WHATSAPP TO ADD TWO STEP VERIFICATION ON WEB VERSION AND DESKTOP UPDATE VOICE CALLING INTERFACE MK
WhatsApp Web: వాట్సప్ డెస్క్ టాప్ యూజర్లకు గుడ్ న్యూస్, ఇకపై రెండు కొత్త ఫీచర్లతో మరింత సెక్యూర్..
ప్రతీకాత్మక చిత్రం
Whatsapp New Features : మెటా( Facebook) ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌లో త్వరలో కొత్త ఫీచర్ రాబోతోంది. మార్కెట్లోని టెక్ వార్త సోర్స్ ల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం, త్వరలోనే వాట్సప్ వెబ్ వెర్షన్ , డెస్క్‌టాప్ యాప్‌లో కూడా 2 స్టెప్ వెరిఫికేషన్ జోడించబోతోంది.
Whatsapp New Features : మెటా( Facebook) ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌లో త్వరలో కొత్త ఫీచర్ రాబోతోంది. మార్కెట్లోని టెక్ వార్త సోర్స్ ల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం, త్వరలోనే వాట్సప్ వెబ్ వెర్షన్ , డెస్క్‌టాప్ యాప్‌లో కూడా 2 స్టెప్ వెరిఫికేషన్ జోడించబోతోంది. WAbetaInfo , నివేదిక ప్రకారం WhatsApp త్వరలోనే 2 స్టెప్ వెరిఫికేషన్ ఫీచర్‌ను వెబ్ వెర్షన్ , డెస్క్‌టాప్ వెర్షన్ జోడించాలని యోచిస్తోంది. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్ కూడా బయటకు వచ్చింది. వెబ్ , డెస్క్‌టాప్ వెర్షన్ల కోసం 2 స్టెప్ వెరిఫికేషన్ ఫీచర్‌ను ప్రారంభించవచ్చు అని ఆ స్క్రీన్‌షాట్ ద్వారా స్పష్టంగా అర్థం అవుతోంది. WABetaInfo నివేదిక ప్రకారం, WhatsApp వినియోగదారులు వెబ్ , డెస్క్‌టాప్‌లో కూడా 2 స్టెప్ వెరిఫికేషన్ ఫీచర్‌ను ఉపయోగించవచ్చు. ఇది మీ అకౌంట్ ను రీసెట్ చేయడానికి ఉపయోగపడుతుంది.
WhatsApp మొబైల్ యాప్‌లో 2 స్టెప్ వెరిఫికేషన్ ఇప్పటికే అందుబాటులో ఉంది. వినియోగదారులు తమ ఫోన్ నంబర్‌ను నమోదు చేసుకున్న తర్వాత పిన్ను నమోదు చేయాలి. వినియోగదారులు పిన్ గుర్తులేకపోతే ఇమెయిల్ సహాయంతో తమ ఖాతాను రీసెట్ చేసుకోవచ్చు. వాట్సాప్ రిజిస్టర్డ్ ఇమెయిల్‌కి రీసెట్ లింక్‌ను పంపుతుంది. దీనితో పాటు, ఇది వినియోగదారు ఖాతాను సురక్షితంగా ఉంచడంలో కూడా సహాయపడుతుంది.
మొబైల్ 2 స్టెప్ వెరిఫికేషన్ ను ఎలా ఆన్ చేయాలి
>> యూజర్ ముందుగా సెట్టింగ్‌లకు వెళ్లాలి
>> ఇక్కడ వారు అకౌంట్> 2 స్టెప్ వెరిఫికేషన్ > ప్రారంభించుపై క్లిక్ చేయాలి
>> దీని తర్వాత వారు 6 అంకెల కోడ్‌ను నమోదు చేసి దానిని నిర్ధారించాలి.
>> మీరు కావాలనుకుంటే మీ ఇమెయిల్‌ను కూడా ఇక్కడ జోడించవచ్చు. ఇది మీ ఖాతాను మరింత సురక్షితంగా చేస్తుంది.
>> నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత, మీకు కన్ఫర్మ్ ఇమెయిల్ అనే ఆప్షన్ వస్తుంది, ఆ తర్వాత మీరు సేవ్ లేదా డన్పై క్లిక్ చేయాలి.
అంతేకాదు వాట్సాప్ త్వరలోనే వాయిస్ కాలింగ్ ఇంటర్ఫేస్ను రీడిజైన్ చేస్తోంది, ఇది మరింత కాంపాక్ట్ ఆధునికంగా మారనుంది.
Published by:Krishna Adithya
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.