Home /News /technology /

WHATSAPP TO ADD TWO STEP VERIFICATION FOR DESKTOP USERS GH VB

WhatsApp: డెస్క్‌టాప్ వెర్షన్‌లో వాట్సాప్ లాగిన్ అవుతున్నారా..? అయితే ఇది తప్పక తెలుసుకోండి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

యాప్‌తో పాటు డెస్క్‌టాప్ వెర్షన్‌లోనూ అనేక కొత్త అప్‌డేట్స్ అందుబాటులోకి తీసుకువస్తోంది షార్ట్ మెసేజింగ్ ప్లాట్‌ఫాం వాట్సాప్. తాజాగా వాట్సాప్ డెస్క్‌టాప్ యూజర్ల కోసం టూ-స్టెప్ వెరిఫికేషన్ ఫీచర్‌ను పరిచయం చేయనున్నట్లు తెలుస్తోంది.

యాప్‌(App)తో పాటు డెస్క్‌టాప్ వెర్షన్‌లోనూ(Desktop Version) అనేక కొత్త అప్‌డేట్స్ అందుబాటులోకి తీసుకువస్తోంది షార్ట్ మెసేజింగ్ ప్లాట్‌ఫాం వాట్సాప్ (Whatsapp). తాజాగా వాట్సాప్ డెస్క్‌టాప్ యూజర్ల కోసం టూ-స్టెప్ వెరిఫికేషన్ ఫీచర్‌ను పరిచయం చేయనున్నట్లు తెలుస్తోంది. దీని ద్వారా డెస్క్‌టాప్ వెర్షన్ లాగిన్, ఆపరేషన్స్‌కు(Operations) మరింత భద్రత కల్పించడంతో పాటు అనధికారిక లాగిన్ నుంచి యూజర్లను రక్షించనుంది. ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే, వాట్సాప్ డెస్క్‌టాప్ యూజర్లకు ఆపరేషన్స్‌పై మరింత కంట్రోలింగ్ లభించనుంది. అయితే ఈ సెక్యూరిటీ ఫీచర్ ఆప్షనల్ మాత్రమే. అవసరం లేదనుకుంటే యూజర్లు దీన్ని ఆపేయవచ్చు. ఈ ఫీచర్ ఇంకా డెవలప్మెంట్ స్టేజ్‌లోనే ఉంది. ప్రస్తుతం యూజర్లు కొత్త స్మార్ట్‌ఫోన్ ద్వారా వాట్సాప్‌లోకి లాగిన్ అయితే, ఆటో జనరేటెడ్ ఆరు అంకెల నంబర్‌ కోడ్‌ను యాప్ అడుగుతుంది.

IGNOU: సామాజిక సేవను ఉద్యోగంగా మార్చే కోర్సు... మీరూ ఆన్‌లైన్‌లో చేయొచ్చు

ఈ నంబర్‌ను యాప్‌ మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు పంపిస్తుంది. డెస్క్‌టాప్ లాగిన్ కోసం వినియోగదారులు WhatsApp వెబ్ ఫార్మాట్‌ను ఓపెన్ చేయాలి. క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా డివైజ్‌ను లింక్ చేసిన తరువాత మీ వాట్సాప్ అకౌంట్‌లోని చాట్ లిస్ట్‌లు, ఫోటోలు, వీడియోలు అన్నీ వెబ్ బ్రౌజర్‌కు సింక్ అవుతాయి.

అయితే టూ-స్టెప్ వెరిఫికేషన్ ఫీచర్ అందుబాటులోకి వస్తే మాత్రం, యూజర్లు పిన్ ద్వారా వెబ్ వెర్షన్‌కు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. డెస్క్‌టాప్ వాట్సాప్ చాట్‌ యాక్సెస్‌ను మెరుగుపరచడానికి, అకౌంట్‌లోకి లాగిన్ అవ్వడానికి ఇకపై పర్సనల్ పిన్ నంబర్ అవసరమవుతుందని వాట్సాప్ ఫీచర్ ట్రాకర్ WABetaInfo తెలిపింది. “WhatsApp అన్ని డివైజ్‌లలో టూ-స్టెప్ వెరిఫికేషన్‌ మేనేజ్‌మెంట్‌ను సులభతరం చేయాలనుకుంటోంది. ఫ్యూచర్ అప్‌డేట్‌లో వెబ్/డెస్క్‌టాప్ క్లయింట్స్‌కు ఈ ఫీచర్‌ను పరిచయం చేసే పనిలో ఉంది" అని WABetaInfo వెల్లడించింది. ఈ ఫీచర్‌ అందుబాటులోకి వస్తే, డెస్క్‌టాప్ లేదా వెబ్ వాట్సాప్ యూజర్లకు మరింత సెక్యూరిటీకి భరోసా లభిస్తుంది. వెబ్/డెస్క్‌టాప్ వెర్షన్‌లో ఈ ఎడిషనల్ సెక్యూరిటీ ఫీచర్‌ను ఎనేబుల్ లేదా డిసేబుల్ చేయవచ్చు.

Flipkart Offers: అదిరిపోయే ఆఫర్లను ప్రకటించిన ఫ్లిప్​కార్ట్.. వాటిపై 80 శాతం డిస్కౌంట్..


మరోవైపు, వాట్సాప్ ఇటీవల వాయిస్​ నోట్స్​ను రివ్యూ అనే కొత్త ఫీచర్​ను బీటా టెస్టర్లకు పరిచయం చేసింది. ఈ ఫీచర్​ సాయంతో యూజర్లు వాయిస్ మెసేజ్​ పంపే ముందు, ఆ వాయిస్ నోట్స్‌ను రివ్యూ చేసుకోవచ్చు. ఈ ఫీచర్​ను సైతం డెస్క్‌టాప్ వెర్షన్​లకు అందుబాటులోకి తీసుకువచ్చింది వాట్సాప్. ఫీచర్ ట్రాకర్ WABetaInfo ఈ కొత్త అప్‌డేట్‌ గురించి పూర్తి వివరాలను, స్క్రీన్‌షాట్స్‌ను వెల్లడించింది. యాప్‌లో ఉన్న అన్ని ఫీచర్లను డెస్క్‌టాప్ వెర్షన్లకు తీసుకు వచ్చేందుకు వాట్సాప్ ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగా వాయిస్ నోట్స్ రివ్యూతో పాటు తాజాగా టూ-స్టెప్ వెరిఫికేషన్ ఫీచర్లపై దృష్టి సారించింది.
Published by:Veera Babu
First published:

Tags: Latest Technology, Whatsapp

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు