భారతదేశంలో వాట్సప్ పేమెంట్ సర్వీస్‌ను ప్రారంభించేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా-NPCI ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. దీంతో కోట్లాది మంది వాట్సప్ యూజర్లకు వాట్సప్ పేమెంట్ సర్వీస్ అందుబాటులోకి రానుంది. అయితే ఒక్కసారిగా కాకుండా దశలవారీగా ఈ సర్వీస్‌ను కస్టమర్లకు అందించనుంది వాట్సప్. మరో రెండు నెలల్లోనే వాట్సప్ పేమెంట్స్ సర్వీస్ యూజర్లకు లభిస్తుంది. వాట్సప్‌కు భారతదేశంలో 40 కోట్ల మంది యూజర్లు ఉంటే మొదటి దశలో కేవలం 2 కోట్ల మంది యూజర్లకు మాత్రమే వాట్సప్ పేమెంట్ సర్వీస్ లభించనుంది. ఇప్పటికే ఇండియాలో వాట్సప్ పేమెంట్స్ ట్రయల్ రన్ నడుస్తోంది. లక్షలాది యూజర్లకు వాట్సప్ పేమెంట్ సేవలు అందుతున్నాయి. మరి మీకు వాట్సప్ పేమెంట్స్ ఫీచర్ ఇప్పటికే లభించినా, త్వరలో లభించనున్నా డబ్బులు ఎలా పంపాలో తెలుసుకోండి.
Jio New Plans: జియో నుంచి కొత్త ప్లాన్స్... బెనిఫిట్స్ ఇవే
మీ EPF Account Transfer ఆన్‌లైన్‌లో ఈజీగా చేయండిలా
వాట్సప్ పేమెంట్స్ ఫీచర్ వాడుకునేముందు యూజర్లు తమ యాప్‍ను అప్‌డేట్ చేయడం అవసరం. ఆ తర్వాత మీ ఫోన్‌లో వాట్సప్ యాప్ ఓపెన్ చేయండి. కుడివైపు పైభాగంలో ఉన్న త్రీ డాట్స్ క్లిక్ చేయండి. అందులో Payments ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్‌పైన క్లిక్ చేసిన తర్వాత Add payment method పైన క్లిక్ చేయాలి. వాట్సప్ పేమెంట్స్ సర్వీస్ ఉపయోగించాలంటే టర్మ్స్ అండ్ కండీషన్స్ అంగీకరించాల్సి ఉంటుంది. నియమనిబంధనలు చదివిన తర్వాత Accept and Continue పైన క్లిక్ చేయాలి. ఆ తర్వాత కనిపించే బ్యాంకుల లిస్ట్ నుంచి మీకు అకౌంట్ ఉన్న బ్యాంకును సెలెక్ట్ చేయాలి. అకౌంట్ నెంబర్‌కు లింక్ అయి ఉన్న మొబైల్ నెంబర్‌కు వెరిఫికేషన్ మెసేజ్ వస్తుంది. వెరిఫై చేసిన తర్వాత అకౌంట్ నెంబర్లు కనిపిస్తాయి. అకౌంట్ సెలెక్ట్ చేస్తే అకౌంట్ సెటప్ పూర్తవుతుంది.
WhatsApp Storage: మీ వాట్సప్ స్టోరేజ్ ఫుల్ అయిందా? ఈ టిప్స్‌తో ఈ సమస్యకు చెక్ పెట్టండి
Prepaid Plans: 84 రోజుల వేలిడిటీ, డేటాతో Airtel, Jio, Vi ప్లాన్స్ ఇవే
వాట్సప్ ద్వారా రెండు పద్ధతుల్లో డబ్బులు పంపడం సాధ్యం అవుతుంది. మీరు డబ్బులు పంపాలనుకు వారి ఛాట్ విండో ఓపెన్ చేసిన తర్వాత అటాచ్‌మెంట్ పైన క్లిక్ చేయాలి. అందులో Payment ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. సెండ్ మనీ పైన క్లిక్ చేసి అమౌంట్ టైప్ చేసి యూపీఐ పిన్ ఎంటర్ చేయాలి. యూపీఐ పిన్ ఎంటర్ చేస్తే డబ్బులు ట్రాన్స్‌ఫర్ అవుతాయి. రెండో పద్ధతి ద్వారా డబ్బులు పంపాలనుకుంటే వాట్సప్ ఓపెన్ చేసి రైట్ టాప్‌లో త్రీ డాట్స్ పైన క్లిక్ చేయాలి. అందులో Payments ఆప్షన్‌లో న్యూ పేమెంట్ పైన క్లిక్ చేసి మీ కాంటాక్ట్స్ లిస్ట్‌లో పేరు సెలెక్ట్ చేయాలి. ముందు చెప్పిన ప్రాసెస్‌లోనే డబ్బులు పంపాలి. అయితే అవతలివాళ్లు కూడా వాట్సప్ పేమెంట్స్ సెటప్ చేసుకుంటేనే డబ్బులు పంపడానికి వీలవుతుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Personal Finance, Whatsapp