WhatsApp: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (WhatsApp) యూజర్లకు ప్రైవసీ, సేఫ్టీని పెంచేందుకు నిత్యం కృషి చేస్తూనే ఉంది. ఇందులో భాగంగా ఇప్పటికే చాలా సేఫ్టీ ఫీచర్లను పరిచయం చేసింది. ఇప్పుడు మరొక అదిరిపోయే ప్రైవసీ ఫీచర్‌ను అందించడానికి వాట్సాప్ నడుం బిగించింది. వాట్సాప్ యూజర్‌నేమ్ (WhatsApp username) అని పిలిచే ఈ అప్‌కమింగ్ ఫీచర్ గురించి WABetaInfo లేటెస్ట్ రిపోర్టు ఆసక్తికర విషయాలను పంచుకుంది. వాట్సాప్ 'యూజర్‌నేమ్' ఫీచర్‌పై పనిచేస్తోందని, యూజర్లు తమ అకౌంట్స్ కోసం యూనిక్ యూజర్‌నేమ్ సెలెక్ట్ చేయడానికి ఇది వీలు కల్పిస్తుందని వాట్సాప్ బీటా ఇన్ఫో పేర్కొంది.
సాధారణంగా వాట్సాప్‌లో ఇతరులతో కమ్యూనికేట్ అయ్యేటప్పుడు యూజర్ ఫోన్ నంబర్ అవతలి వ్యక్తికి ఈజీగా తెలిసిపోతుంది. దీనివల్ల ప్రైవసీకి భంగం వాటిల్లే అవకాశం ఉంది. అంతేకాదు, వాట్సాప్ నంబర్లను గుర్తించుకోవడం కూడా యూజర్లకు కష్టమవుతుంది. ఈ సమస్యలన్నిటికీ పరిష్కారంగా వాట్సాప్ తీసుకొస్తున్న యూజర్‌నేమ్స్ నిలవనుంది. నంబర్ ప్లేసులో ఓ యూనిక్ యూజర్‌నేమ్ (Unique Username) క్రియేట్ చేయడం ద్వారా ప్రైవసీ కోల్పోకుండా ఏ యూజర్‌తోనైనా వాట్సాప్‌లో కమ్యూనికేట్ కావడం సాధ్యమవుతుంది. వాట్సాప్ బీటా ఆండ్రాయిడ్ 2.23.11.15లో ఈ అప్‌కమింగ్ ఫీచర్ కనిపించిందని WABetaInfo వెల్లడించింది.
* స్క్రీన్‌షాట్‌లో మరిన్ని డీటేల్స్
వాట్సాప్ ట్రాకర్ వాట్సాప్ బీటా ఇన్ఫో 'వాట్సాప్ యూజర్‌నేమ్స్' ఫీచర్‌కు సంబంధించిన ఒక స్క్రీన్‌షాట్ పంచుకుంది. ఈ పిక్‌లో చూసినట్లుగా వాట్సాప్ సెట్టింగ్స్> ప్రొఫైల్ సెక్షన్‌కి వెళ్లి యూజర్‌నేమ్‌ను సెట్ చేసుకోవడానికి వీలుగా ఒక ఆప్షన్ ఉంది. దీనితో యూజర్లు తమ అకౌంట్ ప్రైవసీని మరింత పెంచుకునే అవకాశం ఉంటుంది. అలానే బంధుమిత్రులు, తెలిసినవారు గుర్తుంచుకునేలా యూజర్లు యూనిక్ యూజర్‌నేమ్‌ను ఎంచుకోవచ్చు. కేవలం ఫోన్ నంబర్లపై ఆధారపడకుండా పేరు ద్వారా తమను కాంటాక్ట్ కావడానికి యూజర్లు ఈ ఫీచర్‌ని వినియోగించవచ్చు. అలాగే తమను కాంటాక్ట్ అయ్యే వారు ఫోన్ నంబర్‌ను తెలుసుకోకుండా యూజర్లు జాగ్రత్త పడొచ్చు.
WhatsApp: వాట్సాప్‌లో ఎడిట్ మెసేజ్ ఫీచర్ ఎలా ఉపయోగించాలి? సింపుల్ ప్రాసెస్..
* మరిన్ని వివరాలు
వాట్సాప్ ఈ ఫీచర్ పరిచయం చేసిన తర్వాత యాప్‌లో యూజర్‌నేమ్ సెర్చ్ చేయడం ద్వారా ఫలానా యూజర్‌ని కాంటాక్ట్ అయ్యే అవకాశాన్ని కూడా అందించవచ్చు. ఈ ఫీచర్ ఇంకా అభివృద్ధి దశలోనే ఉంది కాబట్టి ఇది ఎలా పని చేస్తుందో తెలియాలంటే ఇంకొద్ది రోజులు వేచి చూడక తప్పదు. యూజర్‌నేమ్స్ ద్వారా చేసే సంభాషణలకు కూడా యాప్ ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఆఫర్ చేయనుంది. దీనివల్ల యూజర్లకు ఎప్పటిలాగానే కట్టుదిట్టమైన ప్రైవసీ లభిస్తుంది. ప్రస్తుతానికి డెవలప్‌మెంట్ స్టేజ్‌లో ఉన్న ఈ ఫీచర్ త్వరలో బీటా టెస్టర్లకు రిలీజ్ కావచ్చు. తర్వాత రెగ్యులర్ యూజర్లందరికీ విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ ఫీచర్‌తో వాట్సాప్ యూజర్ల ప్రైవసీ మరో లెవల్‌కి వెళ్తుందని చెప్పొచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Whatsapp, Whatsapp number, Whatsapp tricks