WhatsApp: పేటీఎం, గూగుల్ పేకు పోటీగా వాట్సప్ పేమెంట్ సేవలు... ఈ నెలలోనే ప్రారంభం

WhatsApp Pay | గూగుల్ పే, పేటీఎం, అమెజాన్ పే లాంటి పేమెంట్ ప్లాట్‌ఫామ్స్‌కు పోటీగా వాట్సప్ కూడా పేమెంట్ సేవల్ని ప్రారంభించబోతోంది.

news18-telugu
Updated: May 7, 2020, 11:45 AM IST
WhatsApp: పేటీఎం, గూగుల్ పేకు పోటీగా వాట్సప్ పేమెంట్ సేవలు... ఈ నెలలోనే ప్రారంభం
WhatsApp: పేటీఎం, గూగుల్ పేకు పోటీగా వాట్సప్ పేమెంట్ సేవలు... ఈ నెలలోనే ప్రారంభం (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సప్ భారతదేశంలో పేమెంట్ సేవల్ని ప్రారంభించాలని చాలాకాలంగా ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. మే నెలాఖరులోగా భారతదేశంలో వాట్సప్ పేమెంట్ సేవలు ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం వాట్సప్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసీఐసీఐ, యాక్సిస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులతో ఒప్పందం కుదుర్చుకుంది. ఐసీఐసీఐ బ్యాంకుతో కలిసి బీటా టెస్టింగ్ ప్రారంభించింది వాట్సప్. ఈ నెలాఖరులో వాట్సప్ పేమెంట్ సేవల్ని ప్రారంభించడానికి ఐసీఐసీఐ, యాక్సిస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులు ఏర్పాట్లు చేస్తున్నాయి. మొదటి దశలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రమేయం మాత్రం ఉండట్లేదు.

వాట్సప్‌లో అందరు యూజర్లకు పేమెంట్ సేవల్ని అందించేందుకు ప్రభుత్వంతో కలిసి మేం పనిచేస్తున్నాం. వాట్సప్‌లో పేమెంట్ సేవలు ప్రారంభమైతే భారతదేశంలో డిజిటల్ పేమెంట్స్ పుంజుకుంటాయి. కరోనా వైరస్ ప్రభావం తీవ్రంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో భారతదేశంలోని 40 కోట్ల మంది యూజర్లు సురక్షితంగా లావాదేవీలు జరిపేందుకు ఇది ఉపయోగపడుతుంది.

మనీకంట్రోల్‌తో వాట్సప్ అధికార ప్రతినిధి


ప్రస్తుతం వాట్సప్ పే, ఎస్‌బీఐ కలిసి ఇంటిగ్రేషన్ టెస్టింగ్ ఫేజ్‌పైన పనిచేస్తున్నాయి. కస్టమర్లకు సులభతరంగా సేవలు అందించడంతో పాటు వారి సెక్యూరిటీ విషయంలో పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్టు వాట్సప్ చెబుతోంది.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి అనుమతులు పొందడంలో ఆలస్యం కారణంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, వాట్సప్ అనుసంధానంలో జాప్యం జరుగుతోంది.
ఎస్‌బీఐ ప్రతినిధి


భారతదేశంలో గూగుల్ పే సేవల్ని కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసీఐసీఐ, యాక్సిస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులు అందిస్తున్నాయి. వాట్సప్ పేమెంట్స్ సేవల్ని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా-NPCI 2018 ఫిబ్రవరిలో నిలిపివేసిన సంగతి తెలిసిందే. చట్టపరమైన, నియంత్రణ అడ్డంకుల కారణంగా అనుమతులకు రెండేళ్ల గడువు పట్టింది.ఇవి కూడా చదవండి:

PF Balance: మీ పీఎఫ్ బ్యాలెన్స్ ఎంత? ఈ స్టెప్స్‌తో తెలుసుకోండి

Cash Withdrawal: ఏటీఎంలో డబ్బులు లేవా? షాపులో తీసుకోవచ్చు

Vodafone: రోజూ 2జీబీ డేటా ఫ్రీగా ఇస్తున్న వొడాఫోన్... ఎవరికంటే
First published: May 7, 2020, 11:45 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading