WhatsApp Tips: ఈ సింపుల్ టిప్స్‌తో వాట్సప్ బ్యాక్‌గ్రౌండ్ మార్చండి ఇలా

WhatsApp Tips: ఈ సింపుల్ టిప్స్‌తో వాట్సప్ బ్యాక్‌గ్రౌండ్ మార్చండి ఇలా (ప్రతీకాత్మక చిత్రం)

WhatsApp Tips | మీరు వాట్సప్‌లో బ్యాక్‌గ్రౌండ్ (WhatsApp Background) మార్చాలనుకుంటున్నారా? వాట్సప్‌లో అన్ని ఛాట్స్‌కి మాత్రమే కాదు మీరు కోరుకున్న ఛాట్స్‌కి బ్యాక్‌గ్రౌండ్ మార్చొచ్చు. ఎలాగో తెలుసుకోండి.

  • Share this:
    మీరు వాట్సప్ యాప్ ఉపయోగిస్తున్నారా? రొటీన్‌గా కనిపించే బ్యాక్‌గ్రౌండ్ చూసి బోర్ కొడుతోందా? వాట్సప్ బ్యాక్‌గ్రౌండ్ (WhatsApp Background) మార్చొచ్చు. యూజర్లు తమ వాట్సప్ బ్యాక్‌గ్రౌండ్ మార్చే అవకాశం కల్పిస్తోంది వాట్సప్. యాప్‌లో అనేక కస్టమైజేషన్ ఆప్షన్స్ కల్పిస్తోంది. అలాంటివాటిలో వాట్సప్ బ్యాక్‌గ్రౌండ్ మార్చడం కూడా ఒకటి. యూజర్లు తమకు నచ్చిన వాల్‌పేపర్‌ను (WhatsApp Wallpaper) బ్యాక్‌గ్రౌండ్‌గా పెట్టుకోవచ్చు. వాట్సప్ యాప్‌లో ప్రీ-లోడెడ్ వాల్‌పేపర్స్ ఉంటాయి. సాలిడ్ కలర్స్ కూడా ఉంటాయి. ఇవి మాత్రమే కాదు... యూజర్లు తాము క్లిక్ చేసిన ఫోటోను కూడా వాల్‌పేపర్‌గా సెట్ చేసుకోవచ్చు. కేవలం కొన్ని క్లిక్స్‌తో వాట్సప్ బ్యాక్‌గ్రౌండ్ మారిపోతుంది.

    వాట్సప్‌లో మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్ ఏంటంటే ప్రతీ ఛాట్‌కు వేర్వేరుగా బ్యాక్‌గ్రౌండ్ సెట్ చేసుకోవచ్చు. అన్ని కాంటాక్ట్స్‌లో ఛాట్ విండోస్ ఒకేలా కాకుండా వేర్వేరు ఛాట్స్‌కు వాల్‌పేపర్ యాడ్ చేయొచ్చు. లైట్ మోడ్, డార్క్ మోడ్‌లో కూడా వాల్‌పేపర్స్ మార్చుకునే అవకాశం ఉంది. మరి వాట్సప్‌లో ఛాట్స్‌కి బ్యాక్‌గ్రౌండ్ ఎలా మార్చాలో తెలుసుకోండి.

    WhatsApp: వాట్సప్‌లో కొత్తగా 'సెల్ఫ్​ చాట్' ఫీచర్​... ఎలా పనిచేస్తుందంటే

    అన్ని ఛాట్స్‌కి బ్యాక్‌గ్రౌండ్ మార్చండి ఇలా...


    ముందుగా మీ వాట్సప్ ఓపెన్ చేయండి.
    కుడివైపు ఉన్న త్రీడాట్స్ క్లిక్ చేసి సెట్టింగ్స్ ఓపెన్ చేయండి.
    ఛాట్స్ సెలెక్ట్ చేయండి.
    ఆ తర్వాత Wallpaper సెలెక్ట్ చేయండి.
    Change పైన క్లిక్ చేయండి.
    Bright, Dark, Solid Colours, My Photos ఆప్షన్స్ కనిపిస్తాయి.
    మీరు కోరుకునే ఆప్షన్ సెలెక్ట్ చేసి వాల్‌పేపర్ సెలెక్ట్ చేయాలి.
    ఆ తర్వాత Wallpaper Preview పైన క్లిక్ చేయాలి.
    వాల్‌పేపర్ మారిస్తే ఎలా కనిపిస్తుందో తెలుస్తుంది.
    Set Wallpaper పైన క్లిక్ చేస్తే వాల్‌పేపర్ మారుతుంది.

    Samsung Galaxy M32 5G: రూ.20,999 విలువైన స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్‌ఛేంజ్‌లో రూ.1,199 ధరకే కొనండి ఇలా

    వ్యక్తిగత ఛాట్స్‌కి బ్యాక్‌గ్రౌండ్ మార్చండి ఇలా...


    ముందుగా వాట్సప్ యాప్ ఓపెన్ చేయండి.
    మీరు ఏ ఛాట్‌కి వాల్‌పేపర్ మార్చాలో ఆ ఛాట్ సెలెక్ట్ చేయండి.
    కుడివైపు టాప్‌లో త్రీడాట్ క్లిక్ చేసి Wallpaper సెలెక్ట్ చేయాలి.
    Bright, Dark, Solid Colours, My Photos ఆప్షన్స్ కనిపిస్తాయి.
    మీరు కోరుకునే ఆప్షన్ సెలెక్ట్ చేసి వాల్‌పేపర్ సెలెక్ట్ చేయాలి.
    ఆ తర్వాత Wallpaper Preview పైన క్లిక్ చేయాలి.
    వాల్‌పేపర్ మారిస్తే ఎలా కనిపిస్తుందో తెలుస్తుంది.
    Set Wallpaper పైన క్లిక్ చేస్తే వాల్‌పేపర్ మారుతుంది.

    iQOO 7 5G: రూ.29,990 విలువైన స్మార్ట్‌ఫోన్ ఎక్స్‌ఛేంజ్‌లో రూ.8,000 లోపే... ఆఫర్ మరో వారమే

    డిఫాల్ట్ వాల్‌పేపర్ సెట్ చేయండి ఇలా


    ముందుగా మీ వాట్సప్ ఓపెన్ చేయండి.
    కుడివైపు ఉన్న త్రీడాట్స్ క్లిక్ చేసి సెట్టింగ్స్ ఓపెన్ చేయండి.
    ఛాట్స్ సెలెక్ట్ చేయండి.
    ఆ తర్వాత Wallpaper సెలెక్ట్ చేయండి.
    కింద ఉన్న Default Wallpaper పైన క్లిక్ చేస్తే డిఫాల్ట్ వాల్‌పేపర్ సెట్ అవుతుంది.
    Published by:Santhosh Kumar S
    First published: