WHATSAPP SUBSCRIPTION WHATSAPP ON THE WAY TO THOSE APPS NEW PLAN TO COLLECT MONEY FROM USERS GH VB
WhatsApp Subscription: ఆ యాప్స్ బాటలోనే వాట్సాప్.. కమర్షియల్ వైపు వాట్సాప్ అడుగులు..
ప్రతీకాత్మక చిత్రం
అడ్వాన్స్డ్ ఫీచర్లను పెయిడ్ సబ్స్క్రిప్షన్ సర్వీస్ (Subscription Service)లో మాత్రమే యూజర్లకు ఆఫర్ చేయాలని వాట్సాప్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో వాట్సాప్ యూజర్ల నుంచి డబ్బులు వసూలు చేయడానికి కొత్త ప్లాన్ తీసుకొస్తున్నట్లు అర్థమవుతోంది.
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (WhatsApp) ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను లాంచ్ చేస్తోంది. ఇందులో భాగంగా వాట్సాప్ ఇటీవలే మల్టీ-డివైజ్ సపోర్ట్ (Multi-Device Support) ఫీచర్‌ను తన యూజర్లకు అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫీచర్‌తో యూజర్లు ఒకే నంబర్‌తో ఒకేసారి నాలుగు డివైజ్‌ల్లో వాట్సాప్ వాడుకోవచ్చు. అంతేకాదు, ప్రైమరీ ఫోన్‌ను 24x7 ఇంటర్నెట్కు(Internet) కనెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. అయితే ఇదే ఫీచర్లో ఒక అప్డేట్ను తీసుకొచ్చేందుకు వాట్సాప్ సిద్ధమైనట్లు వాట్సాప్ బీటా ఇన్ఫో లేటెస్ట్ రిపోర్ట్ తెలిపింది. ఈ అప్డేట్ (Update) వచ్చాక యూజర్లు(Users) ఒకేసారి నాలుగు కంటే ఎక్కువగా డివైజ్‌ల్లో(Device) వాట్సాప్ సేవలు(WhatsApp Services) ఉపయోగించవచ్చు.
అయితే, ఈ సదుపాయం డబ్బులు చెల్లించిన వారికి మాత్రమే అందుబాటులో ఉండనుంది. ఎందుకంటే ఈ తరహా అదనపు అడ్వాన్స్డ్ ఫీచర్లను పెయిడ్ సబ్స్క్రిప్షన్ సర్వీస్ (Subscription Service)లో మాత్రమే యూజర్లకు ఆఫర్ చేయాలని వాట్సాప్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో వాట్సాప్ యూజర్ల నుంచి డబ్బులు వసూలు చేయడానికి కొత్త ప్లాన్ తీసుకొస్తున్నట్లు అర్థమవుతోంది. ఈ నేపథ్యంలో సబ్స్క్రిప్షన్ ధర ఎంత? ఈ సబ్స్క్రిప్షన్ మంత్లీ ప్లాన్‌గా ఉంటుందా లేక ఇయర్లీగా ఉంటుందా అనేది ఆసక్తిగా మారింది.
వాట్సాప్ బీటా ఇన్ఫో లేటెస్ట్ రిపోర్ట్ ప్రకారం, సబ్స్క్రైబర్లకు కొన్ని అదనపు ఫీచర్లను అందించే లక్ష్యంతో కంపెనీ బిజినెస్ అకౌంట్స్ కోసం కొత్త ప్లాన్‌ను అభివృద్ధి చేస్తోంది. ఈ అదనపు ఫీచర్లలో గరిష్ఠంగా 10 డివైజ్‌లకు వాట్సాప్ అకౌంట్ లింక్ చేసే అడ్వాన్స్డ్ మల్టీ-డివైజ్ సపోర్ట్ ఉందని వాట్సాప్ బీటా ఇన్ఫో తెలిపింది. ఈ ఫీచర్‌ను మొదటగా వాట్సాప్ బిజినెస్ (WhatsApp Business) యూజర్లకు అందుబాటులోకి తేవాలని కంపెనీ యోచిస్తోంది. దీనర్థం ఈ ఫీచర్ సాయంతో ఒక బిజినెస్లోని 10 మంది వరకు వ్యక్తులు మనీ చెల్లించి ఒకే అఫీషియల్ వాట్సాప్ అకౌంట్ నుంచి క్లయింట్లు లేదా కస్టమర్లతో కమ్యూనికేట్ చేయవచ్చు. ఎక్కువ మంది బిజినెస్ వ్యక్తులు ఒకేసారి అఫీషియల్ వాట్సాప్ అకౌంట్‌కు యాక్సెస్‌ను కలిగి ఉండటానికి ఇది అనుమతిస్తుందని రిపోర్ట్ తెలిపింది. కస్టమర్లతో రిలేషన్షిప్ బలోపేతం చేసుకోవాలనుకునే వారికి ఇది యూజ్‌ఫుల్ గా ఉంటుంది.
ఈ ఫీచర్‌తో సహా సబ్స్క్రిప్షన్ సర్వీస్‌లో కంపెనీ ఏ ఫీచర్లను అదనంగా యాడ్ చేసిందో ఇంకా తెలియరాలేదు. ఆండ్రాయిడ్ లేదా వాట్సాప్ బిజినెస్ ఐఓఎస్ వెర్షన్లో ఈ కొత్త ఫీచర్లు కనిపించలేదు. దీన్ని బట్టి ఇవి ప్రస్తుతానికి టెస్టింగ్ దశలోనే ఉన్నాయని తెలుస్తోంది. త్వరలో ఈ పెయిడ్ ఫీచర్లు బీటా వెర్షన్ లో అందుబాటులోకి వచ్చి ఆ తర్వాత రెగ్యులర్ యూజర్లందరికీ పరిచయం కానున్నాయి. భవిష్యత్తులో వాట్సాప్ బిజినెస్ సర్వీస్ పెయిడ్ సర్వీస్‌గా మారే అవకాశం ఉందని కొందరు టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
వాట్సాప్ ఫ్రీగా మరిన్ని ఫీచర్లు తీసుకొచ్చేందుకు కూడా రెడీ అవుతోంది. యూజర్లు తమ స్మార్ట్ఫోన్లలో సేవ్ చేయని నంబర్లకు టెక్స్ట్ చేసుకునేలా వీలు కల్పించేందుకు వాట్సాప్ కృషి చేస్తోంది. ఆండ్రాయిడ్ వెర్షన్ వాట్సాప్ బీటా 2.22.8.11లో ఈ ఫీచర్ కనిపించింది.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.