WhatsApp Group: వాట్సప్ గ్రూప్‌లో యాడ్ చేయాలంటే మీ పర్మిషన్ తప్పనిసరి

WhatsApp Group Invitation | మీ అనుమతి ఉంటే తప్ప మిమ్మల్ని వాట్సప్ గ్రూప్‌లో యాడ్ చేయలేరు. ఇందుకోసం గ్రూప్ అడ్మిన్ తమ వాట్సప్‌ గ్రూప్‌లో చేరాలంటూ మీకు గ్రూప్ ఇన్విటేషన్ పంపిస్తారు. ఆ ఇన్విటేషన్ 72 గంటలు మాత్రమే యాక్టీవ్‌గా ఉంటుంది.

news18-telugu
Updated: February 17, 2019, 7:59 AM IST
WhatsApp Group: వాట్సప్ గ్రూప్‌లో యాడ్ చేయాలంటే మీ పర్మిషన్ తప్పనిసరి
WhatsApp Feature: వాట్సప్‌లో త్వరలో 'గ్రూప్ ఇన్విటేషన్ ఫీచర్'
  • Share this:
వాట్సప్‌‌ గ్రూప్స్ మీకు తలనొప్పిగా మారాయా? మీకు ఇష్టం లేకపోయినా అందరూ గ్రూపుల్లో యాడ్ చేస్తున్నారా? ఇకపై ఇలా ఎవరంటే వాళ్లు వాట్సప్ గ్రూప్‌లో మిమ్మల్ని యాడ్ చేయడానికి వీల్లేదు. ఎవరైనా మిమ్మల్ని గ్రూప్‌లో యాడ్ చేయాలంటే ముందుగా మీ పర్మిషన్ తప్పనిసరి. యూజర్లకు వాట్సప్ తీసుకొస్తున్న మరో అద్భుతమైన ఫీచర్ ఇది. ప్రస్తుతం ఎవరైనా ఎవరి నెంబర్ అయినా గ్రూప్‌లో యాడ్ చేసే అవకాశం ఉంది. పర్మిషన్ కూడా అవసరం లేదు. కానీ వాట్సప్ గ్రూప్స్ యూజర్లకు చాలా సమస్యగా మారాయి. ఒకసారి గ్రూప్‌లో యాడ్ చేసిన తర్వాత ఎగ్జిట్ అయితే ఏమనుకుంటారో అని ఆలోచించాల్సి వస్తోంది. దీంతో ఒక్కొక్కరు పదుల సంఖ్యల్లో గ్రూపుల్లో ఉండాల్సిన పరిస్థితి ఉంది. ఇకపై మాత్రం మీకు ఆ ఇబ్బంది ఉండదు.

Read this: PAN Card: మీ పాన్ కార్డులో తప్పులున్నాయా? ఇలా చేయండి

technology news, Whatsapp, whatsapp group, WhatsApp Group Update, Whatsapp news, WhatsApp privacy update, whatsapp update, WhatsApp Android, WhatsApp group invite,Whatsapp groups, వాట్సప్ గ్రూప్, వాట్సప్ గ్రూప్ ఇన్విటేషన్, వాట్సప్ ఫీచర్

గ్రూప్ ఇన్విటేషన్ ఫీచర్ ఎలా పనిచేస్తుంది?


గ్రూప్ ఇన్విటేషన్ పేరుతో వాట్సప్ తీసుకొస్తున్న ఫీచర్ ఇది. త్వరలో ఈ ఫీచర్ అందరికీ అందుబాటులోకి రానుంది. WhatsApp Settings > Account > Privacy > Groups సెక్షన్‌లో మీకు మూడు ఆప్షన్స్ Everyone, My Contacts, Nobody అని కనిపిస్తాయి. ఇందులో ‘Everyone’ ఎంచుకుంటే ఎవరైనా మిమ్మల్ని గ్రూప్‌లో యాడ్ చేయొచ్చు. కేవలం ‘My Contacts’ ఎంచుకుంటే మీ కాంటాక్ట్స్‌లో ఉన్నవాళ్లు మాత్రమే మిమ్మల్ని గ్రూప్‌లో యాడ్ చేయగలరు. ఒకవేళ మీరు ‘Nobody’ అని సెలెక్ట్ చేసుకుంటే... మీ అనుమతి ఉంటే తప్ప మిమ్మల్ని వాట్సప్ గ్రూప్‌లో యాడ్ చేయలేరు. ఇందుకోసం గ్రూప్ అడ్మిన్ తమ వాట్సప్‌ గ్రూప్‌లో చేరాలంటూ మీకు గ్రూప్ ఇన్విటేషన్ పంపిస్తారు. ఆ ఇన్విటేషన్ 72 గంటలు మాత్రమే యాక్టీవ్‌గా ఉంటుంది. మీరు ఇన్విటేషన్ యాక్సెప్ట్ చేస్తేనే గ్రూప్ అడ్మిన్ మిమ్మల్ని తన గ్రూప్‌లో యాడ్ చేయడానికి అవకాశముంటుంది.

Photos: సముద్రం మధ్యలో సూపర్ మార్కెట్... ఎలా ఉందో చూడండి
ఇవి కూడా చదవండి:

Good News: షావోమీ స్మార్ట్‌ఫోన్లకు డార్క్ మోడ్...

FAKE MI STORE: షావోమీ పేరుతో భారీ స్కామ్... మీరూ మోసపోకండి
First published: February 17, 2019, 7:58 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading