పించాలని మెటాకు చెందిన ఇన్‌స్టాంట్‌ మెసేజింగ్‌ కంపెనీ వాట్సాప్ అప్‌గ్రేడ్ చేయాలనుకుంటోంది.
Published by:Veera Babu
First published:

Tags: Iphone, Whatsapp

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు