మీరు వాట్సప్‌లో స్టేటస్ ఫీచర్ వాడుతున్నారా? గంటకోసారి స్టేటస్ మార్చడం మీకు అలవాటా? అయితే మీకు కొత్త సంవత్సరంలో బ్యాడ్ న్యూసే. అవును... ఇన్నాళ్లూ అసలు ఎలాంటి యాడ్స్ లేని
వాట్సప్‌లో ఇకపై అడ్వర్టైజ్మెంట్లు కనిపించనున్నాయి. అది కూడా మీరు తరచూ అప్డేట్ చేసే స్టేటస్ ఫీచర్లో యాడ్స్ దర్శనమివ్వనున్నాయి. ప్రపంచంలో ఫుల్ డిమాండ్ ఉన్న మెసేజింగ్ యాప్
వాట్సప్ అన్న మాటను ఎవరూ కాదనలేరు. ఈ యాప్‌కు ఇంత డిమాండ్ ఉండటానికి కారణం... మొదటి నుంచి వాట్సప్‌లో యాడ్స్ లేకపోవడమే. ఏ యాప్ ఉపయోగించినా యాడ్స్ యూజర్లకు డిస్టర్బెన్స్‌గా ఉంటాయి. కానీ... వాట్సప్‌లో ఆ సమస్య ఉండేది కాదు. యాడ్స్ లేవు కాబట్టే
వాట్సప్ మెసెంజర్‌కు ఆ క్రేజ్. కానీ ఇకపై వాట్సప్‌లోనూ యాడ్స్ కనిపిస్తాయి. స్టేటస్ ఫీచర్లో యాడ్స్ చూపించేందుకు వాట్సప్ అంతా సిద్ధం చేసింది.
"మేము స్టేటస్‌లో యాడ్స్ చూపించబోతున్నాం. వాట్సప్ ద్వారా వ్యాపారాలు ప్రజలకు చేరువయ్యేందుకు ప్రైమరీ మానెటైజేషన్ మోడ్‌లో యాడ్స్ ఉండబోతున్నాయి" అని వాట్సప్ ఉపాధ్యక్షుడు క్రిస్ డేనియల్స్ తాజాగా వెల్లడించారు. ప్రస్తుతం
వాట్సప్ ఐఓఎస్, ఆండ్రాయిడ్, పీసీ, విండోస్ ఫోన్లల్లో అందుబాటులో ఉంది. ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో వస్తున్నట్టుగానే వాట్సప్ స్టేటస్‌లో యాడ్స్ కనిపిస్తాయి. వాట్సప్‌ని ఫేస్బుక్ సొంతం చేసుకున్న తర్వాత ఈ మెసేజింగ్ యాప్‌పైనా యాడ్ రెవెన్యూపై కన్నేశాయి. నాలుగైదేళ్లుగా ప్రయత్నాలు సాగుతున్నాయి. ఇప్పుడు వాట్సప్‌లో యాడ్స్‌ని ఫేస్‌బుక్‌కు చెందిన అడ్వర్టైజింగ్ వ్యవస్థే నడిపించనుంది. అయితే యాడ్స్ చూపించడం ప్రైవసీని భంగపర్చడమే అన్న వాదన వినిపిస్తోంది. అయితే ఎండ్ టూ ఎండ్ ఎన్క్రిప్షన్ ఉన్నందున మీ డేటాకు ఎలాంటి ఢోకా లేదన్నది
వాట్సప్ వాదన. డేటాను యాక్సెస్ చేయకుండా యాడ్స్ చూపించడం సాధ్యం కాదన్న మరో వాదన ఉంది. మరి వీటిపై వాట్సప్ నుంచే స్పష్టత రావాలి.
ఇవి కూడా చదవండి:
ఈ ఫోన్లల్లో వాట్సప్ పనిచేయదు... ఆ లిస్ట్‌లో మీ ఫోన్ ఉందా?
వాట్సప్ స్టిక్కర్స్ వాడుతున్నారా? మీకు బ్యాడ్ న్యూస్
మీ వాట్సప్ డేటా ఇలా బ్యాకప్ చేసుకోండి!
మీ వాట్సప్ హ్యాక్ అయిందా?