Whatsapp : త్వరలో కొత్త ఫీచర్ అందుబాటులోకి..

Whatsapp : ఆడియో సందేశాన్ని నేరుగా పంపించడం కాకుండా.. రికార్డు చేసిన ఆడియోను పరిశీలించుకునే ఆప్షన్‌ను వాట్సాప్ తీసుకురానుంది.తద్వారా ఆడియో సందేశాల్లో తప్పులు దొర్లకుండా ఉంటుంది.

news18-telugu
Updated: July 23, 2019, 1:34 PM IST
Whatsapp : త్వరలో కొత్త ఫీచర్ అందుబాటులోకి..
వాట్సాప్ లోగో (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: July 23, 2019, 1:34 PM IST
వాట్సాప్‌లో త్వరలోనే మరో సరికొత్త ఫీచర్ అందుబాటులోకి రానుంది. ఆడియో సందేశాన్ని నేరుగా పంపించడం కాకుండా.. రికార్డు చేసిన ఆడియోను పరిశీలించుకునే ఆప్షన్‌ను వాట్సాప్ తీసుకురానుంది.తద్వారా ఆడియో సందేశాల్లో తప్పులు దొర్లకుండా ఉంటుంది. వాట్సాప్‌లో టెక్స్ట్ మెసేజ్‌లు,వీడియో మెసేజ్‌లు పంపించేముందు అలా పరిశీలించుకునే అవకాశం ఉంది. ఒక్క ఆడియో మెసేజ్‌లకు మాత్రమే ఇప్పటివరకు ఆ అవకాశం లేదు. దీంతో దానిపై ద‌ృష్టి పెట్టిన వాట్సాప్.. త్వరలోనే కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ IOS బీటా దశలో ఉంది. అతి త్వరలోనే అందరికీ అందుబాటులోకి రానుంది.సాధారణంగా వాట్సాప్ నుంచి వచ్చే మెసేజ్‌లు సెల్‌ఫోన్ స్క్రీన్‌పై కనిపించే సంగతి తెలిసిందే. మెసేజ్‌కు సంబంధించిన మొదటి లైన్‌లో కొంత భాగం స్క్రీన్‌పై కనిపిస్తుంది. అదే తరహాలో వాయిస్ మెసేజ్‌లకు కూడా ఫీచర్‌ను డెవలప్ చేసే పనిలో ఉంది. త్వరలోనే ఇది కూడా అందుబాటులోకి రానుంది.

First published: July 23, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...