WhatsApp: వాట్సప్ యూజర్లకు గుడ్ న్యూస్... కొత్త ఫీచర్స్ ఇవే

WhatsApp New Features | వాట్సప్ యూజర్లకు శుభవార్త. త్వరలో కొత్త ఫీచర్స్ రాబోతున్నాయి. వాటితో ఉపయోగమేంటో తెలుసుకోండి.

news18-telugu
Updated: September 22, 2020, 5:05 PM IST
WhatsApp: వాట్సప్ యూజర్లకు గుడ్ న్యూస్... కొత్త ఫీచర్స్ ఇవే
WhatsApp: వాట్సప్ యూజర్లకు గుడ్ న్యూస్... కొత్త ఫీచర్స్ ఇవే (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
వాట్సాప్ వినియోగదారులకు శుభవార్త. వినియోగదారులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న రెండు సరికొత్త ఫీచర్లను వాట్సాప్ త్వరలో విడుదల చేయనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. మల్టీ-డివైస్ సపోర్ట్ ఫీచర్ టెస్టింగ్ చివరి దశకు చేరినట్టు తాజా నివేదికలు చెబుతున్నాయి. ఎక్స్పైరింగ్ మీడియా లేదా సెల్ఫ్ డిస్ర్టక్టింగ్ మెస్సేజెస్ ఫీచర్ను కూడా బీటా వినియోగదారులకు విడుదల చేసినట్టు తెలుస్తోంది. కానీ వాట్సాప్ మాత్రం ఇంతవరకు ఈ రెండు ఫీచర్లపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

మల్టీ-డివైస్ సపోర్ట్ ఆప్షన్ను ఏ క్షణమైనా వాట్సాప్ విడుదల చేసే అవకాశం ఉందని Wabetainfo నివేదికలు చెబుతున్నాయి. ఒకే వాట్సాప్ ఖాతాతో ఒకేసారి నాలుగు డివైజెస్ల్లో లాగిన్ అయ్యే అవకాశాన్ని ఈ ఫీచర్ అందిస్తుంది. ఇది అందుబాటులోకి వస్తే... ప్రతిసారి ఫోన్లో డేటా, వాట్సాప్ ఆన్లో ఉండాల్సిన అవసరం లేకుండా వేరే డివైజ్లో వాట్సాప్ అకౌంట్తో లాగిన్ కావచ్చు. అనుకోకుండా ఫోన్లో డేటా అయిపోయినా, ఫోన్ పనితీరులో లోపాలున్నా వినియోగదారులు వాట్సాప్ ను డెస్క్టాప్ ద్వారా యాక్సెస్ చేయొచ్చు. డెస్క్టాప్ క్లయింట్ల కోసం ఆధునిక UI ఫీచర్ని అందించేందుకు వాట్సాప్ ప్లాన్ చేస్తోంది. చాట్ హిస్టరీ డివైస్ నుంచి ఎలా వెళ్లిందనే వివరాలు దీనిద్వారా తెలుసుకోవచ్చు. ఇదంతా ఎండ్ టు ఎంట్ ఎన్స్క్రిప్షన్ ద్వారా జరుగుతుంది.

JioPostpaid Plus: జియోపోస్ట్‌పెయిడ్ ప్లస్‌తో నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ+ హాట్‌స్టార్ ఫ్రీ

JioBrowser: మేడ్ ఇన్ ఇండియా జియోబ్రౌజర్ వచ్చేసింది... ఫీచర్స్ ఇవే

వాట్సాప్ ఏమంటోంది?


మల్టీ డివైజ్ సపోర్ట్‌లో కొన్ని కీ-ఎలిమెంట్లు ఇంకా సిద్ధం కాలేదని వాట్సాప్ ఫీచర్ ట్రాకర్ ద్వారా తెలుస్తోంది. ఇప్పటివరకు చాట్ హిస్టరీని సింక్ చేయడం, చాట్ లిస్ట్ను మ్యూట్ చేయడం, స్టారింగ్ ఆప్షన్ వంటివే అభివృద్ధి చేశారు. ఫైనల్ టెస్టింగ్ తరువాత బీటా వినియోగదారులకు ఈ ఫీచర్ను అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉంది.

అన్ని డివైజ్లలో సింక్ అవుతుంది

ఈ అప్డేట్‌కు సంబంధించి Wabetainfo ఒక స్క్రీన్‌షాట్‌ను షేర్ చేసింది. దాని ప్రకారం.. వాట్సాప్ ఓపెన్ చేయగానే మనకు మల్టీ లెవల్ ఆప్షన్ బటన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే.. మన ఖాతాతో యాక్సెస్ అయిన లింక్డ్ డివైజెస్ వివరాలు కనిపిస్తాయి. ఫోన్లో ఈ ఆప్షన్ను ఎంచుకున్న తరువాత ఇతర డివైజ్‌లలో వాట్సాప్ ఖాతా ద్వారా లాగిన్ అవ్వొచ్చు. ఇలా లింక్ అయిన డివైజ్లలో వాట్సాప్‌ను వాడితే.. ఆ వివరాలన్నీ ఇతర డివైజ్లలో లాగిన్ అయిన వాట్సాప్ అకౌంట్లో కూడా సింక్ అవుతాయి.

Poco X3: ఇండియాలో రిలీజైన పోకో ఎక్స్3... ధర, స్పెసిఫికేషన్స్ వివరాలివే

Realme Narzo 20 Series: రియల్‌మీ నార్జో 20 సిరీస్‌లో 3 స్మార్ట్‌ఫోన్స్... ఏది బెస్ట్ తెలుసుకోండి

ఆటోమెటిక్ డిలీట్ ఆప్షన్ కూడా


తాజా ఆండ్రాయిడ్ బీటా అప్‌డేట్‌లో మరో ఫీచర్ ఉంది. అదే మెస్సేజ్ ఎక్పైరింగ్ ఆప్షన్. దీని ద్వారా చాట్ లిస్ట్‌కు మనం నిర్ణీత సమయాన్ని సెట్ చేసుకోవచ్చు. మనం ఎవరికైనా మెస్సేజ్, ఫోటో, వీడియో పంపిన తరువాత దానికి ఎక్స్‌పైరీ టైమ్ పెట్టుకోవచ్చు. ఒకవేళ మనం పంపిన మెస్సేజ్‌ను అవతలివారు చూడకపోతే, నిర్ణీత సమయంలో దానంతట అదే డిలీట్ అవుతుంది. ఈ అప్డేట్ ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నట్టు తెలుస్తోంది. ఇవి సాధారణ వినియోగదారులకు అందుబాటులోకి రావాలంటే ఇంకొన్నాళ్లు వేచి చూడాల్సిందే.
Published by: Santhosh Kumar S
First published: September 22, 2020, 5:05 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading