Home /News /technology /

WHATSAPP TIPS AND TRICKS HERES A QUICK GUIDE TO VIEW SOMEONES STATUS WITHOUT ACTUALLY LETTING THEM KNOW GH SRD

WhatsApp: మీ కాంటాక్ట్స్‌లో ఉన్నవారి వాట్సాప్ స్టేటస్‌ను సీక్రెట్‌ గా ఎలా చూడాలి..? స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇదే..

WhatsApp

WhatsApp

WhatsApp: వాట్సాప్‌లో ఇతరుల స్టేటస్ వ్యూ చేసినట్లు మీ కాంటాక్ట్స్‌కి తెలియకుండా, కాంటాక్ట్స్‌ వ్యూయర్స్‌ లిస్టులో మీ పేరు/నంబర్ కనిపించకుండా చేయడం చాలా ఈజీ. అదెలాగో స్టెప్-బై-స్టెప్ ఇప్పుడు తెలుసుకుందాం.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India
పాపులర్ మెసేజింగ్ యాప్స్‌లో వాట్సాప్ (WhatsApp) ఒకటి. అయితే వాట్సాప్‌ను వాడే వారు తమ లాస్ట్ సీన్, ప్రొఫైల్ పిక్ కనిపించకుండా దాచి పెడుతుంటారు. వాట్సాప్ వాడుతున్నట్లు తమ కాంటాక్ట్స్‌కి తెలియకుండా ఉండాలని అన్ని ప్రైవసీ సెట్టింగ్స్ మార్చేస్తుంటారు. కొందరు యూజర్లు తమ కాంటాక్ట్స్‌ పెట్టే స్టేటస్ (Status) తాము చూసినట్లు వారికి తెలియకుండా ఉండాలనుకుంటారు. కానీ స్టేటస్‌ని సీక్రెట్‌గా ఎలా వ్యూ చేయాలో చాలా మందికి తెలియకపోవచ్చు. నిజానికి మీరు స్టేటస్ వ్యూ చేసినట్లు మీ కాంటాక్ట్స్‌కి తెలియకుండా, కాంటాక్ట్స్‌ వ్యూయర్స్‌ లిస్టులో మీ పేరు/నంబర్ కనిపించకుండా చేయడం చాలా ఈజీ. అదెలాగో స్టెప్-బై-స్టెప్ ఇప్పుడు తెలుసుకుందాం.

* వాట్సాప్ స్టేటస్ సీక్రెట్‌గా ఎలా వ్యూ చేయాలి?
సీక్రెట్‌గా వాట్సాప్ స్టేటస్ చూడడానికి.. ఆండ్రాయిడ్, iOS యూజర్లు రీడ్‌ రిసిప్ట్స్‌ (Read Receipts) ఫీచర్‌ను డిసేబుల్ చేయాలి. లేదా స్టేటస్‌ను ఆఫ్‌లైన్‌లో వ్యూ చేయాలి. లేదంటే మీ ఫోన్‌లో హిడెన్ వాట్సాప్ స్టేటస్ ఫోల్డర్‌ను చెక్ చేసినా సరిపోతుంది.

* వాట్సాప్‌లో రీడ్ రిసిప్ట్స్‌ ఎలా ఆఫ్ చేయాలి?
మెసేజ్‌లకు డబుల్ బ్లూ టిక్‌ మార్క్స్ కనిపించకుండా వాట్సాప్ యూజర్లు రీడ్ రిసిప్ట్స్‌ ఆఫ్ చేస్తుంటారు. దీనిని ఆఫ్ చేయడం వల్ల యూజర్ల పేర్లు వారి కాంటాక్ట్స్‌ స్టేటస్ వ్యూ లిస్ట్‌లో కూడా కనిపించదు. మరి రీడ్ రిసిప్ట్స్‌ ఎలా డిసేబుల్ చేయాలో తెలుసుకుందాం.

- మొదటగా ఫోన్‌లో వాట్సాప్ ఓపెన్ చేయాలి.

- టాప్ రైట్ కార్నర్‌లో ఉన్న త్రీ డాట్స్‌ మెనూపై క్లిక్ చేయాలి.

- సెట్టింగ్స్‌పై నొక్కి అకౌంట్ (Account) సెక్షన్‌పై ట్యాప్ చేయాలి.

- ప్రైవసీని సెలెక్ట్ చేసుకొని.. రీడ్ రిసిప్ట్స్‌ డిసేబుల్ చేయాలి.

* వాట్సాప్‌లో ఇన్‌కాగ్నిటో మోడ్‌
బ్రౌజర్ ద్వారా ఇన్‌కాగ్నిటో మోడ్‌లో వాట్సాప్‌ని వాడితే అవతలి వ్యక్తికి తెలియకుండా స్టేటస్ చూడవచ్చు. ఆఫ్‌లైన్‌లో కూడా స్టేటస్ చూడొచ్చు కానీ మీరు ఆన్‌లైన్‌కి తిరిగి రాగానే అవతలి వ్యక్తికి మీరు స్టేటస్ చూసినట్లు తెలుస్తుంది. కాబట్టి స్టేటస్‌ను గడువు ముగిసే సమయంలో చూసి కాసేపు ఆఫ్‌లైన్‌లో ఉంటే సరిపోతుంది.

ఇది కూడా చదవండి : శాంసంగ్‌ నుంచి ఒన్‌ప్లస్‌ వరకు.. రూ.25 వేలలోపు లభిస్తున్న బెస్ట్‌ 5జీ స్మార్ట్‌ఫోన్‌లు ఇవే..

* వాట్సాప్‌ను ఫోర్స్ స్టాప్ చేయాలి
వాట్సాప్ స్టేటస్ ఆఫ్‌లైన్‌లో వీక్షించి.. కొద్ది నిమిషాల తర్వాత దానిని ఫోర్స్ స్టాప్ చేయాలి. ఆ తర్వాత ఇంటర్నెట్ ఆన్ చేసినా మీరు అవతలి వ్యక్తి స్టేటస్ చూసినట్లు వారికి తెలియదు.

* ఫోన్ ఫైల్ మేనేజర్ ద్వారా వాట్సాప్ స్టేటస్ ఎలా చూడాలి?

ఆండ్రాయిడ్ యూజర్లు ఫైల్ మేనేజర్‌లో దాగిన ‘వాట్సాప్ స్టేటస్’ ఫోల్డర్ ద్వారా వాట్సాప్ స్టేటస్ చూడవచ్చు. అదెలాగో తెలుసుకుందాం.

- ఫైల్ మేనేజర్‌కి వెళ్లాలి.

- ఇంటర్నల్ స్టోరేజీని ఓపెన్ చేసి, వాట్సాప్‌పై నొక్కండి.

- మీడియా ఫోల్డర్‌ను ఓపెన్ చేసి 'స్టేటసెస్' ఫోల్డర్‌పై నొక్కాలి.

- కాంటాక్ట్స్‌ షేర్ చేసిన వాట్సాప్ స్టేటస్‌లోని అన్ని ఫొటోలు ఇక్కడ కనిపిస్తాయి

- స్టేటస్ ఫోల్డర్ కనిపించకపోతే, ఫైల్ మేనేజర్ సెట్టింగ్స్‌కు వెళ్లి, 'Show Hidden Files'పై క్లిక్ చేయాలి. అప్పుడు ఫోల్డర్ కనిపిస్తుంది. ఆండ్రాయిడ్ 11 యూజర్లు సెట్టింగ్స్‌> ఇంటర్నల్ స్టోరేజ్ > ఆండ్రాయిడ్> మీడియా> WhatsApp.com > వాట్సాప్> మీడియా ద్వారా స్టేటస్‌లు వ్యూ చేయవచ్చు.
Published by:Sridhar Reddy
First published:

Tags: Tech news, Whatsapp, Whatsapp number, Whatsapp tricks

తదుపరి వార్తలు