WhatsApp: వాట్సాప్ పేమెంట్స్ వాడేవారికి గుడ్ న్యూస్.. త్వరలోనే వారికి బంపర్ ఆఫర్

ప్రతీకాత్మక చిత్రం

వాట్సాప్ కొత్త క్యాష్‌బ్యాక్ ఫీచర్‌ను అభివృద్ధి చేస్తోందని Wabetainfo వెల్లడించింది. దీనికి సంబంధించి వాట్సాప్ కమ్యూనిటీ బ్లాగ్ ఇప్పటికే ఒక స్క్రీన్ షాట్‌ను కూడా పోస్ట్ చేసింది.

  • Share this:
ప్రముఖ మెసేజింగ్ అప్లికేషన్ వాట్సాప్‌ ఎప్పటికప్పుడు సరికొత్త సేవలను అందుబాటులోకి తెస్తోంది. ఇప్పటికే ఎన్నో అద్భుతమైన ఫీచర్లను పరిచయం చేసి యూజర్లను బాగా ఆకట్టుకుంది. తమ సేవలను మరింత విస్తరించేందుకు గత ఏడాదిలో పేమెంట్స్ ఫీచర్‌ను భారత్‌లో యూజర్స్‌కి అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ద్వారా సురక్షితంగా, వేగంగా చెల్లింపులు జరపవచ్చని వాట్సాప్ పేర్కొంది. అయితే ఇప్పుడు వాట్సాప్.. పేమెంట్స్ ఫీచర్‌ని యూజ్ చేసే భారతీయ యూజర్లకు క్యాష్‌బ్యాక్‌ను ఆఫర్ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఇందుకు వీలుగా ఓ కొత్త ఫీచర్‌ని తీసుకొచ్చేందుకు వాట్సాప్ డెవలపర్లు కృషి చేస్తున్నారు.

వాట్సాప్ కొత్త క్యాష్‌బ్యాక్ ఫీచర్‌ను అభివృద్ధి చేస్తోందని Wabetainfo వెల్లడించింది. దీనికి సంబంధించి వాట్సాప్ కమ్యూనిటీ బ్లాగ్ ఇప్పటికే ఒక స్క్రీన్ షాట్‌ను కూడా పోస్ట్ చేసింది. ఇందులో.. వాట్సాప్ చాట్ విండో టాప్ ప్లేస్ లో కొత్త క్యాష్‌బ్యాక్ బ్యానర్‌ను మనం గమనించవచ్చు. "మీ తదుపరి పేమెంట్స్ పై క్యాష్‌బ్యాక్ పొందండి. ప్రారంభించడానికి బ్యానర్‌పై క్లిక్ చేయండి" అని ఆ బ్యానర్‌లో కనిపించింది. మరి మెసేజింగ్ యాప్‌ను ఉపయోగించి మొదటి పేమెంట్ చేసే యూజర్లు మాత్రమే క్యాష్‌బ్యాక్ పొందుతారా..? లేదంటే గతంలో పేమెంట్స్ జరిపిన యూజర్లు కూడా క్యాష్‌బ్యాక్ పొందుతారా..? అనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది.

ఈ ఫీచర్ గురించి వాట్సాప్ త్వరలోనే అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. ఈ ఫీచర్ వినియోగించి భారతదేశంలోని యూపీఐ (UPI) పేమెంట్స్ మాత్రమే చేయగలమని యూజర్లు గమనించాలి. యూజర్లు కేవలం ఒక్కసారే క్యాష్‌బ్యాక్ పొందగలరని.. అది కూడా రూ. 10 వరకే క్యాష్‌బ్యాక్ పొందగలరని Wabetainfo నివేదిక తెలిపింది. పేమెంట్స్ చేసిన యూజర్లకు 48 గంటల్లో లభిస్తుందని ఈ నివేదిక పేర్కొంది. అయితే ఈ ఫీచర్ అధికారికంగా రిలీజ్ అయిన తర్వాత క్యాష్‌బ్యాక్ అమౌంట్, క్యాష్‌బ్యాక్ పొందగలిగే సంఖ్య మారే అవకాశం ఉంది.

ప్రస్తుతం ఈ ఫీచర్ ప్రయోగదశలో ఉంది. అందువల్ల ఇప్పటివరకైతే.. బీటా యూజర్లు దీనిని టెస్ట్ చేయడానికి వీలుపడదు. అయితే, వాట్సాప్ స్టాండర్డ్ ఫీచర్ రిలీజ్ చేసిన తర్వాత భారతదేశంలోని వినియోగదారులు తమ పేమెంట్స్ పై క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. వాట్సాప్ సంస్థ ఈ ఫీచర్ గురించి ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. కనుక యూజర్లు స్పష్టత కొరకు కొంత సమయం వరకు వెయిట్ చేయాల్సిందే.

వాట్సాప్.. ఎమోజీ, స్టిక్కర్‌లను గ్రూప్ ఇమేజెస్ గా మార్చేందుకు వీలుగా గ్రూప్ ఐకాన్ ఎడిటర్ ఫీచర్ తీసుకురావడానికి కూడా సిద్ధమైంది. ఇవన్నీ ఇంకా టెస్టింగ్ దశలోనే ఉన్నాయి కాబట్టి బీటా యూజర్లు కూడా వీటిని యాక్సెస్ చేయలేరు. వాట్సాప్ త్వరలో చాట్ షేర్ షీట్ నుంచి "మెసెంజర్ రూమ్స్" షార్ట్ కట్ ను రిమూవ్ చేయనుంది. మెసెంజర్ రూమ్‌లు ఫేస్ బుక్ లో గ్రూప్ కాల్‌లో చేరడానికి 50 మంది యూజర్లను అనుమతించాయి. కానీ ఈ ఫీచర్ పై సర్వత్రా అసంతృప్తే వ్యక్తమైంది. అందుకే ఈ మెసెంజర్ రూమ్స్ షార్ట్ కట్ ను రిమూవ్ చేసే పనిలో నిమగ్నమైంది వాట్సాప్. వాట్సాప్ ఐఓఎస్ బీటా వెర్షన్ 2.21.190.11 లో మెసెంజర్ రూమ్స్ ఫీచర్ ని రిమూవ్ చేసేసింది. ఆండ్రాయిడ్ బీటా వెర్షన్ 2.21.19.15 కూడా ఈ ఫీచర్ ను తొలగించింది.
First published: