వాట్సాప్ కొత్త ఫీచర్ వచ్చేసింది... ఇక అనుమతి లేకుండా గ్రూపుల్లో యాడ్ చేయలేరు...

ప్రయోగాత్మకంగా అమలులోకి తెచ్చిన వాట్సాప్... కొద్దిరోజుల్లో పూర్తి అప్‌డేట్‌ను అందరికీ అందుబాటులోకి... మీ అనుమతి లేకుండా ఏ గ్రూప్‌లో కలుపుకోలేరు...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: March 12, 2019, 3:56 AM IST
వాట్సాప్ కొత్త ఫీచర్ వచ్చేసింది... ఇక అనుమతి లేకుండా గ్రూపుల్లో యాడ్ చేయలేరు...
వాట్సాప్ లోగో
Chinthakindhi.Ramu | news18-telugu
Updated: March 12, 2019, 3:56 AM IST
WhatsApp: సోషల్ మీడియా యాప్ వాట్సాప్ వినియోగదారులు చాలాకాలంగా ఆతృతగా ఎదురుచూస్తున్న ‘గ్రూప్ ఇన్విటేషన్’ ఫీచర్ వచ్చేసింది. అయితే ఇంకా పూర్తి వెర్షన్ అందుబాటులోకి రాకపోవడంతో ప్రయోగాత్మకంగా బీటా వర్షన్ వాట్సాప్ వాడుతున్న ఆండ్రాయిడ్ ఫోన్ వినియోగదారులకు ఇది అందుబాటులోకి వచ్చింది. మీ ఫోన్‌లో బీటా వర్షన్ వాట్సాప్ ఉన్నట్లయితే ‘గ్రూప్ ఇన్విటేషన్’ ఫీచర్‌ను ఎంచక్కా వాడుకోవచ్చు. ప్రస్తుతం ప్రయోగాత్మకంగా అమలులోకి తెచ్చిన వాట్సాప్... కొద్దిరోజుల్లో పూర్తి అప్‌డేట్‌ను అందరికీ అందుబాటులోకి తేనుంది. ఇన్నిరోజులు మన అనుమతి లేకుండానే, అంత మాటకొస్తే మనకు తెలియకుండా మన నెంబర్‌ను అనేక గ్రూప్‌ల్లో కలుపుకుంటూ పోయేవాళ్లు అడ్మిన్. అడ్మిన్ స్టేటస్ ఉంటే చాలు... నచ్చినంతమందిని గ్రూప్‌లో యాడ్ చేసే అవకాశం ఉండేది. కొన్నిసార్లు గ్రూప్‌లో ఉండడం ఇష్టంలేకపోయినా... కలిపిన వ్యక్తి స్నేహితుడో, బంధువో అవ్వడం వల్ల ఎగ్జిట్ అయితే నొచ్చుకుంటారని భావించేవాళ్లు కొందరు.

కొందరు గ్రూప్‌ల్లో వచ్చే సంభాషణలు, మెసేజ్‌లు నచ్చక మ్యూట్ కూడా చేసేవాళ్లు. ఇకపై అలాంటి ఇబ్బందులు పడాల్సిన అవసరం ఉండదు. కొత్తగా వచ్చిన గ్రూప్ ఇన్విటేషన్ ఆప్షన్ వినియోగించుకోవాలంటే... Settingsలో యాక్టివిట్ చేసుకోవాల్సి ఉంటుంది. Settings లోకి వెళ్లాక Account సెలక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత Privacy లోకి వెళ్లి... Groups ఎంచుకోవాలి. అక్కడ Who Can ADD me to Groups అనే ఆప్షన్ కనిపిస్తుంది.

Whatsapp, whatsapp features, whatsapp group invitation feature, whatsapp Group, WhatsAPp Grou Invitation Features how to use, whatsapp new rules, whats app rules in india, whatsapp tricks, whatsapp video status, whatsapp hacks, whats app status, whatsapp settings, వాట్సాప్, వాట్సాప్ కొత్త ఫీచర్, వాట్సాప్ గ్రూపులు, వాట్సాప్ గ్రూప్ ఇన్విటేషన్ ఫీచర్, వాట్సాప్ గ్రూపుల్లో కొత్త సెట్టింగులు, వాట్సాప్ ట్రిక్స్, వాట్సాప్ స్టేటస్‌ ఫోటోలు వీడియోలు
నచ్చకపోతే గ్రూప్ ఇన్విటేషన్ రిజెక్ట్ చేయవచ్చు..


దీన్ని ఎంచుకుంటే... మూడు ఎంపికలు వస్తాయి. అవి Every One, My Contracts, No body.Every One: మిమ్మల్ని ఎవ్వరైనా ఏ గ్రూప్‌లోనైనా కలుపుకోవాలని అనుకుంటే... దీన్ని ఎంచుకోవాలి.

My Contracts: కేవలం మీ ఫోన్‌లో సేవ్ అయిన కాంట్రాక్ట్స్‌లో ఉన్నవారు మాత్రమే గ్రూప్‌ల్లో కలుపుకోవాలనుకుంటే ఈ ఆప్షన్ ఎంచుకోవాలి.

No body: మీ అనుమతి లేకుండా ఎవ్వరూ మిమ్మల్ని ఏ గ్రూప్‌లో యాడ్ చేసుకోవడానికి వీలులేదనుకుంటే ఇది ఎంచుకోవాలి. ఇది ఎంచుకుంటే ఎవ్వరూ మిమ్మల్ని మీ అనుమతి లేకుండా ఏ గ్రూప్‌లో కలుపుకోలేరు. ఎవ్వరైనా మిమ్మల్ని గ్రూప్‌లో యాడ్ చేసుకోవాలని భావిస్తే... ‘Group Invitation Request’ వస్తుంది. ఈ రిక్వెస్ట్ వచ్చిన 72 గంటల్లో Accept చేయాల్సి ఉంటుంది. లేదంటే ఇన్విటేషన్ Expire అవుతుంది.
First published: March 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...