వాట్సప్‌లో మూడు కొత్త ఫీచర్స్!

గూగుల్ ప్లే బీటా ప్రోగ్రామ్‌లో కొత్త ఫీచర్స్‌తో అప్‌డేట్స్ ఇవ్వనుంది వాట్సప్. అందులో మూడు ఫీచర్లు యూజర్లను ఆకట్టుకోనున్నాయి.

news18-telugu
Updated: September 17, 2018, 3:07 PM IST
వాట్సప్‌లో మూడు కొత్త ఫీచర్స్!
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఎప్పటికప్పుడు కొత్త అప్‌డేట్స్, ఫీచర్స్‌తో యూజర్లకు కొత్త ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంటుంది వాట్సప్. ఇప్పుడు ఆండ్రాయిడ్ డివైజ్‌లకు మరిన్ని కొత్త ఫీచర్స్ రానున్నాయి. ఆ ఫీచర్స్ ఏంటో తెలుసుకోండి.

స్వైప్ టు రిప్లై

ఇది యూజర్లు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఫీచర్. 'స్వైప్ టు రిప్లై' కొన్ని యాప్స్‌లో ఉంది. అయితే వాట్సప్‌ యూజర్లు ఎక్కువ కాబట్టి 'స్వైప్ టు రిప్లై' ఎంతో ఉపయోగపడనుంది. రిసీవ్ చేసుకున్న మెసేజ్‌‌కు రిప్లై ఇవ్వాలంటే వాట్సప్‌ ఓపెన్ చేయక్కర్లేదు. కేవలం మెసేజ్‌ని కుడి వైపు స్వైప్ చేస్తే చాలు. రిప్లై ఆప్షన్ వస్తుంది. ఈ ఫీచర్ ఇప్పటికే ఐఓఎస్ డివైజ్‌లల్లో ఉంది. ఆండ్రాయిడ్‌ ఫోన్లకు లేదు. త్వరలో ఆండ్రాయిడ్‌ ఫోన్లలో 'స్వైప్ టు రిప్లై' ఫీచర్ అందుబాటులోకి రానుంది.

డార్క్ మోడ్
ఇది మరో ఫీచర్. వాట్సప్‌ ఎప్పుడూ ఒకే థీమ్‌తో ఉంటుంది. థీమ్ మార్చాలంటే థర్డ్ పార్టీ యాప్స్ ఉపయోగించాల్సి వస్తుంది. ట్విట్టర్, యూట్యూబ్‌లాగా వాట్సప్‌లో కూడా ఇకపై డార్క్ మోడ్ రానుంది. ఇప్పటికీ ట్విట్టర్, యూట్యూబ్‌లో ఉన్న కొన్ని ఫీచర్లను వాట్సప్‌ కూడా తన యాప్‌లో అందిస్తోంది.

గ్రూప్ ఛాట్స్
గ్రూప్ ఛాట్స్‌కు మరిన్ని కొత్త ఫీచర్లు అందించనుంది వాట్సప్. ఇటీవలే గ్రూపు సభ్యులు వాట్సప్ గ్రూప్‌లో మెసేజెస్ పంపించకుండా అడ్మిన్ నిషేధించే ఫీచర్‌ని అందించింది వాట్సప్. దీంతో పాటు గ్రూప్ ఛాట్స్‌లో మరిన్ని మార్పులు చేయనుంది వాట్సప్.వాట్సప్‌ యాప్‌ను ఇండియాలో 20 కోట్ల మంది ఉపయోగిస్తున్నారు. యాప్‌లో ఫ్రెష్ లుక్ ఇచ్చేందుకు యూజర్లకు ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ ఇస్తోంది వాట్సప్. ఈ ఏడాది కూడా ఈ సరికొత్త ఫీచర్స్‌ని అందుబాటులోకి తీసుకురానుంది. గూగుల్ ప్లే బీటా ప్రోగ్రామ్‌లో కొత్త ఫీచర్స్‌తో అప్‌డేట్స్ ఇవ్వనుంది వాట్సప్.

ఇవి కూడా చదవండి:

మీరు వాట్సప్ 'డిఫాల్ట్' అడ్మినా?: తేడా వస్తే జైలుకే!

వాట్సప్ లేటెస్ట్ ఫీచర్స్ చూశారా?

మీరు ఎక్కాల్సిన రైలు ఎక్కడ ఉంది?: వాట్సప్ చెప్పేస్తుంది!

తేడా వస్తే వాట్సప్, ఫేస్‌బుక్ బ్లాక్!

వాట్సప్ కొత్త ఫీచర్‌తో మీకు షాకే!

మీ వాట్సప్ హ్యాక్ అయిందా?

మీ వాట్సప్ డేటా ఇలా బ్యాకప్ చేసుకోండి!

జియో ఫోన్‌లో వాట్సప్ వచ్చేసింది!
Published by: Santhosh Kumar S
First published: September 17, 2018, 11:44 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading