• HOME
  • »
  • NEWS
  • »
  • TECHNOLOGY
  • »
  • WHATSAPP TO OFFER HEALTH INSURANCES BY YEAR END IN INDIA BA GH

WhatsApp update: వాట్సాప్ యూజర్లకు ఫేస్ బుక్ సర్ ప్రైజ్.. ఈ ఏడాది చివరిలోపే మీకు..

WhatsApp update: వాట్సాప్ యూజర్లకు ఫేస్ బుక్ సర్ ప్రైజ్.. ఈ ఏడాది చివరిలోపే మీకు..

ప్రతీకాత్మక చిత్రం

ఇటీవల ఫేస్‌బుక్ (Facebook) నిర్వహించిన ఫ్యూయల్ ఫర్ ఇండియా–2020 కార్యక్రమంలో వాట్సాప్ ఇండియా హెడ్ అభిజిత్ బోస్ మాట్లాడుతూ "మా వినియోగదారులు ఒకరితో ఒకరు కనెక్ట్ అవ్వడానికి, వారికి నమ్మకమైన, సురక్షితమైన సేవలను అందించడానికి కట్టుబడి ఉన్నాం.’’ అని అన్నారు.

  • Share this:
ప్రముఖ ఆన్లైన్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (WhatsApp) మరో రెండు కొత్త అప్డేట్లతో యూజర్ల ముందుకొస్తుంది. ఇటీవలే డిజిటల్ పేమెంట్ రంగంలోకి అడుగు పెట్టిన వాట్సాప్.. ‘వాట్సాప్ పే’ అనే కొత్త సర్వీసులను ప్రారంభించిన విషయం తెలిసిందే. కాగా, ‘వాట్సాప్ పే’ ద్వారా ఈ ఏడాది చివరివరకు మైక్రో ఆరోగ్య బీమా ను కొనుగోలు చేసే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు తెలిపింది. ఇందులో భాగంగా ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్తో ఒప్పందం కుదుర్చుకుంది. భారతదేశంలోని వినియోగదారులకు మరిన్ని ఫైనాన్షియల్ సొల్యూషన్లను అందుబాటులోకి తేవడంలో భాగంగానే ఈ ప్రయత్నం చేస్తున్నట్లు వాట్సాప్ స్పష్టం చేసింది. ఇందులో భాగంగా ఈ ఏడాది చివరి వరకు ‘సాచెట్-సైజ్" ఆరోగ్య బీమాను తమ ప్లాట్‌ఫామ్ ద్వారా కొనుగోలు చేయడానికి వీలు కల్పిస్తున్నట్లు పేర్కొంది. దీనితో పాటు యూజర్లకు మరో అప్డేట్ను అందించింది. యూపీఐ చెల్లింపుల విధానం ఉపయోగించి పేమెంట్స్ ఫీచర్ ప్రారంభించేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ నుంచి గత నెలలో అనుమతి లభించిందని, దీన్ని ఉపయోగించి ఇకపై తమ యూజర్లు యూపీఐ విధానంలో పరస్పరం నగదు బదిలీ చేసుకోవచ్చని స్పష్టం చేసింది. దీనికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్‌డిఎఫ్‌సి (HDFC), ఐసీఐసీఐ (ICICI), యాక్సిస్ బ్యాంక్ (Axis Bank ) లు మద్ధతు ఇవ్వనున్నట్లు పేర్కొంది. ఈ బ్యాంకింగ్ భాగస్వాముల సహకారంతో దేశవ్యాప్తంగా 20 మిలియన్ల మంది వినియోగదారులకు వాట్సాప్ ద్వారా యూపీఐ (UPI) చెల్లింపులు అందుబాటులోకి వస్తాయని ఫేస్‌బుక్ యాజమాన్యంలోని వాట్సాప్ సంస్థ పేర్కొంది.

యూపీఐ ద్వారా నగదు బదిలీ సేవలు ప్రారంభం
ఇటీవల ఫేస్‌బుక్ (Facebook) నిర్వహించిన ఫ్యూయల్ ఫర్ ఇండియా–2020 కార్యక్రమంలో వాట్సాప్ ఇండియా హెడ్ అభిజిత్ బోస్ మాట్లాడుతూ " ప్రపంచవ్యాప్తంగా 400 మిలియన్లకు పైగా క్రియాశీల వినియోగదారులను కలిగి ఉన్న వాట్సాప్‌కు భారతదేశం అతిపెద్ద మార్కెట్. మా వినియోగదారులు ఒకరితో ఒకరు కనెక్ట్ అవ్వడానికి, వారికి నమ్మకమైన, సురక్షితమైన సేవలను అందించడానికి కట్టుబడి ఉన్నాం.’’ అని అన్నారు. కాగా ఎస్బీఐ నూతనంగా అందుబాటులోకి తెస్తున్న ఆరోగ్య బీమా కొనుగోలు ఈ ఏడాది చివరి వరకు వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. దీనితో పాటు త్వరలోనే హెచ్డీఎఫ్సీ పెన్షన్, పిన్బాక్స్ సొల్యూషన్లను కూడా అందించాలని వాట్సాప్ భావిస్తోంది. అంతేకాక, భారత్లో చిన్న వ్యాపారుల వ్యవస్థను డిజిలీకరణ చేయాలని నిర్ణయించింది. దీని ద్వారా తమ కస్టమర్లు వారికి నచ్చిన వ్యాపారుల నుండి వస్తువులు, సేవలను కొనుగోలు చేసేందకు వీలు కల్పించనున్నట్లు వాట్సాప్ తెలిపింది.
Published by:Ashok Kumar Bonepalli
First published: