WhatsApp: వాట్సప్‌లో ఫోటోలు పంపుతున్నారా? కొత్త ఫీచర్ వచ్చేస్తోంది

WhatsApp Feature | ఫోటో షేర్ చేసేప్పుడు ఎవరికి పంపాలో వారికి మాత్రమే పంపేలా, కాంటాక్ట్‌ను సరిచూసుకునేలా ఫీచర్ అందుబాటులోకి తీసుకురాబోతోంది.

news18-telugu
Updated: June 20, 2019, 11:14 AM IST
WhatsApp: వాట్సప్‌లో ఫోటోలు పంపుతున్నారా? కొత్త ఫీచర్ వచ్చేస్తోంది
WhatsApp: వాట్సప్‌లో ఫోటోలు పంపుతున్నారా? కొత్త ఫీచర్ వచ్చేస్తోంది (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
వాట్సప్... స్మార్ట్‌ఫోన్ యూజర్ల జీవితంలో భాగమైపోయింది. ఉదయం నిద్రలేచిన దగ్గర్నుంచి రాత్రి పడుకునేవరకు వాట్సప్ ఎన్నిసార్లు చూస్తారో లెక్కేలేదు. మెసేజ్‌లు, ఫోటోలు, వీడియోలు, ఇతర ఫైల్స్ షేర్ చేయడానికి వాట్సప్ ఎంతగానో ఉపయోగపడుతోంది. మీరు తరచూ వాట్సప్‌లో ఫోటోలు పంపిస్తుంటారా? కొటేషన్స్, ఇమేజెస్ షేర్ చేస్తుంటారా? మీకు గుడ్ న్యూస్. త్వరలో వాట్సప్‌లో కొత్త ఫీచర్ రాబోతోంది. ప్రస్తుతం వాట్సప్‌లో ఫోటో షేరింగ్ ఫీచర్ చూస్తే పొరపాటున ఒకరికి బదులు మరొకరికి షేర్ చేసే అవకాశముంది. చాలామందికి ఇలాంటి సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి. అందుకే వాట్సప్ కొత్త ఫీచర్ తీసుకురానుందని తెలుస్తోంది. ఫోటో షేర్ చేసేప్పుడు ఎవరికి పంపాలో వారికి మాత్రమే పంపేలా, కాంటాక్ట్‌ను సరిచూసుకునేలా ఫీచర్ అందుబాటులోకి తీసుకురాబోతోంది.

ప్రస్తుతం వాట్సప్‌లో ఫోటో షేర్ చేయడానికి కాంటాక్ట్‌ని సెలెక్ట్ చేసిన తర్వాత టాప్‌లో కాంటాక్ట్ డీపీ కనిపిస్తుంది. కొత్త ఫీచర్ అందుబాటులోకి వస్తే కింద క్యాప్షన్ ప్లేస్‌లో కాంటాక్ట్ పేరు కనిపిస్తుంది. కాంటాక్ట్ పేరు చూసి మీరు ఫోటో సరైనవాళ్లకే పంపుతున్నారా లేదా అని క్రాస్ చెక్ చేసుకునే అవకాశం ఉంటుంది. దీని ద్వారా ఫోటోలు తప్పుగా షేర్ చేసే పరిస్థితి రాదు. ఆండ్రాయిడ్ బీటా వర్షన్ 2.19.173 అప్‌డేట్ వచ్చినవాళ్లు ఈ ఫీచర్ వాడుకోవచ్చు. బీటావర్షన్‌లో ఈ ఫీచర్‌ను పరిశీలించిన తర్వాత మిగతా యూజర్లకు అప్‌డేట్ రిలీజ్ అవుతుంది.

Asus 6Z: ఫ్లిప్ కెమెరాతో ఏసుస్ 6జెడ్... ఎలా ఉందో చూశారా?


ఇవి కూడా చదవండి:

Credit Card: మీరు వాడని క్రెడిట్ కార్డును ఇలా క్యాన్సిల్ చేయొచ్చు

WhatsApp: వాట్సప్‌లో ఛాట్స్ ఇలా బ్యాకప్ చేసుకోండిHonor 20i - Jio offer: హానర్ 20ఐ కొంటే జియో నుంచి రూ.2,200 క్యాష్‌బ్యాక్
Published by: Santhosh Kumar S
First published: June 20, 2019, 11:14 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading